లినో అబెడ్ ఈయన బాధ్యతే అందరిలోనూ కావాల్సింది..బీ బ్రేవ్ బ్రో



కొత్త రకం వైరస్ లు పుట్టుకొచ్చినప్పుడల్లా హృదయవిదారకర సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతూనే ఉంటాయ్..నిఫా వైరస్ సోకి కేరళలో ఓ నర్సు రాసిన చివరి ఉత్తరం గుర్తుండే ఉంటుంది..తాను మృత్యువుకు చేరువ అవుతూ భర్తకి కుమార్తెకు రాసిన ఆ ఉత్తరం కన్నీళ్లు తెప్పించగా..ప్రస్తుతం అదే కేరళలో ఓ యువకుడు తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేని వైనాన్ని చదువుతున్నాం

తనకి వైరస్ లక్షణాలు కన్పించగానే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది..కానీ అప్పటికే అంపశయ్యమీద ఉన్న తండ్రి రెండు రోజులకే మరణించాడు..శరీరం అంతా మాస్క్ కప్పుకునే కవర్ కప్పుకునే వాటికి వెళ్లవచ్చు..ఎవరూ అడ్డుపెట్టరు..కానీ తనతో ఉన్న వైరస్ మిగిలిన ప్రపంచానికి ఎందుకు అంటించాలనే అనుమానంతో..కొండంత  ఆవేదనని దిగమింగుకుంటూ ఆస్పత్రిలోనే
ఉండిపోయాడతను..కానీ ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి వాళ్లే తండ్రి అంత్యక్రియలను టెక్నాలజీని వాడి..ఆన్ లైన్లో చూపించగలిగారు..ఇది కాదా బాధ్యతగా వ్యవహరించడమంటే..కొడుకు చేసినది సామాజీక బాధ్యతే అయితే..ఆస్పత్రి వాళ్లు చేసింది కూడా అంతే..

కానీ మన చుట్టూ ఉన్న జనం చూడండి..మీద మీద పడి తుమ్మి చచ్చే వెధవలు..కర్చీఫ్ కట్టుకుంటే ఎగతాళి చేసే సన్నాసులు..వాకింగ్ చేసే ఉచ్చలు పోసే మూర్ఖులు..సంఘద్రోహులు..ఇలాంటి వాళ్లతో పోల్చి చేూసినప్పుడు లినో అబెడ్ కి హ్యాట్సాఫ్ చెప్పొద్దా 

Comments