ధోని ది రియల్ హీరోనా..లేక వైరల్ మీడియమా



మహేంద్ర సింగ్ ధోని..ఇప్పుడు తెగ హ్యాండ్ షేక్ చేస్తున్నాడు ఫ్యాన్స్‌తో..ఇదో వార్తా అనవచ్చు..కానీ లోకమంతా నమస్తే చెప్తుంటే..ధోని మాత్రం షేక్ చేయడం వార్త కాదా..కరోనాని విస్తరించకుండా..మనకి సోకకుండా ఎవరికి వారు తీసుకుంటున్న జాగ్రత్త..నమస్తే...మరి ఈ సందర్భంలో మహేంద్ర సింగ్ ధోని ఆటో గ్రాఫ్స్ కూడా ఎడా పెడా గీకి పారేస్తున్నాడే..

ఎందుకిలా అంటే..ధోని స్టైల్ వేరు..గ్రౌండ్ లో...బయటా రెండు చోట్లా కెప్టెన్ కూల్..ఏదో అందరూ అంటున్నారు కాబట్టి అలా బిహేవ్ చేయడతను...అతని నైజమే అంత..అందుకే ఇప్పుడు కూడా నాయనలారా..మరీ అలా భయపడకండి..బెంబేలెత్తకండి..జాగ్రత్త పాటిస్తే చాలు.వైరస్ ని ఎదుర్కోవచ్చనే సంకేతం ఇద్దామనుకున్నాడేమో..పైగా శానిటైజర్ కావాల్సినంత పూసేసుకున్న తర్వాత ఎన్ని  షేక్ హ్యాండ్స్ చేసినా..ఏం కాదు కదా...

అన్ని ఫార్మాట్లలో రిటైర్ అవుతాడేమో అనే ఆలోచనలు..ప్రచారం జరుగుతున్న సమయంలో ధోనికి మిగిలింది ఐపిఎల్..అలాంటి ఐపిఎల్ వాయిదా పడింది..వైరస్ ఇంకా విజృంభిస్తే..రద్దు కూడా కావచ్చు..ఇలాంటి సమయంలో మరి కరోనానే కాదు..ఏదొచ్చినా ధోని మాత్రం ఇరగదీయడానికి సిద్ధపడుతున్నాడేమో..కానీ కాలం కలిసి రాదేమో కరోనా దెబ్బతో..

Comments