క్రియేటివ్ డిఫరెన్సులా..చిరంజీవి సినిమాలో హీరోయిన్ కి క్యారెక్టర్ కూడా ఉంటుందా..త్రిషా




మొదలు కాని చిరంజీవి సినిమా...ఆచార్య అని పిలుస్తోన్నసినిమా నుంచి త్రిష కృష్ణన్ తప్పుకుంటున్నట్లు ఓపెన్ చేసింది..అది కూడా ఓపెన్ గా ట్విట్టర్‌లో..అంటే తనని చిరంజీవి సినిమాలో తీసుకున్నట్లు..తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్‌స్‌తో తానే వద్దనుకున్నట్లు లోకానికి చెప్పదలిచింది..లేదంటే ఈలోపే జనం ఆమెని తీసేసినట్లు ప్రచారం చేయగల బ్యాచ్ ఇక్కడ రెడీగా ఉంది కదా..

అసలు చిరంజీవి సినిమాలో హీరోయిన్లకి ప్రాధాన్యత ఉందా..ముందొకటి చెప్పి తర్వాతొకటి తీయడానికి..ఖైదీనంబర్ 150..అంతకు ముందు శంకర్ దాదా జిందాబాద్, ఎంబిబిఎస్..స్టాలిన్..ఠాగూర్, వీటిలో ఏ హీరోయిన్ పాత్రైనా బాగా జనాలకు గుర్తున్నాయా...లేవు కదా..పైగా ఇదే త్రిష స్టాలిన్ లో కూడా చేసింది..అపుడే లేని ప్రాధాన్యత ఇప్పుడొస్తుందా..అసలు ఇప్పుడు చిరంజీవి..నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కి హీరోియిన్లు దొరకడం లేదు..అందుకే కాస్త ముదురుగా కన్పించే నయనతార, స్నేహ..అంజలి, శ్రేయ వైపే  ఈనలుగురు చూస్తున్నారు..ఇంకాస్త యంగ్ గా ఉండాలంటే తమన్నా, కాజల్ ని తీసుకుంటున్నారు..అంతే తప్ప..వీళ్లకి ఏ హీరోయిన్ అయినా ఒకటే..ఆ కోణంలోనే త్రిష ఎంపిక జరిగింది తప్ప..ఆమెనే  ఎంచుకోవాలనే పంతం ఏదీ లేదు..అంత సీన్న ఉన్న క్యారెక్టర్లూ కాదు..ఐతే ఒక్క బాలకృష్ణ మాత్రం సోనాల్ చౌహాన్..వెంట పడి కాంబినే్షన్ రిపీట్ చేయించుకున్నాడు..ఆయనది వేరే ట్రెండ్ హీరోయిన్ ఎవరనేది చూడడు పెద్దగా..కథ ముందు నచ్చాలే కానీ..ఆయన క్యారెక్టరే పట్టించుకోడు ఒక్కోసారి..

అంచేత చెప్పొచ్చేదేంటంటే..త్రిషని కొరటాల అండ్ కో బాగానే హర్ట్ చేసారు..అందుకే ఇలా ఓపెన్ గా అందరికీ మంట పెట్టేసింది..

Comments

  1. పోస్టు బాగానే ఉంది కాని మీరు కూడా పోస్టులో త్రిషకి "స్టార్లు తమ సినిమాల్లో హీరోయిన్లకి ఇచ్చే గ్లామర్ కారెక్టరే" ఇస్తున్నారే!

    ReplyDelete
  2. ఆమెలోని ఈ కోణం నేను చూడలేదు..అందుకే మిగిలినవారికి కూడా పరిచయం చేద్దామని.. :)

    ReplyDelete
  3. గ్లామర్ కేరక్టర్ అయితే చేసేదే...ఆంటీ కేరక్టర్ ఇచ్చారట, కొరటాల సినిమా వదులుకోవడం, చిరంజీవితో చేయనని చెప్పడం గొప్పే కదా ?

    ReplyDelete
  4. గొప్పేం కాదు...ఎందుకంటే..చిరంజీవేం ఇప్పుడు రెచ్చిపోయి ఇండస్ట్రీని దున్నడం లేదు..పైగా నాగార్జునకి ఇదే సిచ్యుయేషన్..మీతో కాదు మీ కొడుకుతో చేస్తాం అని చెప్పి తప్పించుకుంటున్నారు..ముసలి హీరోలందరిక ఇదే పరిస్థితి..గ్లామరా..హ్యూమరా కాదు...హీరోయిన్ క్యారెక్టరా కాదా అంతే...కావాలంటే విజయ్ దేవరకొండతోనైనా చేస్తాం కానీ..ముసలి హీరోలతో చేస్తే..ఇక కెరీర్ ఫినిష్ అనే..

    ReplyDelete
    Replies
    1. 36 ఏళ్ళ త్రిషతో 30 ఏళ్ళ దేవరకొండ విజయ్ నటిస్తే మీకు నచ్చుతుందా ?
      ఆమెకు పాత్ర నచ్చక వదిలేసింది కాని చిరంజీవి వల్ల కాదు. ఇంతకుముందే చిరంజీవితో,వెంకటేష్ తో సూపర్ హిట్ సినిమాలు చేసింది.

      Delete
  5. తాత హీరోలు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమ కూతురి వయసులో ఉన్న హీరోయిన్లతో వెర్రి గంతులు వేయడమేమిటి.

    తమ కొడుకులు నటించిన వారితో తాతలు హీరోలుగా వేయడమేమిటి.

    తమ తరం వాళ్ళయిన రాధ రాధిక భానుప్రియ నదియా, మాధవి .. వీరితో తమ వయసుకు తగ్గ పాత్రలు వేస్తే బాగుంటుంది.



    ReplyDelete

Post a Comment