రెడ్ జోన్ కి మాత్రమే లాక్‌డౌన్ ఇదీ జగన్ మాట


తొలిసారిగా కరోనాపై సొంత అభిప్రాయాన్ని చెప్పడమే కాకుండా..అందులోని సహేతుకతని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యక్తీకరించారు..ఎక్కడెక్కడ రెడ్ జోన్లు ఉన్నాయి..ఎక్కడ ఆరంజ్ జోన్లు ఉన్నాయో తెలపడమే కాకుండా..ఎంత కాలం ఈ మహమ్మారి ప్రభావం ఉఁటుందో అంచనా వేసిన జగన్..దానికి తగ్గట్లుగానే ప్రిపేర్ అయినట్లు కన్పిస్తుంది..

అందుకే రెడ్ జోన్లలో మాత్రమే లాక్‌డౌన్ కొనసాగించాలనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు..ఐతే ఇక్కడ చిక్కేంటంటే..ఇప్పటిదాకా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా లేదు..అలానే కొన్ని చోట్ల తక్కువ ఉంది..కానీ  ఎప్పుడెక్కడ పగులుతుందో తెలీని వైరస్ పుట్ట పగిలితే ఎలా...ఇదే విషయంపై టిడిపి కాసేపట్లో యాగీ చేయడానికి టివి5లో మైకు రెడీ చేసుకుని ఉంటుంది కూడా...

ఇది వ్యవసాయరంగానికి అవసరమైన కాలం..కోతకొచ్చిన పంటలు...వేయాల్సిన పంటల సీజన్..ఇలాంటి సమయంలో డిస్ట్రబ్ చేయకుండా..ఉండాలి..అందుకే వాటికి దేశవ్యాప్తంగా మినహాయింపులు లభిస్తున్నాయ్..దీంతో కేసులు పెరగవచ్చు..కానీ ఒకరికి  ఒకరు దూరంగా మెలగాలి...ఆ స్ప్పహ ఉండాలి..కలిగించాలి..అప్పుడే ఎక్కడైనా ఓ వేళ లాక్‌డౌన్ లేని సమయంలోనైనా..చక్కగా వైరస్ ని కట్టడి చేయగలుగుతారు..

Comments