ఇంత విధ్వంసమవుతుందే..ఈనాడూ ఈ ద్వైధీభావన అవసరమా

ఓ వైపు వంటింటి చిట్కాలను నమ్మొద్దంటారు..మరోవైపు టన్నుల కొద్ద ీపేపర్లు అచ్చొస్తారు..అపోహ ...వాస్తవం అంటూ బిల్డప్ ఇన్యూస్ అవగాహన పేరుతో రేటింగ్స్ పెంచుకునేందుకు ప్లే చేస్తారు..మళ్లీ వాటినే ఇదిగో ఇలా తప్పించుకోవచ్చు వైరస్ నుంచి అంటూ మళ్ల పేజీలకు పేజీలు కాలమ్స్ లో నింపేస్తారు

పైన చూశారు కదా..పసుపు, వెల్లుల్లి, ఆలోవేరా, వేప, తులసి ఇలా ప్రతి చెట్టుకి సంబంధించి ఏదేది వాడొచ్చో ఓ పేజీ నిండా రాసిపారేసారు సదరు పత్రికోళ్లు...అదే పత్రిక పుత్రిక అయినా టీవి చానల్ మాత్రం అపోహలే అంటూ కొట్టిపారేస్తున్నారు..ఇది సమంజసమా..సిక్త్ సెన్స్ అని తెలుగు డబ్బింగ్ సినిమా వచ్చింది..ఆ సినిమా చివర్లో ఓ పాయింట్ చెప్తాడు సూర్య..ప్రతిదీ వేదాల్లో ఉన్నాయని చెప్పడం కాదు..అదీ సైన్సే అని అందరికీ చెప్పమంటాడు..అలానే  వెల్లుల్లి..అల్లంలో ఏ సైంటిఫిక్ మందులు లేవని ఎందుకు ప్రచారం చేయాలి...
ఇవన్నీ రోగ నిరోధక శక్తులు పెంచుతాయి..కానీ వాటంతట అవే మందులు కాదు అని చెప్పే దమ్ము ఉండాలి..
అలానే గతంలో వాళ్లట..ఇవన్నీ వాడి వైరస్ లను తరిమారట..

ఏం మీకు చెప్పారా..అలా అని..వాటినే మూఢనమ్మకం అని ఎందుకు కొట్టిపారేస్తున్నారు ఎవరైనా వైద్యం చేస్తుంటే..గతంలో అవి మన ఆచారాలు..వాటి వెనుకా సైన్స్ ఉందని చెప్పండి..అంతేకానీ ఎవడికి ఏది ఎప్పుడు ఎలా తోస్తే అలాంటి భాష్యాలెందుకు
తులసి , వేప, అలోవేరా అన్నీ మంచివే..వాడండి..అలోవేరాలో యాంటీ వైరస్ గుణం ఉంది కాబట్టే సానిటైజర్లలో కలుపుతున్నారు..వేప కూడా అంతే..

ఎక్కడో కన్పించకుండా డిస్ క్లెయిమర్ వేయడం కాదు దమ్ముంటే నిజంగా ఏది నమ్ముతారో అదే రాయాలి

Comments