కేసీఆర్ గారు తాళం వేసి గొళ్లెం మరిస్తే ఎలా

అందరూ కరోనా గురించి వణుకుతుంటే కేసీఆర్ గారికి మాత్రం మరీ అంత భయపడక్కర్లేదంటారు..ఆయనకి అంతే..మరి అన్నీ అలా తెలిసిపోతాయ్..దేశంలోకి అందులోనూ ఒక్క హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచే వయా హైదరాబాద్ గత రెండు నెలల్లో 69వేలమంది దిగబడిపోయారు..వాళ్లలో కనీసం ఆరేడువందల మంది ఎవరికీ తెలీకుండా..ఏ టెస్టులూ చేయించుకోకుండా తెగ దర్జాగా జనంలో కలిసి మెలిసి తిరుగుతూ వైరస్ ని అంటించే పనిలో తెగ బిజీగా ఉన్నారట..ఇవాళ పొద్దున్న పేపర్లు చూస్తే ఆ వళ్లు జలదరించే వాస్తవం తెలుస్తుంది..

అక్కడికి మోదీగారే వచ్చి ఓ రేయ్ నాయానలారా..తేలిగ్గా తీసుకోకండ్రా అంటే..లైట్ తీసుకునే బాబులకు మనమేం చెప్పగలం...రేపు ఆదివారం కర్ఫ్యూ మరి కొ్న్ని రోజులు కొనసాగవచ్చు..అంత మాత్రాన..వైరస్ పోతుందని కాదు..కానీ ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఈ దొరగారు ఐసోలేషన్ లో ఉన్నోళ్లు కొంపలకు పోవచ్చంటూ వదిలేయడం ఏంటో ఆయనకే తెలియాలి..పద్నాలుగు రోజులు అక్కడే ఉంటే వచ్చే నష్టం ఏంటి..చేతులకు స్టాంపులు వేస్తే..అవి కన్పించేట్లు బయట తిరుగుతారా..కాదు కదా...క్వారంటైన్ లో ఉండలేకనే కదా...బైటికి పోతామంటుంది..బైటికి పోతే..ఇక పట్టపగ్గాలు ఉంటాయా..పైగా వైరస్ తన రూపం పూర్తిగా మార్చుకున్న సమయంల ఇలాంటి వెర్రి మొర్రి వేషాలేంటి...పద్నాలుగు రోజులు కాదు..ఏ ఇరవైరోజో...తన సత్తా చూపించి..ఈ ఐసోలేషన్ నుంచి బైటికి వచ్చినవాళ్లనుంచి తగులుకోవడం కుదరదని గ్యారంటీ ఉందా..

కోరంటైన్ లో ఉండటం నరకమే..కానీ వచ్చిన తర్వాత అక్కడే ఉండాలి..కావాలంటే ఐసోలే,న్ వార్డులలో ఓ టీవి..కాదు పది టివిలు పెట్టించండి..మొబైల్ ఫోన్లు ఇవ్వండి..వీళ్లైమైనా ఎక్కడ్నుంచైనా దిగి వచ్చారా..అంతా మనోళ్లే..అంతా ఆరోగ్యంగా ఉండాలనే కదా 

Comments