కరోనా నిజంగా జడలు విప్పుతుందా..కమాన్ అందరం విడివిడిగా ఉమ్మడిగా ఓడిద్దాం


కరోనాపై యుద్ధమంటే..అదేదో దోమలపై యుద్ధం చేసినట్లు కాదు..అందరం విడివిడిగా ...కలిసి చేయాల్సిన పని..మనం ఇంకొకరిని టచ్ చేయకూడదు..వారిని టచ్ చేయనీయొద్దు..సింపుల్ గా ఉన్నా...చాలా కష్టం..మన ముక్కునే మనం రోజుకి 2వేల సార్లు టచ్ చేసే అలవాటు..అలాంటిది పక్కనోడు వచ్చి మీద పడుతుంటే ఆపగలమా...ఆపాలి..బైటికి వెళ్లకుండా ఉండాలి..ముఖ్యంగా పిల్లల్ని ఆపడం మాత్రం తలకి మించిన భారం..

అయినా సరే...మనకి కనబడుతున్న కేసులను చూసి మురిసిపోకూడదు..ఎందుకంటే కేవలం పూణేలోని వైరాలజీ సెంటర్ దగ్గర రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ...ఒక్క కేసూ బైటపడుతోంది..అంతే తప్ప..కొత్త కేసులు కాదివి..అందుకే దాదాపు 5వేల పాజిటివ్ కేసులు రావచ్చనే అంచనాతో కేంద్రం ఉంది..ప్రధానమంత్రి మోదీ కూడా రాత్రి చేసిన ప్రసంగం కాస్త భయపెట్టేలా ఉన్నా...వాస్తవం అదే..

మందలో గొర్రెలాగా..ఎవడేం చెప్తే అది విని షాపింగ్ మాల్స్ కి పరిగెత్తేజనం...మరి ఇది మాత్రం ఎందుకు వినరు. వేలంవర్రిగా గుంపులు కట్టుకుని తుపుక్ తుపుక్ మని రోడ్లపై ఉమ్మేసే జనం..వాకింగ్ చేసే ఉచ్చలు పోసే జనం..ఒకడి మీద ఒకడు పడి పడి పేపర్లు చదివేజనం..ఒక్క రోజు బైటికి రాకుండా ఉంటారా...ఉండాలి..తప్పదు...ఓ పది రోజులుైనా అలా ఉంటేనే..ఈ వైరస్ గాల్లో ఉంటుందో...ఇంకెక్కడ ఉంటుందో ఓ అంచనాకి వచ్చేది..కనీసం ఓ పన్నెండు గంటలు దేశం మొత్తం బంద్ అయితేనే వైరస్ కొత్తవారికి సోకదు..అలాగైనా..ఎంతమందికి సోకిందో ఓ నిర్ధారణ వస్తుంది..ఈ ఒక్క పని చేయండి...

Comments