ఏదైనా అమ్మేసే అమెజాన్‌తో నష్టం ఏముందా..ఇదిగో చూడండి


ఏది కావాలన్నా గూగుల్‌లో వెతకడం..కొనాలంటే అమెజాన్‌లో చూడటం..ఏం ఉంది అంతా లైఫ్ సింపుల్ అనుకునేవాళ్లకి ఇదో షాక్..ఓ వేళ తోలుమందంగాళ్లైతే చేసేదేం లేదు..ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లకి అలవాటు పడినప్పుడే మన జీవితాలను మొబైల్ ఫోన్ మేన్యుఫేక్చరర్స్ చేతిలో పెట్టేశాం...ఇక వీటితో ఏం నష్టం అనుకోవద్దు..

ఫిబ్రవరి 14, 2019 అందరికీ గుర్తుండి పోయే రోజే..వేలన్ టైన్స్ డే జరుపుకుంటుంటే..మనకి మాత్రం బాంబులతో పుల్వామాలో 40మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది పాకిస్తాన్..కాదు నేను కాదు..మీ వాళ్లే ఆ ప్లానేసారు..నేను జస్ట్ అగ్గిపుల్ల ఇచ్చానంటూ తప్పించుకోవచ్చు..ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఎందుకు జిహాదీగా మారిపోయాడో ముందు ఆలోచించండంటూ ఇమ్రాన్ ఖాన్ వేదాంతం ఫిలాసఫీ వల్లించవచ్చు కానీ..ఆయుధం అందించినవాడిదే కదా తప్పు...

గత పదిహేను రోజులనుంచి మోదీ భజన చానల్ ఒకటి ఒకటే హడావుడి చేస్తోంది..పుల్వామా అటాక్ వెనుక అసలు హస్తాలను బైటికి తెస్తున్నారు అంటూ...వాటికి తోడు అన్ని కేజీల ఆర్డీఎక్స్ ఎక్కడ నుంచి వచ్చిందంటూ అందరూ ప్రశ్నలేస్తున్నారు కదా..ఎక్కడ నుంచో కాదు..అమెజాన్ నుంచే కశ్మీర్ లో కూర్చుని ఆర్డర్ చేసి తెప్పించుకున్నారట అదిల్ అహ్మద్ దార్ అండ్ కో..లాస్ట్ వీక్ ఓ తండ్రీ కూతుళ్లని ఎన్ఎస్ఐ అరెస్ట్ చేయగా..నిన్న అమెజాన్ కూడా కన్ఫామ్ చేసిందట..నిజమే మా సైట్ నుంచే పేలుడు పదార్ధాలు కొనుక్కొచ్చారు అని.. శ్రీనగర్ లోని వయీజ్ ఉల్ ఇస్లామ్ అనే 18 ఏళ్ల టీనేజర్ ఇలా ఆర్డర్ చేసాట్ట.. మహ్మద్ అబ్బాస్ అనే వ్యక్తేమో అదిల్ అహ్మద్ దార్ కి షెల్టర్ ఇచ్చాడు.బహుశా ఇలా ముడిపదార్ధం వరసగా తెప్పించుకుని అబ్బాస్ ఇంట్లో ఆర్డీఎక్స తయారు చేసి ఉంటాడు..ఇంకా నయం తయారు చేసిన ఆర్డీఎక్స్ ని అదే అెమెజాన్ లో సెల్లింగ్ పెట్టి..అతనే పుల్వామా దగ్గర డెలివరీ తీసుకునేలా ప్లాన్ చేయలేదు..చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
అంటే ఇంత ఈజీ అన్నమాట మన దేశంలో ఉగ్రవాదదాడులు చేయడానికి..ఇప్పటికి కూడా అన్పించడం లేదా..అమెజానే కాదు..ఏ  సైట్ పై అయినా నిఘా ఉంటే తప్పేం ఉందని..ఏ వస్తువులు అమ్మకూడదు..ఏవి అమ్మాలి అని..

Comments