గుడ్ న్యూస్ మే9తో భారత్ నుంచి కరోనా తగ్గడం ఖాయం..కానీ షరతులు వర్తిస్తాయ్


ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం మే 9 నుంచి భారత్‌లో కరోనా తగ్గు ముఖం పడుతుందట..అంటే ఇంకో నెల రోజులు ఓపిక పడితే చాలు.. ఇప్పుడు శరవేగంగా పెరిగిపోతున్న కేసుల సంఖ్య తబ్లీగీ జమాత్‌తోనే అని..లేదంటే స్టెడీ ఫేజ్..అంటే నిలకడైన దశలోనే ఉండాల్సిందనే వాదన నిజమో..కాదో ఏప్రిల్ 16నాటికి తేలిపోతుంది..మరోవైపు ప్రస్తుతం ఉన్న దశ మాత్రం రాపిడ్ యాక్సిలరేషన్ స్టేజ్ గా కన్పిస్తోంది

 ఐతే ఎంత వేగంగా విస్తరిస్తున్నా కూడా...ప్రస్తుతం ఉన్న వైరస్ వ్యాప్తిని బట్టి చూస్తే..మన దేశంలో
వ్యాధి అంతరించే దశ మే 9 నుంచి ప్రారంభం కాబోతోందట.. గవర్నమెంట్ లోని టాప్ డేటా లేబరేటరీ సంస్థ అంటే గణాంక సంస్థ ఒకటి కరోనాపై పోరాటం చేసే వ్యూహాలను రచించే కోవిడ్ ఎంపవర్డ్ కమిటీతో ఈ సమాచారం ఇచ్చిందట..కానీ ఇక్కడే ఓ మెలిక ఉంది.. ఈ అంచనాలు అ్తన్నీ తగ్లీబీ జమాత్ ఎపిసోడ్ చోటు చేసుకోకముందు వేసినవని.. డొమెస్టిక్ కేసులు..వైరస్ ప్రభావిత ఇతర దేశాల లెక్కలను కలిపి అంచనా వేసినవని చెప్తున్నారు..ససెప్టివ్ ఇన్ఫెక్షస్ రికవర్డ్ మోడల్ ప్రకారం ఏ వ్యాధి అయినా ఏ దశ వరకూ విస్తరించి ఇక తగ్గుముఖం పడుతుందో తెలిపే అంచనాలు ఉన్నాయ్..వాటి ప్రకారమే ఈ  లెక్కలు వేసారట
.

.అలా వాటి ప్రకారం
 మహారాష్ట్ర, ఢిల్లీలే కరోనా వైరస్ బారి నుంచి రికవర్ అవుతాయని తెలుస్తోంది...మధ్యలో చోటు చేసుకున్న తబ్లీగీ ఎపిసోడ్‌ ఈ అంచనాల్లో తేడా చేసినా...ప్రస్తుతానికి మాత్రం భారత్ సరైన   ట్రాజెక్టరీ( దిశ)లోనే కరోనాని కట్టడి చేయగలుగుతున్నట్లు ఈ డేటా చెప్తోంది.. ప్రస్తుతం వైరస్ వేగ విస్త్రతి ఏప్రిల్ మధ్యనాటికి తగ్గిపోతుందని
అంచనా వేసింది.. దేశంలో కరోనా బారిన పడిన అత్యంత ప్రభావిత 8 రాష్ట్రాలపైనా సర్వే చేసిన ఈ ఎంపవర్డ్ కమిటీ డేటా కేంద్రానికి కూడా  లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా కీలకంగా మారొచ్చంటున్నారు.. ఈ డేటా ప్రకారం ఢిల్లీలో రోజుకి 200 పేషెంట్లు చొప్పున వైరస్ బారిన పడతారని..ఏప్రిల్ 8 తర్వాత అది తగ్గుతుందట..అంటే రేపే.....ఐతే తబ్లీగీ జమాత్ ఎపిసోడ్ తర్వాత వీటిని తిరిగి లెక్కగట్టాల్సిన అవసరం కన్పిస్తోంది
 ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మహారాష్ట్రలో కూడా ఏప్రిల్ 10 తర్వాత పరిస్థితిలో మార్పు కన్పిస్తుందనే అంచనా వేసింది..తమిళనాడు  రాజస్థాన్, కర్నాటకలో నెలాఖరుకు..కేసుల సంఖ్య తగ్గుతాయని గ్లోబల్ డేటా విశ్లేషణ తర్వాత..ఎంపవర్డ్ కమిటీ అంచనా వేసింది..అంతేకాదు.సమ్మర్ లో టెంపరేచర్ పెరగడం కూడా కరోనా కట్టడిలో కీలకం అవుతుందని..కొంతమేర కలిసి రావచ్చని చెప్తోందీ అంచనా..కానీ ఈ వేడి వాతావరణం అనే అఁశాన్నే చాలామంది కొట్టిపారేస్తున్నారు సరే ఇలా చెప్పినట్లే జరిగితే అంతా మన మంచికేగా.....ఐతే ఈ మధ్యలో ఎసింప్టమేటిక్  కేసులు పెరిగితే మాత్రం ఈ లెక్కలన్నీ తలకిందులవుతాయని కూడా అంటున్నారు..
( ఎకనమిక్ టైమ్స్ లింక్ https://economictimes.indiatimes.com/news/politics-and-nation/this-week-critical-spread-could-recede-early-may/articleshow/74998924.cms?from=mdr)

Comments