మోదీకీ కేసీఆర్ చెప్పారు..చెప్పకముందే ఆచరించారే..!

ఒకరిని మించి  ఒకరికి కీర్తి కండూతి..మామూలు రాజకీయనాయకులు కాదు వీళ్లు...అందుకే చైనా తరహా నిర్ణయాలు తీసుకోలేమని జనం ఆరోగ్యం గాలికి వదిలేస్తారు..అందరూ మాస్క్ లు..శానిటైజర్లు పంపిణీ చేయాలని చెప్తారు..కనీసం అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేని ప్రభుత్వాలు చైనాలాగా వైరస్ ని  ఎదుర్కొంటాయా...లేదు కదా..అందుకే ఓ వాస్తవం మాత్రం ఒప్పుకున్నాయ్..ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకోండని...పోన్లే మనకి మనమే చేసుకుందాం..

నిన్న కేసీఆర్ గారు..ఓ పరమాద్భుతమైన సూచన వీడియో కాన్ఫరెన్స్ లో మోదీగారికి చేసారు..అంతర్జాతీయ విమానాలు అన్నీ బంద్  చేయమని..ఇదెంత కామెడీ అంటే..మార్చి 18నే దేశంలోని ప్రతి చిన్న ఊరికీ కూడా తెలిసేలా ఇంటర్నేషనల్ సర్వీసులన్నీ మార్చి 19 అర్ధరాత్రి నుంచి బంద్ అవుతున్నాయని టముకు వేసి మరీ వైద్యఆరోగ్యశాఖ చెప్పింది..ప్రతి ఛానల్లో ప్రసారమైంది కూడా...ఐనా తానేదో అందరికీ ఉపయోగపడే పెద్ద సూచన చేసినట్లు బిల్డప్ కోసం కాకపోతే ఏంటిది..ఇంకా నయం..జనతా కర్ఫ్యూ ఆలోచన కూడా నాదే అని మోదీకి చెప్పలేదు సంతోషం...
టెన్త్ క్లాస్ పరీక్షలు వాయిదా వేయవయ్యా సామీ అంటే...స్కూళ్లలో పకడ్బందీగా...శానిటైజేషనే చేస్తామని తప్పించుకన్న మేధావులకు ఇంతకన్నా..గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయ్..అడిగిన రిపోర్టర్లపై అహంకారం ప్రదర్శించడం తప్ప వేరే ఆలోచన ఎక్కడ ఉంది..అఁదుకే ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకుని మరీ మొట్టికాయలు వేసింది..ఏదైనా అంటే ఆరేడు నెలలు అన్నవాళ్లపైబడి ఏడవడం తప్ప ఆలోచనలు సొంతంగా రాకపోతే ఎలా..ఇంతవరకూ సిటీలో ఎన్ని మాల్స్ బంద్ అయ్యాయో ఏమైనా లెక్క ఉందా..ఏదో చెప్పాం..వినకపోతే మీ ఖర్మ అన్నట్లు వ్యవహరిస్తే ఎలా..

Comments