11 దేశాల్లో ఆ చావులకు లెక్కలేదు..ఎలా చనిపోయారో తెలీదు..అంతా సీక్రెట్


ఆ చావులకు లెక్కలు ఉండటం లేదు..ఎలా చనిపోయారో కూడా తెలీడం లేదు..ఏంటీ ఉపోద్ఘాతం అంటారా..కరోనా సీజన్‌లో ఒక్కనెలలోనే ప్రపంచవ్యాప్తంగా 28వేలమంది కారణం తెలీకుండానే మరణించారట..ఇంతకీ దీని వెనుక అసలు కథేంటి ....28వేలమంది మిస్సింగ్...ఎలా చనిపోయారో తెలీదు...అంత్యక్రియలు ఎవరు చేసారో తెలీదు
అంతా సీక్రెట్...ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 28వేల మరణాలకు లెక్కలు లేకుండా పోయాయ్..ఇదంతా కూడా ఓ నెలరోజులు గ్యాప్‌లోనే చోటు చేసుకుంది న్యూయార్క్ టైమ్స్ చేసిన ఓ డెత్ డేటా ప్రకారం..ఈ 28వేలమంది కూడా కరోనాతోనే చనిపోయారని అంచనా..ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు మరణాలను తక్కువ చేసి చూపెడుతున్నాయనే వాదన ఉంది..సరిగ్గా ఈ సమయంలోనే న్యూయార్క్ టైమ్స్ బైటపెట్టిన ఈ నివేదిక కలకలం రేపుతోంది

ఈ మొత్తం మరణాలు కరోనా వైరస్ సోకి అయినవే కాకపోవచ్చు..వేరే కారణాలతో కూడా సంభవించి ఉండొచ్చు..కానీ ఇంతమంది మరణాలను మిస్సింగ్ డెత్స్ గా చేస్తే ఎలా... నెలరోజులుగా పారిస్‌లో ఈ సీజన్‌లో సాధారణ మరణాల రేటు కంటే రెట్టింపు చావులు చోటు చేసుకుంటున్నాయ్.. న్యూయార్క్ నగరంలో అయితే ఈ సంఖ్య నాలుగింతలుగా తేలుతుంది.స్పెయిన్‌లో అయితే మరణాల శాతం ఏకంగా 66శాతం ఎక్కువగా తెలుస్తుంది..ఫ్రాన్స్‌లో 28శాతం, యూకేలో 21శాతం మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలు చెప్తున్న లెక్కలు అసలు వాస్తవం కాదంటున్నారు...ఆ దేశాల్లో మొత్తం మరణాలను లెక్కగడితేనే అసలు వైరస్ కేసుల సంఖ్య సరిపోతుందనేది న్యూయార్క్ టైమ్స్ నివేదిక సారాంశం..కరోనా కేసులు బయటపడుతుంటే..త్వరగా స్పందించిన దేశాల కంటే ఆలస్యంగా స్పందించిన దేశాల్లో మృతుల సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు ఉదాహరణగా చెప్తోందా నివేదిక.. టర్కీలో మార్చి ఏప్రిల్ మధ్యలో ప్రతి ఏటా వెయ్యి లేదంటే 1100మంది చనిపోతుంటారట...కానీ ఈ ఏడాది మృతుల సంఖ్య 2100గా నమోదు అయింది..ఇదే కరోనా ఎఫెక్ట్ అంటుంది న్యూయార్క్ టైమ్స్ రీసెర్చ్..

  జకార్తాలోనూ సేమ్ సీన్..కరోనాతో 84మంది చనిపోయారని ఆ దేశం ప్రకటించింది..కానీ ఇతర మరణాలు వెయ్యిగా తేలాయ్..జనరల్‌ఈ సీజన్‌లో జకార్తాలో 400-500మంది చనిపోతుంటారట..అంటే ఈ దేశాలన్నీ కావాలనో...తెలియకనో..కరోనా మరణాలను దాచి పెడుతున్నాయ్..ఇదే విషయాన్ని  న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది..ఇందులో కుట్రకోణాన్ని ఊహించాల్సిన అవసరం లేదని..జస్ట్ అన్ని మరణాలను లెక్కగట్టి ప్రకటించడానికి సమయం పట్టొచ్చని అభిప్రాయపడింది.. అసలు డెత్ టోల్ ఎంతో తెలియాలంటే..కనీసం రెండు నెలలు పట్టొచ్చని ఓ కంక్లూజన్ ఇచ్చింది..

Comments