శభాష్ కుర్రవాడా..ఇందుకే భారత్ వేదభూమి...అనుబంధాలకు పుట్టినిల్లు


దేశంలో టాలెంట్ కేం కొదవలేదు..అలానే..కాస్త అవకాశం వస్తే చాలు..ఇతర దేశాలకు ఎగిరెళ్దామనుకునేవాళ్లకీ కొదవలేదు..ఈ మధ్యనే అభిజీత్ బెనర్జీ ఏమన్నాడో విన్నాం..భారత్ లోనే ఉన్నట్లైతే..నోబెల్ దక్కి ఉండేది కాదేమో అన్నాడు కదా...అంటే ఈ దేశంపై ఆయనకి చిన్న చూపు అని కాదు..ఈ దేశంలోని పరిస్థితులు..జనాలకు వచ్చే గుర్తింపు..అలానే ఈ దేశంపై ఇతర దేశాల పర్ స్పెక్టివ్ అన్నీ కలిపి ఆ మాటకి అర్ధం చేకూరుతాయ్

మరిప్పుడు మన కథానాయకుడికి టీనేజ్ మాత్రమే 19 ఏళ్లు ...ఇప్పటికే రెండు పేటెంట్ రైట్స్ ఉన్నాయి...నాసా నుంచి వచ్చి జాయినైపోమ్మని కబురు కూడా వచ్చింది..ఇంకా మా స్టార్టప్ కంపెనీల్లో చేరిపోమ్మని 30 ఆఫర్లు అనేక దేశాల నుంచి వచ్చాయట...ఇన్ని ఉన్నా..కూడా మనోడు మాత్రం ఇక్కడే ఉంటా..ఇండియాకే నా సేవ చేస్తానంటున్నాడు..ఎవరయ్యా ఇతగాడంటే..బీహారీ బాబు  లోనే ఉన్నాయి.

ఇన్నోవేటర్..రీసెర్చ్ స్కాలర్..బ్రాండ్ అంబాసిడర్..ఇలా అన్నీ కలిపి ఓ మోటివేషనల్ స్పీకర్..అయిన మన హీరో పేరు గోపాల్జీ.. ఊరు భగల్పూర్..తండ్రి ప్రేమ్ రంజన్ కున్వర్..(తల్లి వివరాలు మాతృ కథనంలో లేదు) మామూలు రైతు..ఐతేనేం ఆశలకేం తక్కువ లేవు..గోపాల్జీకి..టెన్త్ చదువుతున్నప్పుడే మంచి ప్రైజ్ గెలుచుకున్నాడు..తర్వాత అంటే 2017లో మోదీని కలిశాడు..అక్కడ్నుంచి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి..అక్కడ్నుంచి..నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కి పంపబడ్డాడు..అక్కడే 3-4 ఆవిష్కరణలు చేసాడు..
వాటిలో ఒకటి మెటల్స్ లో వాడే అల్లాయ్స్ గోపోనియమ్ అల్లాయ్...మనోడి పేరుతోనే తయారు చేసుకున్నాడు..హై టెంపరేచర్ దగ్గర కూడా తన స్థితి కోల్పోకపోవడం ఈ అల్లాయ్ స్పెషాల్టీ. అప్పట్నుంచి నాసా సైంటిస్టుల నుంచి కూడా కబురు రావడం వరకూ గోపాల్జీ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది..
నలుగురి సంతానంలో మూడోవాడైన గోపాల్జీ..తండ్రి సంపాదన కేవలం బతకడానికి మాత్రమే సరిపోయేదని చెప్తాడు..చివరికి చెల్లెలిని సాకలేక..తాతగారి ఊరికి పంపించారంటే పేదరికం ఎంత దుర్భరమైందో..చెప్పక్కర్లేదుగా
కాళ్లు చాపుకోవడానికి కూడా లేని పాక..ఇల్లు..ఇప్పుడు మరి కాస్త సిచ్యుయేషన్ మారిందేమో..ఎందుకంటే..గోపాల్జీ ఇప్పుడు  డిజిటల్ ఎడ్యుకేషన్ కి బ్రాండ్ అంబాసిడర్..
డెహ్రాడూన్ లోని గ్రాఫిక్ ఎరా లో బిటెక్ థర్డియర్ చదూతూన్న గోపాల్జీకి తనలాగే వందమందిని తయారు చేయాలనే సంకల్పంగా చెప్తున్నాడు..నిజమే కదా..ఈరోజుల్లో ఆస్తిపాస్తులంటే నిజమైన చదువే కదా....
సరే గోపాల్జీ ఆవిష్కరణలలో ఒకదాన్ని చెప్పుకుందాం...జస్ట్ చెత్తగా పడేసే అరటి బోదెల నుంచి చార్జింగ్ చేయగలగడం ఓకటి...

మిగిలినవి ఇవిగో కింద ఉన్నాయ్



Comments