మాకు కరోనా అంటే భయమేనయ్యా..మరి ప్రభాసూ ఈ మాస్క్ సంగతేంటి


సినిమావాళ్లు తెరపైనే హీరోలు..బయట కాదు..ఈ మాట అందరికీ తెలిసినా..వాళ్లనో దైవదూతలుగా భావించేవాళ్లకి కరోనా మాస్క్‌తో కన్పించిన
ప్రభాస్ మంచి షాకే ఇచ్చాడు వాస్తవానికి ఈ వ్యాసం అప్పుడే రాద్దామనుకున్నా..మరీ వ్యక్తిగత దాడి అవుతుందనిపించింది.కానీ జూనియర్ ఎన్టీఆర్..రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కన్పిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్పారు..మంచిదే సినిమా వాళ్ళకి ఏ సమయంలో ఏ విషయంపై చెప్తే..తమ పాపులారిటీ పెరుగుతుందో..ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాకి బాగా పబ్లిసిటీ వస్తుందో బాగా తెలుసు..అందుకే త్రిబుల్ ఆర్ తారలు ఇలా వరసగా తెరపైకి వస్తున్నారు..ఈ మాట నచ్చనివాళ్లకి మనమో నమస్కారం పెట్టడమే..

కరోనాపై భయం వద్దని..అనవసరంగా మాస్క్‌లు ధరించవద్దని..చెప్పారు..ఇంకా హగ్గులు చేసుకోవద్దనీ పిలుపు ఇచ్చారు..మరి ఈ ప్రికాషన్స్ జనాలకే కానీ..వాళ్లకి కాదా
మీ సోదరుడు ప్రభాస్‌కి దగ్గు..జలుబు ఉంటేనే మాస్క్ పెట్టుకుని ఎయిర్ పోర్టులలో తిరుగుతున్నారా..లేదు కదా..అలానే హగ్గులు సంస్కృతి మీ దగ్గర్నుంచి 
జనాలకు అంటించారే తప్ప మాములూగా ఓ పదేళ్ల క్రితం ఈ హగ్గుల కల్చర్ ఎక్కడుంది..సరే అన్నిటికి సినిమావాళ్లపై పడి ఏడుస్తున్నారనుకోవద్దు కానీ...చెప్పేటందుకే నీతులు ఉన్నాయ్..చేసేటందుకు కాదు..అని చెప్పరాదూ...

Comments

  1. హగ్గుల కల్చర్ సినిమా వాళ్లు తెచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉంది.
    అక్బర్ బీర్బల్ ని ఎన్నిసార్లు కౌగిలించుకోలేదూ!

    ReplyDelete
  2. https://youtu.be/gp97y0cX5j4
    Oye Ninne Natho Vastava | Romantic Theme Dance | Directed by Ravikumar Pediredla

    ReplyDelete

Post a Comment