కరోనాని తైవాన్ ఎలా ఎదుర్కొందో చూడండి..మార్గదర్శి ప్రపంచానికే


చైనా పక్కనే ఉందీ దేశం..ఐనా కరోనా కాటు నుంచి ఈజీగా తప్పించుకుంది..అతి తక్కువ ప్రాణనష్టంతో సమర్ధవంతంగా వ్యవహరించింది...ఎలా కరోనాని కవర్ చేయగలిగింది
 ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతోంది. WHOనే కరోనాని అంటువ్యాధిగా ప్రకటించింది. చైనాలోని వుహాన్‌‌ కేంద్రంగా విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది..ఐనా తైవాన్ మాత్రం సమర్ధవంతంగా కరోనాని ఎదుర్కొంది..చైనా పక్కనే ఉంటూ..ఇతర దేశాలకు వేలల్లో వ్యాపించిన వైరస్‌ని తైవాన్ ఎలా ఫేస్ చేసిందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 చైనా వైరస్ ప్రభావం పొరుగున ఉన్న దక్షిణ కొరియాతోపాటు పశ్చిమాసియాలో ఉన్న ఇరాన్, యూరప్‌లో ఉన్న ఇటలీపైనా తీవ్రంగా ఉంది. చైనా తర్వాత కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాలివే. భారత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య 75 దాటింది. కానీ చైనా పొరుగున ఉన్న తైవాన్‌లో మాత్రం ఇప్పటి వరకూ 49 కరోనా వైరస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం.  తైవాన్ జనాభా రెండుకోట్ల 30లక్షలు... గత ఏడాది 2కోట్ల 70లక్షలమంది  చైనా నుంచి తైవాన్ వెళ్లొచ్చారు. దీన్ని బట్టే ఇరుదేశాల మధ్య రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఐనా  తైవాన్ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది.


చైనా, ద్వీప దేశమైన తైవాన్‌ మధ్య గగనతల దూరం 100 మైళ్ల లోపే. చాలా మంది తైవాన్ ప్రజలు ఉద్యోగం, వ్యాపారాల కోసం చైనాలో స్థిరపడ్డారు. 2019 చివర్లో కరోనా వైరస్ ప్రభావం మొదలు కాగా.. జనవరి నాటికి వుహాన్‌లో ఈ కేసుల సంఖ్య బాగా పెరిగింది.  కరోనా విజృంభణ మొదలయ్యాక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగ్గా.. ఈ వేడుకల కోసం చైనా నుంచి తైవాన్ వ్యాపారులు భారీ సంఖ్యలో కుటుంబాలతో సహా స్వదేశానికి చేరుకున్నారు. అదే సమయంలో రోజుకు 2 వేల మంది చొప్పున చైనా పర్యాటకులు తైవాన్‌ను సందర్శించారు. ఈ స్థాయిలో రాకపోకలు ఉంటే మరో దేశంలోనైతే కరోనా కేసులు వేలల్లో నమోదయ్యేవి.  ఐతే చైనాకు అత్యంత సమీపాన ఉన్న తైవాన్‌లో ప్రతి ఐదు లక్షల మందిలో ఒక్కరు మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. చైనాకు అత్యంత సమీపంలో ఉండటం, వాడుకలో ఉండేది ఒకే భాష కావడంతో.. వుహాన్‌లో తీవ్రమైన న్యుమోనియా విస్తరిస్తోందని తెలియగానే తైవాన్ అప్రమత్తమైంది. ముందుగానే జాగ్రత్త పడింది. ఎక్కడిక్కడ వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వైరస్ లక్షణాలు కన్పించగానే ట్రీట్‌మెంట్ ఇవ్వడం ప్రారంభించింది. అలానే సమాచారాన్ని స్వేచ్ఛగా ప్రజలకు చేరవేసింది..ప్రతి రోజూ వైరస్ గురించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేది ఇందుకోసం సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్‌ని ఏర్పాటు చేసింది. డిజిటల్ మీడియాని ఇందుకోసం తైవాన్ ప్రభుత్వం బాగా వాడుకుంది..ప్రతి మంత్రి సోషల్ మీడియాలో కరోనా గురించిన
అవగాహన చేసేవారు. అలానే ఫేస్ మాస్క్‌ల పంపిణీ కోసం ఆన్ లైన్ మ్యాప్‌లు కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడ ఎలా వ్యవహరించాలో ప్రజలకు వివరించేవారు..దీంతో
వైరస్ విజృంభణని ఎలా అరికట్టాలో ఇక్కడి ప్రజలకు ప్రత్యేకించి ఎవరో చెప్పక్కర్లేకుండా ప్రభుత్వం ఏది చెప్తే అది చేసారు.కరోనాని అణచగలిగారు..ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి దేశాన్నీ తమ పద్దతులను వివరించమని అడిగింది కానీ..మొదట్లో అసలు తైవాన్‌ని లెక్క కూడా చేయలేదు..బహుశా ఇప్పుడు తైవాన్ అనుసరించిన పద్దతినే
అన్ని దేశాలను అనుసరించమని కోరుతుందేమో చూడాలి

Comments