ఈ గ్రూప్ వాళ్లకి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువట..లిమిటెడ్ రిపోర్ట్



People with blood group ‘A’ may be more prone to Covid-19 while those with blood type ‘O’ has a lower risk of contracting the virus, a first-of-its -kind study claimed on Tuesday. Researcherslooked at blood group patterns of over 2,000 patients in China, South China Morning Post said. They found patients with blood group A also had more severe symptoms. Of 206 patients, 85 had type A blood — 63% more than 52 with O. IANS

కరోనా కథలు..రాసుకోవడానికి బోలెడంత ప్లాట్ ఇస్తోన్న సబ్జెక్ట్ 

కరోనా వైరస్ ఎలా పుడుతుంది..ఎక్కడ వస్తుంది..గాల్లో ఎంత సేపు ఉంటుంది..ఆ తర్వాత ఎలా పయనిస్తుంది..వంట్లోకి ఎలా చేరుతుంది..ఎలా ప్రాణం తీస్తుంది. అసలు నిజంగానే వైరస్సా...లేక జీవాయుధమా...ఇలా రకరకాలుగా  చిలవలు..పలవలుగా ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు..ఇలాంటి సమయంలో వస్తోన్న ఇంటర్నేషనల్ కథనాలు వేరే...

ఓ వైపు ఈ రిపోర్ట్ కి పూర్తి అథెంటిసిటీ లేదంటూనే మరోవైపు ఇదిగో ఈ గ్రూప్ వాళ్లకి ఎక్కువ రిస్క్ అంటూ ఓ స్టోరీ
ఐఎఎన్ఎస్ పబ్లిష్ చేసింది...ఏ గ్రూప్ బ్లడ్ వారికి కరోనా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంటూ ఓ  స్టోరీ రాసింది..
దానికోసం రీసెర్చ్ చేసినవాళ్లు చైనాలో 2వేలమంది కరోనా పేషెంట్ల బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే...వారిలో 206మందిలో 85మందికి ఏ టైప్ బ్లడ్  గ్రూప్..ఓ బ్లడ్ గ్రూప్ 52మంది తేలారట..అంటే ఓ బ్లడ్ గ్రూప్ కంటే 63శాతం ఎక్కువ
రిస్క్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఉందంటూ ఓ కంగాళీ రిపోర్ట్ ఇచ్చింది..

తీసుకున్న శాంపిల్స్ 2వేలు..అందులో చైనాలోనే తీసుకున్నారు..అక్కడే ఆ రిపోర్ట్ లోని పరిమితస్థాయి అర్ధమవుతుంది...అందుకే ఇప్పుడు కరోనా కంటే కరోనా కథలే ఎక్కువ భయపెడుతున్నాయ్

Comments