కళ్లు తెరవరా సామీ..కాస్త పట్టించుకో పేపర్‌ని


ఏం చేస్తున్నారా సామీ..వేలకి వేలు డబ్బులు జీతాలుగా ఇస్తున్నా కనీసం కామన్ సెన్స్ లేకుండా రాస్తున్నారని ఒక్కరోజైనా నిలదీస్తే..ఇలాంటి తప్పులు దొర్లవు కదా...మనకెప్పుడూ వాడిమీద ఏ నెగటివ ్  స్టోరీ రాయాలి..వాడ్నెలా బద్నామ్ చేయాలి...వీడ్నెలా రొంపిలోకి లాగాలి ఇవే ఆలోచనలు...అందుకే కదా..చెరపకురా చెడేవు అనేది.. అవతలివాడికి ఓ కన్ను పోవాలనుకుంటే మనకి రెండు కళ్లు పోయేది కూడా ఇందుకే కదా

పైన చూడండి..మన నందమూరి నటతిలకం.గారి రాబోయే సిినిమాపై ఓ వార్త రాసేసి దాన్ని ఫ్యాన్స్ కి అందిద్దామనే ఆత్రంలో ఏమీ విషయం లేకుండా..ఊహాగానాలతో రాసిన ఓ స్టోరీ..బాలకృష్ణ కవలలుగా కన్పిస్తారట..ఐతే ఏంటి..అంటారా..రాముడు భీముడు..అపూర్వసహోదరులులో కవలలుగా నటించిన బాలయ్య..కవలలుగా కన్పించలేదట..ఏంటి బాబూ దీనర్ధం...అంటే బాలకృష్ణ డ్యూయెల్ రోల్  చేస్తున్నాడు అని చెప్పడమే సదరు రచయిత తాపత్రయం దానికెందుకు ఇంత బాధ...

ఇంత రాసిన హీరోగారికి..అన్నిటీకి..అట అట అంటూ అట్లేసుకోవడం ఎందుకు..అంటే ఆ తర్వాత ఆ సినిమా అలా లేకపోతే..ఎవరైనా తప్పు బడతారనా...ఆ లెక్కన ఎన్ని తప్పులకు మిమ్మల్ని నిలదీయాలి..ఆ పనెవరూ చేయరు కదా..మాలాగా ఏ సోర్స్ లేనివాళ్లు రాస్తే బాధపడాలి..బోలెడంత జీతాలు తీసకుుంటూ..కూడా...ఓ అథెంటిసిటీతో కథనం రాయలేనప్పుడు ఎందుకు బాబూ...పైగా సినిమా కథనాలకి కూడా ఈ జాడ్యమేనా..!

Comments