ఆ సెలబ్రెటీ వెంట ఉన్నది ఎవరు..ఉద్యోగం ఎందుకు ఊడింది

ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఇప్పుడు చేతకానివారికి కేరాఫ్ అడ్రస్ మార్క్ గా చూడబడుతోంది..వందల కొద్దీ సినిమాలు..వేల కొద్దీ పాటలు రాసినవాళ్లు...సంగీతం చేసినవారు..అంతా గోడమీద అనుభవాలుగానే చూస్తున్నారు తప్ప వారినుంచి నేర్చుకోవాల్సింది ఏదీ లేనట్లు బిహేవియర్ చేసే చోట..ఒకటి రెండు విజయాలు సాధించడం...తలెగరేసి బతకడానికి ఆర్హతలుగా కన్పిస్తున్నాయ్..తల ఎత్తుకుని బతకడం వేరు..తలపొగరుగా బతకడం వేరు..నాలుగు బూతు మాటలు వదలడమే యూత్ ని ఆకర్షించే మంత్రంగా పెట్టుకున్న లోకంలో అర్దరాత్రి తిరుగుళ్లు కూడా మామూలు మనిషి లక్షణంగా చూడబడితే అది ఎవరి తప్పు?

అందుకే తలపగలకొట్టించుకుని..బొంగైనా వెనక్కి తగ్గనంటోన్న ఓ సెలబ్రెటీ ..ఇప్పుడు ఇంట్లో తీరిగ్గా రెస్ట్ తీసుకుంటుంటే..సదరు సెలబ్రెటీ వెంట చిత్తకార్తె చిందులేసిన మరో లేడీకి ఉద్యోగం ఊడిందంటున్నారు..అదెంతవరకూ నిజమో కానీ..వ్యక్తిగత విషయాలకు ఉద్యోగాలకు సంబంధం ఏంటి..అంటే పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నా...ప్రొఫెషనల్ లైఫ్ కూడా దానిపై బాసిజం చేస్తుందా...

ఎందుకు వాడితో తిరిగావనో..ఎందుకు అలా చేసావనో అడగొచ్చు...కానీ వ్యక్తిగత జీవితాలను బాసులు శాసించవచ్చా..సెలబ్రెటీలు..బయట ఎలా పడితే అలా బిహేవ్ చేయవచ్చా..ఎందుకంటే..జనం కళ్లు వారిపైనే ఉంటాయి కాబట్టి..ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలి..కాదు మా ఇష్టం అంటే..ఎలా..కాపాడటానికి ఎవరూ ముందుకు రారని..పబ్బు గబ్బు ఇష్యూ  చెప్తుంది కదా

Comments

  1. మొదట ఎవడు నోరు జారాడో మొదట ఎవడు చేయి ఎత్తాడో వాడికి పడాలి బ్యాండు.
    ఇంతకీ అసలు పబ్బు క్లోజింగ్ టైం ఎన్నిగంటలకో?!

    ReplyDelete
  2. లేదు మిత్రమా..నోరు జారడం గురించి కాదు..ఈ తన్నులాటలు కొత్త కాదు..ఇక్కడ సెలబ్రెటీలకు పర్సనల్ లైఫ్ ఉంటుందా..ఖచ్చితంగా ఉంటుంది..మరి ఈ ఇష్యూలో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయ్..అనేదే వ్యాసార్థం..పబ్పు గబ్బులు క్లోజింగ్ టైమింగ్స్ ఎప్పుడైనా..ఇంతే..ఎవడో ఒకడు ఎవరితోనో పోతాడు..దానిపై ఇతరులు కన్నెయ్యడం కాలేయడం చేయేయడం ..తర్వాత తన్నేసుకోవడం కామన్..అసలు ఎవడైనా పెళ్లాలలతో పబ్బులకు వెళ్తున్నారేమో చూపించండి

    ReplyDelete

Post a Comment