పెళ్లి లేదు..ఇంకోటి లేదూ..అన్నీ వాయిదా కరోనా...పాపం నిఖిల్, నితిన్

పాపం ఇద్దరు యంగ్ హీరోలు...మిడిలేజ్ లోకి రాబోతున్నారు...వయసు మీరక ముందే పెళ్లి బాజాలు వాయిద్దామనుకుంటే ఇలా మాయదారి కరోనా...వాయిదా వేయించేట్టు ఉంది..
అయినా వాయిదా వేయకుండా చిన్న స్థాయిలో చేసుకుందామంటే ఇమేజ్ అడ్డొచ్చేలా ఉంది..

నితిన్ కి ఈమధ్యనే భీష్మ అని సినిమా కూడ రిలీజ్ చేసిన అనుభవం  ఉంది..అందులో పేరైతే భీష్మ కానీ..మనోడు ఎంజాయ్ చేసే క్యారెక్టర్..మరి ఆ టైటిల్ ఎఫెక్ట్ కానీ పడి..పెళ్లి వాయిదా పడుతుందేమో , అలా వద్దు కనీసం లిమిటెడ్ మెంబర్స్ తో అయినా పెళ్లిని లాగించేద్దాం అనుకుంటున్నాట్ట..దుబాయ్ లో భారీగా చేద్దామనుకుంటే..ఇప్పుడు అక్కడ బ్యాన్...పైగా సిటిలోనూ అంతే

నిఖిల్ పరిస్థితి కూడా అంతే..కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు కదా..మార్చి 31 లోపే పెళ్లిళ్లు..తర్వాత ఏవైనా సరే వాయిదా వేసుకోవాల్సిందే అని..అది కూడా 200మందిలోపు అతిథులతో అని..మరి మనోడి ఫ్రెండ్ సర్కిల్..చుట్టాలు..అందరినీ కలిపి 200లోపు అంటే కష్టమే..ఐతే సెలబ్రెటీ కదా..పర్మిషన్లు ఇచ్చేస్తారేమో..
వీళ్లు చేసుకుంటారు సరే...కరోనా దెబ్బకి ఇన్వైటీస్ అందరూ వస్తారా మరి..!

Comments