స్టాక్ మార్కెట్లలు నేలమట్టం అవుతాయా..ఎఁదుకిలా భారతీయలను చూసి ధైర్యం తెచ్చుకోండి


ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు పాతాళమే లక్ష్యంగా పడిపోతున్నాయ్..కారణాలు అనేకం కనపించే భూతం మాత్రం కరోనా..వెంట్రుకలో వందోవంతు ఉండే ఓ చిన్న కణం ప్రపంచాన్నే అంతం చేయబోతోందనే భయమే ఇందుకు కారణం..అవును కరోనా వైరస్ ఎంత  ఉంటుంది...నిజంగా వెంట్రుకలో వందోవంతేనట...మరి ఇన్ని లక్షల కోట్ల సంపదని ఎలా నాశనం చేయగలుగుతుంది...భయంతో...అవును నిజంగా భయంతోనే...
ప్రాణాలు పోతాయనే భయం...ఎదుర్కోలేమేమో అన్న భయం..ఏం అంతకు ముందు ఎన్ని వైరస్ లను చూడలేదు..అప్పడు అంతగా డాక్టర్లు..మెడిసిన్స్..ఇంత మీడియా..ఏదీ లేదు..మరి అప్పుడంత బీభత్సం ఇప్పుడెందుకు ...

కానీ ఈ ప్రశ్నలేసుకునేంత తీరిక స్టాక్ మార్కెట్లకు ఉండదు..స్టోరీ చదివేలోపు నా ఆస్తే జీరో అయిపోవచ్చు..తొందరగా అమ్మేసుకుంటే కొంతైనా మిగులుతుందనే ఆందోళన...తపన తాపత్రయం..అందుకే అందరూ అమ్మేసుకుంటున్నారు..దీనికి కారణం కొంతే..ప్రపంచదేశాలన్నీ కలిసిపోయిన తర్వాత ఓ వైరస్ ఇలా అంటు వ్యాధిలాగా మారడం ఇదే తొలిసారి..అందుకే దేశాల మధ్య ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయ్...అంటే ఇక వ్యాపారాలు జరగవు..ముడి పదార్ధాలు బయటనుంచి రావు..టాబ్లెట్లు తయారు చేసుకోలేం...ఎరువులు తెచ్చుకోలేం
పంటలు పండించలేం..చివరికి ఏమీ తినలేం ఇంతగా భయపడుతున్నారు

ఇటలీలో కోటి ఇరవైలక్షమందిని శిబిరాలకు తరలించారు..ఇరాన్ లో జనాలకు ఉచ్చపడుతోంది..అమెరికాలోనూ అంతే తెగ కబుర్లు చేప్పె ట్రంప్ ఏం చేయాలో తెలీక జుట్టు పీక్కుంటున్నాడు..రష్యా ఒక్కటే కాస్త నిబ్బరంగా ఉంది..చైనాలో ఎంత జరిగినా..ఆత్మస్థైర్యం కోల్పోలేదు..కానీ మిగిలిన దేశాలకు ఆ భయం పట్టుకుంది..మనం అలా చేయగలమా లేదా అని..కానీ ఇండియాని చూడొద్దా ఇప్పుడు ..భారతదేశం గొప్పది..ఇక్కడకి రాదు వచ్చినా మనల్ని ఏమీ చేయలేదని నేను రాస్తే కొంతమంది నవ్వుకుని ఉండొచ్చు..కానీ చూడండి..ఇప్పటికి ఇన్ని కేసులు వచ్చాయ్ కానీ..ఎక్కడైనా చచ్చిపోతామనే భయం ఉందా...ఏజ్ బారై రోగనిరోధక వ్యవస్థ చచ్చిపోయినవాళ్లపైనే కరోనా ప్రతాపం..
స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే..ఎఫ్ఐఐలు..డిఐఐలు అందరూ అమ్మేసుకుంటే మనలాటి చిన్నోళ్లు మాత్రం ఏం చే స్తారు ఇదే కదా చేసేది..అందుకే పడుతుంది..కారణాలు తెలిసినా..ఏమీ కాదని రూఢిగా తెలిసినా..అమ్మకాలను ఆపలేం..అందుకే సైలెంట్ గా చూడాల్సిందే

Comments