కరోనాకి మందు కనిపెట్టారా అది కూడా తల్లోపేలకి వాడేదా..అందరూ ట్రై చేయవద్దురారేయ్

నెస్సిసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు..అంటే అవసరమే అన్నీ నేర్పుతుందని..ఇప్పుడు
కరోనాకి విరుగుడు కనిపెట్టాలనే పట్టుదల అన్ని దేశాలనూ పట్టి ఊపేస్తోంది..ఇందులో భాగంగానే
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు..కరోనాని రెండంటే రెండే రోజుల్లో దాదాపు శరీరం నుంచి తుడిచిపెట్టే ఓ మందు కనిపెట్టారు ఎహ నిజమేనా..అంటారా నిజమేనండీ బాబూ..అది కూడా మన బామ్మల కాలం నుంచి వాడే మందే..అదేంటీ  అంటారూ...
ఆస్ట్రేలియాకి చెందిన కొందరు ఐవర్‌మెక్టిన్ అనే డ్రగ్ వాడినప్పుడు వైరస్ 99.8శాతం నశించినట్లు కనుక్కున్నారు..అమెరికాలో ఈ మందుని స్కేబీస్ అంటే దురదలాంటి చర్మవ్యాధికి వాడుతుంటారు..ఐవర్ మెక్టిన్ మన భారత్‌కీ కొత్తదేం కాదు..తల్లో పేలు పడ్డప్పుడు వాడే లైసిన్ లాంటిదే ఈ ఐవర్‌మెక్టిన్..ప్రతి చిన్నా చితకా మందుల షాపుల్లో కూడా ఈ లైసిన్ దొరుకుతుంటుంది..

ఆస్ట్రేలియా ల్యాబ్‌లో కరోనా వైరస్‌పై ఐవర్‌మెక్టిన్ వాడగా..48 గంటల్లోనే వైరస్‌లోని 99.8శాతం చచ్చిపోయినట్లు తెలిసిందట..ఇక మూడో రోజుకైతే పూర్తిగా నాశనమైపోయిందట...ఐవర్‌మెక్టిన్ సార్స్ కోవిడ్ 2 వైరస్‌ని వృద్ధి చెందకుండా..దాని నెర్వస్‌సిస్టమ్‌పై దాడి చేయడం ద్వారా పని చేసిందని ఆస్ట్రేలియా సైంటిస్టులు చెప్తున్నారు.. రాయల్ మెల్‌బోర్న్ హాస్పటల్‌కి చెందిన సైంటిస్టులు ఐవర్‌మెక్టిన్ కరోనావైరస్ పేషెంట్లపై ట్రయల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు..
ఐవర్‌మెక్టిన్ ను 1970ల ప్రాంతంలో తయారు చేయగా..పారాసైటిక్ ఇన్ఫెక్షన్లు..చర్మవ్యాధులకు ఎఫెక్టివ్‌గా పని చేస్తుందీ డ్రగ్..తల్లో పేలకు నివారణగా కూడా వాడుతుంటారు..స్ట్రామెక్టాల్ పేరుతో ట్యాబ్లెట్ల రూపంలో..సూలాంట్ర పేరుతో క్రీమ్ రూపంలో అమెరికాలో దొరుకుతుంటుంది..ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఐవర్‌మెక్టిన్‌ని ఎసెన్షియల్ అంటే ఆవశ్యక మందుల జాబితాలో చేర్చగా.కొన్నేళ్లుగా యాంటీ వైరల్ మెడిసిన్‌గా కూడా వాడుతున్నారు..
ఆస్ట్రేలియాకి చెందిన మోనాష్ యూనివర్సిటీలో డాక్టర్ లియోన్ కేలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన పూర్తిగా ల్యాబ్ కండిషన్స్‌లో మాత్రమే  చేశారు..సార్స్ కోవిడ్ 2 అంటే కరోనాకి సంబంధించిన వైరస్‌ను పెట్రీ డిషెస్‌లోని కణాలకు
సోకించిన తర్వాత..ఐవర్ మెక్టిన్ ఇంజెక్ట్ చేశారు..24గంటల తర్వాత 93శాతం 48 గంటల తర్వాత
99.8శాతం మూడు రోజుల్లో మొత్తం  వైరస్ నశించిపోవడం చూశారు.

.కరోనా వైరస్‌కి వేక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి..ఐవర్‌మెక్టిన్‌ని తప్పకుండా కరోనా పేషెంట్లపై వాడాలంటూ ఈ బృందం కోరుతోంది..ల్యాబ్ టెస్టులకు నిజమైన ప్రయోగాలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి దీనిపై అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని ఇంకొందరు సైంటిస్టులు సూచిస్తున్నారు..ఎవడు బడితే వాడు వాడేసుకుంటే అసలు కరోనా కంటే ముందే ప్రాణాలు తీసేస్తుందని హెచ్చరిస్తున్నారు


Comments

Post a Comment