ఎన్నికలకు ఇక ఆరునెలలే టైమ్..గెలుపు నాదే..టిడిపి అధినేత ఫుల్ జోష్

చంద్రబాబునాయుడుగారు ఫుల్ జోష్ లో ఉన్నారు..ఏదైతేనేం తాను మళ్లీ చక్రం తిప్పడానికి ఓ అవకాశం దొరికింది..ఇకనేం దున్నేస్తాం అంటూ రెచ్చిపోతున్నారు..ఎన్నికలలో తిరిగి తామే గెలుపు సాధిస్తామని..వచ్చే ఎలక్షన్స్‌లో టిడిపిదే గెలుపంటూ తన పార్టీ కార్యకర్తలకు నేతలకు ఉత్సాహం తెప్పించారు..ఇంతా చేసి..అరే ఇది ఇంకా 2020నే కదా..అప్పుడే ఎన్నికలేంటి అంటున్నారా...అంతే ఆయన ఏది చెప్తే అది జస్ట్ ఫాలో అవ్వాలి అంతే

అప్పట్లో వైఎస్ జగన్ కూడా 2017 నుంచే అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయ్ అంటూ మొదలుపెట్టాడు..ఐతే ఆయన వాదనకి పిసరంత రీజనింగ్ ఉంది..ఏదో మోడీ ముందస్తుకి వెళ్తున్నాడు కాబట్టి వస్తాయనుకున్నారు..కానీ చంద్రబాబుగారి వ్యూహం మాత్రం జనాలకు మైండ్ బ్లాకు చేస్తోంది..ఇంకా నాలుగుఏళ్లకి కానీ రాని ఎన్నికలను అప్పుడే వచ్చేసినట్లుగా ఊహిస్తూ..జోష్ నింపడం అంటే..ఎన్నికల వరకూ ఇలానే ఉండాలా అన్నంత నిస్ప-హ రావడం ఖాయం..
లోకల్ బాడీ ఎలక్షన్స్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే..నో ప్రాబ్లెమ్...అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత తొందరగా జరిగితే టిడిపికి అంత మంచిది జనం..వాళ్లతో ఉన్నారో..లేక వైఎస్సార్సీపీతో ఉన్నారో తేలిపోతుంది..టిడిపి తరపునే ఉన్నట్లు తేలితే..హ్యాపీగా కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది.కానీ తేడా వస్తే..తేడా వచ్చినా కూడా పోయేదేం లేదు..కాడి పడేసి ఓ మూడేళ్ల తర్వాత మళ్లీ లేవచ్చు

Comments