ఈనాడు మరీ ఘోరం..ఇంత పెద్ద తప్పు..ఉద్యోగం ఊడేఉంటుంది పాపం

అసలే ఎవరు తప్పు చేస్తారా...భారం వదిలించేద్దాం అనుకునే పరిస్థితి ఉన్న రోజుల్లో ఇలాంటి బీభత్సమైన బ్లండర్లు..చేయడం తగునా..పైగా సదరు పత్రిక ఏది రాస్తే..అదే అచ్చొత్తేయమనే ఎడిటర్లు ప్రతి న్యూస్ ఛానళ్లో తిష్టవేసిన సమయంలో ఇలాంటి తప్పులు చేస్తే..దాన్నే వాళ్లంతా ఫాలో అయిపోరూ...ఎంత పెద్ద తప్పంటే..ఆ బ్యాంక్ తిరిగి మన పత్రిక మీద వెయ్యి కోట్ల రూపాయల ఫైన్ కోసం డిఫమేషన్ సూటేసేంత..అయినా అదే సంక్షోభంలో  ఉంటే మనమీదెక్కడ కేసేస్తుందంటారా..పోనీయండి...

ఇంతకీ ఆ తప్పేంటో రౌండప్ చేసిన చోట చదివితే ఈజీగానే తెలిసిపోతుంది..దాదాపు 6వేలకోట్ల రూపాయల మేర యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ , వ్యవస్థాపకుడైన రాణాకపూర్ పక్కకి సైడ్ చేసాడంటూ ఆరోపణలున్నాయ్..అది రేపో మాపో తేలబోతోంది..దానికి తోడు..మనోడు ఎవరికి బడితే వారికి లోన్లు ఇచ్చేయడం ..అందులోనూ చేతులు తడుపుకునే ఉంటాడు...వెరసి కస్టమర్ల డబ్బులకు రెక్కలు వస్తాయేమో అనే సందేహంతో గుంభనగా చేయాల్సిన పనిని గురువారం రాత్రికి ఆర్బీఐ చేయడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లో అల్లకల్లోలమైపోయింది..ఇదేదో శుక్రవారం రాత్రి చేసినట్లైతే..స్టాక్ అంత నష్టపోయి ఉండేది కాదు..స్టాక్ మార్కెట్ జారుడుబల్లే కాదనడం లేదు..కానీ కావాలని..ఆ ప్రకటన చేయడం వెనుక ఖచ్చితంగా స్టాక మార్కెట్ ని పడేయాలనే అని ఎవరైనా అంటే కాదనలేరు కూడా..ఎందుకంటే అంత ఉత్పాతం జరిగి షేరు వేల్యూ 85శాతం పడిపోయిన తర్వాత వివరణ ఇవ్వడంలో అర్ధం లేదు..ఎస్ బ్యాంక్ కి ఢోకా లేదంటే..మరి షే్ హోల్డర్ల సంగతేంటి

ఇక మనోడు చేసిన తప్పిదం చూడండి..అనిల్ అంబానీ డిహెచ్ ఎఫ్ఎల్, ఐఎల్ అఁడ్ ఎఫ్ఎస్, ఎస్సెల్ గ్రూప్, ఎస్సార్ పవర్, ఆల్టికో, సిజి పవర్ ఇలా డజను కంపెనీలకు అప్పులు ఇచ్చి ఢ్యాషైంది ఎస్ బ్యాంక్..కానీ మనోడు ఈ కంపెనీలే ఎస్ బ్యాంక్ కి అప్పిచ్చినట్లుగా రాసుకొచ్చాడు..కాదా...ఇది తప్పిదం...ఔనా కాదా..మిస్టర్ మంచాలా..!

Comments

  1. పేపర్ చివరి వాక్యంలో ఒక్క "కు" ఎక్కువై అర్థం మారిపోయింది. ఆ ఒక్క అక్షరం తీసేస్తే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇది అచ్చు తప్పు కానీ కావాలని చేసిన బ్లండర్ కాదనుకుంటా. ఆన్లైన్ ఎడిషన్ లో నాకు బోలెడు సార్లు అచ్చు తప్పులు దొరికాయి. ఒకసారైతే "దొంగతనంగా బంగారం రవాణా చేస్తున్న పోలీసుల్ని కమీషనర్ అభినందించారు" అని రాసింది. నిజానికి అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న వార్త అది!!

    ReplyDelete
  2. కాదు..ఒక్క అక్షరం మనుషులను చంపేస్తుంది..ముద్రణా లోపం అనడానికి ఇది అచ్చు యంత్రాల యుగం కాదు..పూర్తిగా పేజ్ మేకర్ లో చేస్తుంది..ఒకటికి మూడుసార్లు తనిఖీ చేసి మరీ పబ్లిషింగ్ కి వెళ్తుంటాయ్..నేను తప్పులు దొర్లడం జరగదని చెప్పడం లేదు..ఇదే వ్యాసాన్ని మన టీవి ఛానళ్ల మిత్రులు యాజ్ ఇట్ ఈజ్ గా దించుతుంటారు..ఎందుకంటే వాళ్ల దృష్టిలో సదరు పత్రిక రాసిందే వేదం..ఇతరులు ఆ పత్రిక తప్పు రాసింది అన్నా కూడా మనతోనే వాదనకి దిగగల సమర్ధులు..పరమశుంఠలు ఉన్నారు..వారి గురించి..వారిపైకి ఎక్కుపెట్టిందే ఈ వ్యాసం

    ReplyDelete

Post a Comment