చంద్రబాబుగారూ ఇంతకీ వాయిదాని సమర్ధిస్తున్నారా లేదా..మరి అప్పట్లో ఏమైందీ తెలివిడి

జగన్ ఏదంటే దానికి రివర్స్ అనడం...లేదంటే బాబు ఏదంటే జగన్ రివర్సవడం..ఇదేనా ఏపీ రాజకీయం..ఔనండీ  బాబూ అదే..చూడండి..నిన్న ఉదయం తెల్లారేసరికి లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా అనగానే...టిడిపి బ్యాచ్ అంతా హే...హే...జగన్ నీకు జ్వరమా..కరోనా భయమా ఓటమి ఫియరా అంటూ ట్విట్టర్ పురాణం విప్పేశారు..అబ్బో టిడిిపి శానా రైజ్ అయింది..ఇక ఇరగదీస్తారు కాబోలు ఎన్నికలలో అందుకే ఇలా జగన్ వాయిదా వేయిస్తే..పైరవుతున్నారు అనుకున్నారు జనం..
కానీ మధ్యాహ్నానికి జగన్ ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే..చంద్రబాబుగారు తానొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాననే భ్రమలో జగన్ ని కడిగిపారేశారు..అసలు ఏమనుకంటున్నాడు ఈ ముక్యమంత్రి ..సర్వాధికారి  అనుకుంటున్నాడా...ఎన్నికల కమిషన్ నే ప్రశ్నిస్తాడా..అంటూ ఓ 2 గంటలపాటు దంచి కొట్టారు..కరోనా ప్రతాపం గురించి జగన్ ఏమనుకుంటున్నాడో...తానేమనుకుంటున్నాడో అంతా వివరంగా చెప్పేశారు..ఇక అంతా క్లియర్..
జగన్ తాను కావాలనుకున్నది చంద్రబాబుగారి నోటి వెంటే చెప్పించేశాడు..
పాయింట్ నంబర్ వన్..---ఎన్నికలను ఈసీనే వాయిదా వేయించింది
పాయింట్ నంబర్ 2--- కరోనా ప్రభావం చాలా ఎక్కువ..
పాయింట్ నంబర్ 3---ఎన్నికల వాయిదా వెనుక ఎలాంటి రాజకీయం లేదు
పాయింట్ నంబర్ 4- ఈసీ అధికారాలను ఎవరూ ప్రశ్నించలేరు
ఇన్ని చెప్పిన చంద్రబాబుగారు మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చీప్ ఎలక్షన్ కమిషనర్ ని పట్టుకుని ఎన్ని మాటలన్నారు..ఎంత డ్రామా చేశారు..గుర్తుందా ఆ ఫోటోలు పెట్టమంటారా

Comments