సామీ..జైపూర్ డాక్టర్స్ కరోనాని క్యూర్ చేస్తున్నారట..ఇంటర్నేషనల్ ఎంక్వైరీల హోరు

 
కరోనాకి మందెక్కడరా బాబూ అని ప్రపంచమంతా శోధిస్తుంటే...జైపూర్ డాక్టర్లు దానికి కాంబినేషన్ కూడా కనిపెట్టేసారు..అయితే పెరటి చెట్టు వైద్యానికి  పనికిరాదు కదా..దాన్ని అంగీకరించడానికి మనకి అహం అడ్డొస్తుంది..ఎహ..అమెరికా వాడు కనిపెట్టాలి..లేదంటే చైనా వాడు తయారు చేయాలి..ఇంకా మాట్లాడితే జపాన్ వాడు వేక్సిన్ తయారు చేయాలి అంతేకానీ ఇండియాలో వాళ్లు ఎలా కనుక్కుంటారు అని మనోళ్లే ఎగతాళిగా మాట్లాడుతున్నారు..ఇది మనోళ్ల నైజం వదిలేయాలి అంతే..


అంతేకానీ ఏదోలాగా వైరస్ ని చంపేశారు..కాస్త దాన్ని స్టడీ చేద్దాం..లేదంటే ఇంకాస్త రిపైన్ చేద్దామన్న ధ్యాసే ఉండదు..మనకి ఉండదు..కానీ అమెరికాకి ఉంది..అందుకే జైపూర్ ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీకి ఫోన్ కూడా చేసారుట..ఆ కాంబినేషన్ తెలుసుకుంటారు..వాళ్లూ వాడతారు..నయమైతే మాత్రం మన పేరు బైటికి చెప్పరు..ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో వేక్సిన్ తయారు చేస్తున్నారు కదా..ఆ అమ్మకాలు ఆగిపోవూ...నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం  ఇలానే జరుగుతుంది..

మార్చి 3న జైపూర్‌కి మొదటి కేసు తీసుకొచ్చినప్పుడు ప్రిన్సిపల్ కంట్రోలర్ సుధీర్ బండారి, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రకాష్ కేశ్వానీ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు..కరోనా వైరస్‌కి ఇలానే ట్రీట్ చేయాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా ఏ వైద్యుడూ ఓ ప్రోటోకాల్ తయారు చేయలేదు..కాబట్టి..మలేరియా, హెచ్ఐవి, స్వైన్ ఫ్లూ కి ఏ మందులైతే వాడారో..వాటిని కలిపిీ కరోనా పాజిటివ్ కేసులకు వాడటం ప్రారంభీించారు..వర్కౌట్ అయింది కూడా...

ఇదేదో గుడ్డేట్లో సక్సెస్ అవలేదు..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ట్రీట్ మెంట్ ప్రారంభించారు. అలానే పేషెంట్లనుంచి అనుమతి కూడా తీసుకున్నారు..అలా మొత్తం తమ వద్ద చేరిన ఏడుగురిలో నలుగురు పేషేంట్లను ఆరోగ్యవంతులుగా చేశారు..



Comments