ప్లేటు మారిపోయింది శివాజీ...జగన్ కి సపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అట

శివాజీ గుర్తున్నాడు కదా...మొత్తం సీన్ మారిపోయినట్లుంది..ఎహ నన్ను పిలవండి చాలు..ఏదోకటి కాకపోయినా..ఓ మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పండి..ఎలాంటిదైనా( విలన్, క్యారెక్టర్..కామెడీ..హీరో..) చేస్తానంటూ సంకేతాలు పంపించేసాడు..ఇన్నాళ్లూ గరుడ పురాణం చెప్పుకుంటూ బతికిన శివాజీకి హఠాత్తుగా జ్ఞానోదయం అయిపోయింది..కేసుల మహిమో...రాజకీయ క్రీడల్లో తానో బంతిని మాత్రమే అని అర్ధమైపోయిందో ఏమో కానీ...ఏపి సిఎం జగన్ ని జగన్మోహనరెడ్డి గారు..అంటూ( ఈ గౌరవం ఇది వరకు కన్పించేది కాదు) ఆయన హోదాకోసం వస్తే నేను ఆయనకి మద్దతిస్తా అంటూ. ఇక నాపై ట్రోలింగ్ చేయకుండా వదిలేయండ్రా బాబూ అన్న సిగ్నల్స్ ఇచ్చేశాడు

సినిమాల గురించి తన ఒపీనియన్ చెప్తూ..ఒకటే ఇంటర్వూని నాలుగైదు బొకే యూట్యూబ్ ఛానళ్లకి ఇచ్చేసాడు..వాటి పరమార్ధం ఏమిటంటే..అర్జంట్ గా ఇవి వైరల్ అయిపోయి ఆయనకు సినిమా ఛాన్సులు రావాలని..అడక్కపోయినా..అసందర్భంగానే శివాజీ చెప్పిన మాట..ఒకటి ఈ ధోరణికి సంకేతం..""ఎటూ ఈ నాలుగేళ్లు జగన్ మోహన్ రెడ్డిగారే సిఎం నాకు పెద్ద పనేం ఉంటుంది."

మొత్తం మీద శివాజీ ఇప్పుడు పూర్తిగా తన పనేదో తాను చూసుకోవడానికి సిద్ధపడినట్లు క్లియర్ గా అర్ధమవుతోంది..ఒకటి సినిమాలపైనే కాన్సన్ ట్రేషన్ అని చెప్పడం..రెండోది..రాజకీయాల్లో ఇక తన పని ఇప్పట్లో లేదని చెప్పడం..ఈ రెండింటి అర్దం మాత్రం ఒకటే..జస్ట్ ఐ వాంట్ ఛేంజ్...చూద్దాం మరి ఇండస్ట్రీ ఎలా ఆదరిస్తుందో శివాజీని

Comments

  1. కొంపతీసి బాబోరు ఈ జూనియర్ పైడ్ ఆర్టిస్టుకు పాకేజీ ఇవ్వడం ఆపేసారా హేమిటీ? హోదా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కనుక తదుపరి ప్రొడక్షన్ భ్రమరావతి ఆడిషన్ టెస్టుకు కూడా పిలువలేదేమో మరి.

    ReplyDelete

Post a Comment