మెడ వంచుతానన్న జగన్..ఇలా ఎందుకు తల వంచావ్


అంబానీ పరిమళాలు ఆంద్రావనిలో విరబూయడం ఎవరికి ఇష్టమో..కష్టమో తెలీదు కానీ..150మందికిపైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైఎస్సార్సీపీ  అధినేత జగన్..ఎవరూ దొరకనట్లు..ఆ పరిమళ్ నత్వానీని రాజ్యసభకి పంపడం మాత్రం 90శాతం మంది ఆంధ్రావాసులకు నచ్చడం లేదు..ఏ పార్టీ ఎవరిని పంపాలో వారి ఇష్టం ..ఐతే ఇలా ఓ లాబీయిస్ట్‌ని..ఇండస్ట్రియలిస్ట్‌ని..ఇంకా పేద్ద ఇండస్ట్రియలిస్ట్ తాబేదారుని పంపడమే బాగా చికాకు పెడుతోంది..

ఆ మాటకి వస్తే ప్రతి పార్టీ ఎవరో ఒక తాబేదారుని పంపుతూనే ఉంటుంది..అందులో సందేహం లేదు..కానీ ఎవరిపైనైతే తీవ్రంగా ఆరోపణలు చేసారో..వారి అనునూయలను పార్టీ తరపున రాజ్యసభకి పంపడం మాత్రం పార్టీలోని వారికి కూడా కాలే ఉంటుంది..కానీ ఏం చేయలేరు..అధినేత ఏ ం చేసినా..దానికో లెక్క ఉండే ఉంటుంది..గిట్టనివాళ్లు కేసుల భయంతో మోదీ, అంబానీలు శాసించారు..ఈయన పాటించారని ఆడిపోసుకోవచ్చు కానీ..అంతకు మించిన వ్యూహం ఉండే ఉంటుంది..

ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఏపీకి దూరం అంటున్నారు..పరిమళ్ నత్వానీని ఎంపిగా పంపడం ద్వారా బహుశా..ఏదైనా ఇండస్ట్రీ ఏపీకి వస్తుందేమో చూడాలి...ఐనా ఇలా అంబానీ వచ్చి అడగ్గానే వెంటనే జగన్ ఎందుకు ఒప్పుకున్నాడు..దీని వెనుక మోదీ..అండ్ కో ముందే బేరసారాలు చేయకపోతే అంత తొందరగా జగన్ అంబానికి ఓకే చెప్పి ఉండేవాడు కాదు...ఇవన్నీ కాకుండా.. జగన్ ఏదైనా కొత్త వ్యాపారం చేయడానికి బ్యాక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడా.

 పైగా కేసులంటే భయమనే కామెంట్ కి అర్ధం లేదు..ఆల్రెడీ జైలు జీవితం గడిపినవాడికి అదో లెక్కే కాదు...పోక ముందు భయం...పోయొచ్చిన తర్వాత ఇంకాస్త రాటుదేలడం తప్ప దానికి భయపడేవాడు జగన్ కాదని..చాలామందికి తెలుసు...మరెందుకు ఇలా ఓ రాజ్యసభ సీటుని ఇలా ధారాదత్తం చేయడం..ఏం ప్రయోజనం రాబోతోంది..వాచ్ చేయాల్సిందే .
ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మాదే గెలుపు అంటున్న టిడిపికి ఓ సలహా...బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉంది కాబట్టే..అసలు ఈ రాజ్యసభ ఎన్నికల్లోనే టిడిపి కేక పుట్టించవచ్చు...నిజంగా .వైఎస్సార్సీపీలోనే దీనిపై రగులుతుంటే..పోటీకి మరో కాండిడేట్ ని టిడిపి బరిలోకి దింపవచ్చు..ఎందుకంటే టిడిపికి ఎమ్మెల్యేల బలం ఓ 19మంది ఉన్నా.. ఇంకో 21మంది మద్దతు దొరకబుచ్చుకుంటే నత్వానీని ఓడించిపారేయవచ్చు..ఏమంటారు బాబుగారూ..మీరు తలుచుకుంటే ఏదైనా జరగొచ్చు...⌣⌣

Comments