వాడెవడో గొట్టం 55 ముత్తును గగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా..?


ఎవడో ఎక్కడో ఏదో చెప్తుంటాడు..ఇంకెవడో దానికి బాకా ఊదుతుంటాడు..కాసుల కోసం తిప్పలు పడేవాడు ఒకడైతే..ఉజ్జోగం కోసం మడుగులొత్తేవాడొకడు..ఎవడి గోల వాడిది..ఐతే ఇందులో రాజును మించి రాజభక్తి ప్రదర్శిస్తూ కొందరు అతిగాళ్లు ఓ తెగ తమంతటోళ్లు లేరనుకుంటూ గొంతు చించుకుంటారు..గార్ధభ స్వరాలతో తామే సర్వం అనుకుంటారు..అహం బ్రహ్మాస్మి కాదు...నేనే బ్రహ్మని అనగల సమర్ధులు..యూట్యూబు గొట్టాల ముందు బట్టలిప్పదీసుకునే రకాలతో జనాల బలహీనతలపై ఆడుకోవచ్చనే ఎదవ ప్లాన్లుతో ఓ పదిలక్షల వ్యూస్ పడగానే..అదంతా తమ గొప్పతనమే అనుకుంటూ..కిందవాళ్లని తొక్కేసి పైపైకే ఎదగాలనుకుంటారు..అలా అలా రెండు మైనస్ లు ఓ  చోట చేరి మరో ప్లస్సుని కూడా మురికి కంపులోకి లాగాలనుకుంటారు..
లేదంటే తమ మురికే వాళ్లకంటించేసి..అదిగో చూసారా వాడి చొక్కాపై మురికి అని మురిసిపోతుంటారు...

ఆస్తులను కాపాడుకునేందుకు..సొంత పనులు చేసుకునేందుకు గొట్టాలు పెట్టుకునే సంస్థల బెండు తీయక ఇలా పెట్రేగి పోతున్నారనే మండిపాటు ఇప్పటికే జనంలో చాలామందికే ఉంది..ఐతే కాస్తాపాటి ఎంటర్ టైన్ మెంట్ లేకపోతే ఎలాగలెండి అని సర్దుకుపోవడం అలుసుగా తీసుకుంటే ఎలా..పెతీదీ మాకు సోర్సుంది..మాకు బొక్కుంది..అంటూ రెచ్చిపోతుంటే..ఎన్నాళ్లు సాగుతుంది..దీంతో పాపం సదరు గొట్టంగారి పరివ్రాజకుడికి పుచ్చ పేలిపోయే రోజు వచ్చిందని చూచాయగా తెలిసిందట..

ఇంకేముంది..అదిగో నా పుచ్చ పగలగొట్టబోతున్నారు..పుచ్చ పగలగొట్టబోతున్నారంటూ తెగ హడావుడి అరుపులు..ఎవడూ పట్టించుకోకపోయేసరికి..కంగారు పుట్టేసి...ప్లీజ్ స్టాండ్  సిట్ బై మి..ప్లీజ్ స్టాండ్ సిట్ బై మి అంటూ తెగ హ్యాష్ టాగ్ మూమెంట్లు...అయినా ఓరే సాంబా...నీ జోలికి రావడం తప్ప ఇంకెవరికీ పని లేదంట్రా...నీ కంటే ముందు ఈ గడ్డపై ఓ సూర్యప్రకాష్...ఓ దగుల్బాజీ గతి ఏమైందో తెలిసి కూడా..ఎందుకీ మిడిసిపాటు...ఐనా ఓరే ఆ బాబూ ఈ కసిఆర్ లాంటోడు కాదురా..నీ జోలి అసలే రాడు..అనవసరంగా రేటింగ్ పెంచుకునే ఎత్తులు మానేసి నీ ఉజ్జోగం అదే బురదజల్లే డ్యూటీ ఎక్కేయ్ రారేయ్..ఇఁకా కావాలంటే నా హాషుటాగుల దెబ్బకే సదరు గగన్ ప్రభుత్వం ఎనక్కి తగ్గిందని కూడా రాస్కో...యూటూబు గొట్టాలకి మంచి వూయర్ శిప్ వచ్చేత్తది... చూడు ముత్తూ...నీజోలికి ఎవడూ రాడు..పోయి నీ అంధ వెలుగు అంగట్లో సేరిపో...సేదతీరిపో...

Comments