అయ్యా వెంకయ్యా నీ నీతులు ఇప్పుడు చెప్పవయ్యా మోదీకి అమిత్‌షాకి( మధ్యప్రదేశ్‌పై).

అంత్యప్రాసలతో దడ దడలాడించే వెంకయ్యనాయుడు గారు ఈ మధ్య ఎక్కడికి వచ్చినా నీతిచంద్రిక వల్లిస్తున్నారు. ఆ మాటకి వస్తే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా అలానే చేస్తారు..రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారిని ఎవరూ  విమర్శించకూడదనే నిబంధన నిజంగానే ఉందో లేదో తెలీదు కానీ..ఆయనే పాపం చిడిపి ఎంపిలు..బిజెపిలో చేరిన వైనానికి సాక్షిగా కాదు..ఏకంగా వ్యవహారం పూర్తి చేయాలిసిన చిక్కులో పడ్డారప్పుడు..

అమరావతి..తెలుగు మీ్డియంపై ఎడాపెడా ప్రాసలతో ఉపరాష్ట్రపతిగారు దంచుతుంటే..మిగిలినవాళ్లు  అవన్నీ జగన్ మోహన్ రెడ్డికి చురకలనుకుంటూ మురిసిపోయేవాళ్లు..మరదే విషయం వాళ్లకెందుకు వర్తించదని మాత్రం అడిగే సాహసం చేయరు..ఇప్పుడలాంటి చిక్కే ఒకటి వచ్చింది..మధ్యప్రదేశ్ లో తాతలనాటి పార్టీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి జ్యోతిరాదిత్య సింథియా బిజెపిలో చేరబోతున్నాడు..ఆల్రెడీ చేరినట్లే అనుకోండి...
 పై ఫోటో చూడండి..కమల్ నాధ్ ప్రమాణస్వీకారం సందర్భంగా 2018 చివరిలో తీసిన ఫోటో...పాపం రాహుల్ గాంధీ ఖాతలో పడిన విజయాలలో ఈ రాష్ట్రం కూడా ఒకటి..అప్పట్లోనే జ్యోతిరాదిత్య సింధియాకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని రాహుల్ కూడా తాపత్రయపడినా..సోనియమ్మ పడనీయలేదు..ఇక దాంతో కాంగ్రెస్ లో ఉంటే అభివృధ్ద ిజరగదనుకున్న జ్యోతిరాదిత్య ఎట్టకేలకు 16,17 నెలలకు ఆ పని పూర్తి చేస్తున్నాడు..ఏకంగా ల ాంగ్ జంప్ కొట్టి పెద్దలసభకి బిజెపి తరపున ఎన్నిక కావడం ఖాయంగా కన్పిస్తుంది..అదైన తర్వాత కేంద్రమంత్రి అవుతాట్ట..
మరీ తతంగం అంతా కూడా రేపొద్దున్న వెంకయ్యగారు చూడరూ..రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేయించరూ..మరి అప్పుడు సుద్దులు గుర్తుకురావూ..ఓ పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి పదవులు దక్కించుకున్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడరా...వారికి (బిజెపి) సిఎం పీఠం..జ్యోతిరాదిత్యకి కేంద్రమంత్రి వర్గంలో చోటు..మరిలాంటి అధుబతమైన ప్రయోగాలకు..ఉపవాచస్పతి గారూ వాక్రుచ్చకపోతే ఎలా...కమాన్ మాట్లాడండి సర్..కమ్మనైన అమ్మ భాషలో ప్రాసలతో రెచ్చిపోండి.ఎదురు చూస్తున్నాం

Comments