62 జిల్లాల్లో ఇంకొన్నాళ్లూ అన్నీ బంద్ తప్పదు..ఈ 9 రోజులు ఎంతో కీలకం


దేశంలో ప్రమాదఘంటికలు అంతకంతకూ పెరుగుతోన్న వేళ లాక్‌డౌన్‌పై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లే
సంకేతాలు వస్తున్నాయ్..ఇప్పటికే నాలుగువేలు దాటిన వైరస్ కేసులతో గజగజలాడుతోన్న భారత్..ఇంకా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే..వేలాది మరణాలు సంభవించడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయ్..దీంతో వైరస్ తీవ్రంగా ఉన్న 62 జిల్లాల్లో మాత్రం లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కూడా మరింత కఠినంగా అమలు చేసే అవకాశాలున్నాయ్
ఇప్పుడింత కేసులు సంఖ్య రెట్టింపుగా నమోదు కావడానికి 7 రోజులు పట్టేదని..కానీ నాలుగు రోజుల్లోనే ఈ సంఖ్య నమోదు కావడానికి తబ్లీగీ జమాత్ కారణమని కేంద్రవైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది..ఈ మినహాయింపులు..అంచనాలతో సంబంధం లేకుండా కరోనా తన పని తాను నిశ్సబ్దంగా చేసుకుంటూ
పోతోంది..సైలెంట్‌గా వేలాదిమందికి సోకుతున్నట్లు లెక్కలు చెప్తుంటే..ఇంకా ఈ లెక్కలతో కాలక్షేపం చేయడంపై విమర్శలు తీవ్రతరమవుతున్నాయ్

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అంటే...ఒకరి నుంచి ఒకరికి గొలుసుకట్టుగా వైరస్ వ్యాప్తి చెందుతూ పోవడం..ఇందులో పరిమితంగా అవడం...విపరీతంగా అవడం ఏమీ ఉండదు..ఒక్కసారి ఒక చైన్ మొదలైందంటే అది ఎక్కడ ఆగుతుందో ఎవరూ చెప్పలేరు..గత 24 గంటల్లోనే 505 కొత్త వైరస్ కేసులు నమోదు కావడం..మరణాల సంఖ్య 83దాటింది..మార్చి 30 నాటికి  1251మంది బాధితులు..32 మరణాలుగా ఉన్న
ఈ సంఖ్య తాజా స్థాయికి చేరడం తబ్లీగీ జమాత్ సదస్సు కారణంగానే అంటూ వైద్యఆరోగ్యశాఖ చెప్తోంది..ఐతే ఫలానా కారణంతో కాబట్టి..వైరస్ వ్యాపించడాన్ని సమర్ధించుకోవాలనుకుంటే..తీవ్ర తప్పిదమే


తాజా లెక్కల ప్రకారం దేశంలోని 62 జిల్లాల్లో 80శాతం కేసులు నమోదవుతున్న విషయాన్ని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది..దీంతో ఇక్కడ వైరస్ ని కట్టడి చేసేందుకు..భిల్వారా మోడల్ అనుసరిస్తారని అంటున్నారు..ఇప్పటికే ఆలస్యమైపోయిన టెస్టింగ్..ప్రక్రియని మరింత వేగవంతం చేస్తామని ప్రకటించింది..భిల్వారా మోడల్ అంటే..ఆ ఏరియాలన్నీ కూడా సీల్ చేసేస్తారు..రాకపోకలు నిషేధిస్తారు..మొత్తం టెస్టింగ్ చేయడం క్వారంటైన్..ఐసోలేషన్ పకడ్బందీగా అమలు చేస్తారు..రాజస్తాన్ లోని భిల్వారా ఏరియా గత నెలలో కరోనా వైరస్ కేసులకు హాట్ స్పాట్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు కాస్త చక్కబడ్డాయ్..ఇప్పుడలాంటి భిల్వారా మోడల్ లాక్‌డౌన్‌నే కేంద్రం వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న 62 జిల్లాల్లో వర్తింపజేయబోతోంది

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఐసిఎంఆర్ యాంటీ బాడీ టెస్టులను నిర్వహిస్తోంది..మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ  లవ్ అగర్వాల్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని జిల్లాల కలెక్టర్లకూ యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాల్సిందిగా సూచనలు చేసారు..ఈ చర్యలు ఏ మేర ఉంటాయో ఊహించలేనంతగా కూడా ఉండొచ్చంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు..ఈ ఆదేశాలే రానున్న ప్రమాదానికి సంకేతంగా అంచనా వేయవచ్చంటున్నారు..అన్ని జిల్లాల్లో ఉన్న ఫార్మా కంపెనీలు అవసరమైన మందులు తయారీ చేసుకునేందుకు పర్మిషన్లు ఇవ్వాలని..ప్రతి జిల్లా కూడా కోవిడ్ 19 క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు

మరోవైపు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కోసం కూడా వైద్యఆరోగ్యశాఖ దేశీయ తయారీ సంస్థలకు ప్రోత్సాహమిస్తోంది..మొదట్లో ఉన్న కొరత ఇప్పుడు లేదని దీని కోసం జిల్లాల కలెక్టర్లు..రాష్ట్ర మంత్రిత్వశాఖల నుంచి ఇండెంట్ కోరుతోంది..ఎవరికి ఎక్కడ ఎంత అవసరమవుతాయో తమకి తెలపాలని కోరింది.
24 రాష్ట్రాలలోని 14,522 స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో మాస్క్‌ల తయారీ కూడా జరుగుతున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది..ఈ సందర్భంగానే లవ్ అగర్వాల్ ఓ కీలక వ్యాఖ్య చేశారు..వైరస్ మనల్ని వెంటాడటం కాదు..మనమే వైరస్‌ని వెంటాడాలంటూ కామెంట్ చేశారాయన. లేట్‌గా అయినా ఆ పని చేస్తారో..లేక ఇంకా మీనం మేషం లెక్కపెడతారో మరి..

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కోరిన మేరకు 7 లక్షల యాంటీ బాడీ కిట్స్ ఏప్రిల్ 8 అంటే ఎల్లుండిలోగా అందుబాటులోకి రానున్నాయ్..వీటిని హాట్ స్పాట్ ఏరియాల్లో రాండమ్‌గా చేయబోతున్నారు.. ఈ 7 లక్షల కిట్లలో మొదట 5 లక్షల కిట్లు అందుబాటులోకి వస్తాయని తెలిసింది.. ఈ టెస్టులు నిర్వహించాలన్నా కూడా లాక్‌డౌన్ సమయంలోనే కుదురుతుంది..అంటే రానున్న 9 రోజులూ భారత్‌కి ఎంతో కీలకంగా మారనున్నాయ్...

Comments