వీళ్లు మారకకూడదు..మారితే మనకెలా మసాలా న్యూస్ వస్తాయ్?

ప్రతి రాష్ట్రం ఆదాయం కోసం ఎక్సైజ్ శాఖపైనే ఆధారపడుతుంది..ఈ పరిస్థితి పోవాలి..అసలు మద్యపాన నిషేధం రావాలి..అనే ఈ డైలాగులు చాలా సార్లు ఎన్నికలకు ముందు వింటుంటాం..ఐతే వాస్తవంలో మాత్రం రాష్ట్రాలు అలా చేయడం లేదంటూ రాతలు..కోతలు..కూడా టివిల్లో చూస్తుంటాం..కానీ పైన హెడ్డింగ్ చూడండి...ఏపీలో మందు దొరకడం లేదట..తెలంగాణలోనేమో కాసుల విందు అట..ఏమైనా అర్ధం ఉందా..

ఐతే ఇలా రాయడం ద్వారా ఏపీలో మద్యపాన నిషేధం కాదు కానీ..పాక్షికంగానైనా మందు కొట్టడం తగ్గిందని చెప్పకనే సదరు పత్రిక చెప్పినట్లే కదా..కానీ రాతగారి ఉద్దేశం ఏమిటంటే..చూశారా మీరిక్కడ మందు లేకుండా చేస్తే..అది తెలంగాణకి వరమైంది..డబ్బులన్నీ తెలంగాణకు పోతున్నాయ్..జగన్ కేసీఆర్ కి ఇలా కూడా మేలు చేస్తున్నాడు అని చెప్పడమే పాపం..జాలేస్తుంది ఇలాంటి రాతలు చూస్తే..ఇంకా కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి హైదరాబాద్ లోన ఏపీ ఓటర్లకి కోపం కసి ఉన్నాయనుకుంటే అది భ్రమే..

ఓటర్లు వేరు..ప్రజలు వేరు..రాతగాళ్లకి ఈ తేడా తెలీకేం కాదు..ఊరికే  అరుగులపై కూర్చుని సొల్లు వాగుకునే వెధవాయలకు కాస్త టైమ్ పాస్ పల్లీ బఠానీ..మిక్చర్ పొట్లంలాంటి వార్తలే తప్ప..వీటిలో న్యూస్ ఏముంది..పైకి చెప్పే వార్తల ప్రయోజనం ఏముంది..దీంతో అర్జంట్ గా తెలంగాణకి బండేసుకుని వచ్చి తాగి పొమ్మని సంకేతం కానీ ఇవ్వడం లేదు కదా కొంపదీసి...

Comments