సిట్‌తో భయం లేదంటారు..మళ్లీ రాజకీయ కక్షంటారు..ఏది డిసైడ్ చేస్కోవాలి ఉమా


ఇంతే ఉంటాయ్...పాత్రలు వేరు..పాత్రధారులు మారుతారు..అంతే తప్ప..మాటలు ఇలానే ఉంటాయ్ మన పాలిటిక్స్ లో వీరున్నప్పుడు వారు...వారున్నప్పుడు వీరు..ఐతే ఇలా టిడిపివాళ్లలాగా రాజకీయ కక్ష సాధింపు అనే డైలాగు మాత్రం ఇంకే పార్టీ వాడదు..ఎందుకంటే దానిపై వాళ్లకే పేటెంట్ రైట్ ఉందంటారేమో..లేకపోతే మెడికల్ స్కామ్..లో తెలంగాణలో చాలామందిపై ఆరోపణలు వచ్చాయ్..ఐతే గత ఐదేళ్లుగా ఇక్కడ అదికారంలో ఉన్నది ఇప్పుడున్న సర్కారు పెద్దలే కావడంతో..పాపం అధికారులు...చిన్న చిన్న చేపలపైనే అంతా ఆరోపణలు...అరెస్టుల పర్వం నడిచిపోయింది..
కానీ ఏపీలో అలా కాదుగా జనం తిరగబడ్డారు..తెలుగుదేశం తిరగబడింది. పాత్రలు మారిపోయాయ్..కొత్త మంత్రులు వచ్చేశారు..ఆ స్కామ్..ఈ స్కామ్ అని తిరగదోడుతున్నారు..అసలు ఏ పని మొదలుపెట్టినా..కనీసం 10శాతం తినకుండా ఏ పనైనా పూర్తవుతుందా లేదు కదా...( ఇలా అనడంతో అన్నీ అవినీతితోనే జరిగిపోయాయని చెప్పడం లేదు..తీరు అలా ఉందని చెప్పడమే ఉద్దేశం)  అలాంటప్పుడు ఎంక్వైరీ వేయగానే మాజీ మంత్రి ఉమగారు ప్రెస్ మీట్లతో రెచ్చిపోతున్నార్..ఏయ్...ఏంటిది..మా మంత్రులు మంచోళ్లు అసలు అచ్చెన్నాయుడిపై ఆరోపణలేంటి..ఆపండి..అంటూ మరోవైపేమో రాజకీయకక్ష సాధింపంటాడు..ఆ నోటితోనే మేమంతా మంచి ముత్యాలం ఎవరికీ భయపడమంటారు...ఇదేదో అర్ధంకాని వ్యవహారం ఎందుకంటే...ఏ తప్పు చేయలేదని చెప్పిన నోటితోనే..రాజకీయకక్ష సాధింపని వగచడంలో అర్ధం లేదు...

తప్పు చేయనప్పుడు ఏం హీక్కుంటారో..హీక్కోండన్నట్లుగా ఉండొచ్చుగా..తప్పు  చేయనివారిని ఎలా వేధిస్తారు...అంటే ఈ విద్యలో పొలిటికల్  లీడర్లకి చట్టాలు కూడా సహకరిస్తాయా...అంటే అందులో కాస్త అనుభవం టిడిపికి ఉండబట్టేనా..ఇలా ముందే కంగారుపడుతుంది..అయినా వైఎస్సార్సీపీ ఇలా మాజీ మంత్రులను అరెస్ట్ చేయిస్తుందని ఎవరూ అనుకోవక్కర్లేదు.ఎందుకంటే వాళ్ల మాటలు ఏ పోలీస్ బాసూ ఇప్పుడు వినడం లేదు...

Comments