టూరిజం..విమానం రెండూ ఆదుకోమని ఎదురు చూస్తున్నాయ్


భారత్‌లో లాక్‌డౌన్‌కి ముందే షట్‌డౌన్ అయిన రంగం ఏవియేషన్..ఇక ఎక్కడికక్కడ సరిహద్దులు, రాష్ట్రాలూ మూతబడటంతో..మొత్తానికి మొత్తం స్తంభించిపోయి ఆశలు అడుగంటిపోయిన రంగం టూరిజం..

 భారత జిడిపిలో విమానయానరంగం 2.4శాతం..టూరిజం 9.2శాతం వాటా కలిగి ఉన్నాయని 2018నాటి లెక్కల ప్రకారం అంచనా అలానే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న ఆర్ధిక సంవత్సరానికి ఏవియేషన్ రంగంలో దాదాపు 3800కోట్లు..టూరిజంలో 2500కోట్లు కేటాయించింది విమానయానరంగానికి వచ్చి..అమెరికా, యూకేతో పాటు చైనా, మిడిలీస్ట్..సౌత్ ఈస్ట్ ఏషియా, జర్మనీ దేశాలు కీలకమైతే.. టూరిజంలో  మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, లద్దాక్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, గోవాలు ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్స్‌కి నెలవుగా పేరుపొందాయ్..దురదృష్టవశ్తాతూ ఇప్పుడీ రాష్ట్రాలన్నీ కూడా కరోనాకి హాట్‌స్పాట్స్‌గా మారాయ్..ఒక్క గోవా కాస్త మినహాయింపు...

లాక్‌డౌన్‌కి ముందే అంతర్జాతీయ విమాన సర్వీసులు..ఆ తర్వాత దేశీయ విమానాలు రద్దు చేయడంతో..ఒక్కసారిగా ఏవియేషన్ రంగం కుప్పకూలింది..అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి..2008లో ఆర్ధిక సంక్షోభం తర్వాత ఏవియేషన్ టూరిజం రంగాలపై ఈ స్థాయి దెబ్బ పడటం ఇదే తొలిసారి..ఐతే ఈసారి ఈ దెబ్బ వాటికంటే భయంకరమైనది..వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం నివేదిక ప్రకారం కనీస 22 బిలియన్ డాలర్ల మేర
నష్టం వాటిల్లుతుందని అంచనా..ట్రావెల్ సెక్టార్ పాతికశాతం కుంచించుకుపోతుందని..దీంతో కనీసం 5 కోట్ల ఉద్యోగాలు ట్రావెల్..దాని అనుబంధ రంగాల్లో మాయమవుతాయ్..అలానే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాసింజర్ బిజినెస్‌లో 63 బిలియన్ డాలర్ల నుంచి 114 బిలియన్ డాలర్ల వరకూ కోత పడుతుంది..ఇక భారత టూరిజం విషయానికి వస్తే..మూడుకోట్ల 8లక్షలమంది ఉపాధి కోల్పోతారని అంచనా..ఇది మొత్తం టూరిజంపై ఆధారపడినవారిలో 70శాతానికి సమానమని తెలుస్తోంది.
వాయిస్() లాక్‌డౌన్‌తో చితికిపోయిన ఏవియేషన్, టూరిజం రంగాలు  ప్రభుత్వం నుంచి భారీ బెయిలౌట్ ప్యాకేజీ ఆశిస్తున్నాయ్..ఐతే పన్నెండు నెలలు అంటే వచ్చే ఏడాదికాలం వరకూ ట్రావెల్ టూరిజం రంగాలకు జిఎస్టీ హాలిడే ప్రకటించాలని కేపిఎంజి సంస్థ అభిప్రాయపడింది..వీటితో పాటే ఈ రంగంలోని గత పెండింగ్ బకాయిలు రద్దు నుంచి ప్రాపర్టీ ఎక్సైజ్ పన్నులు, ఎలక్ట్రిసిటీ బిల్లుల్ల తగ్గింపు ఉండాలని సూచించింది..తక్షణం ఏవియేషన్ ఫ్యూయల్‌పై వ్యాట్ రద్దు చేయాలని సూచించింది. ఏడాదికాలం పాటు  వడ్డీతో సహా అన్ని రకాల చెల్లింపులపై ఏడాదికాలం మారటోరియం విధించేలా బ్యాంకులు..ఎన్‌బిఎఫ్‌సిలకు మార్గదర్శకాలు విడుదల చేయాలని కేపిఎంజి సంస్థ ప్రభుత్వానికి సూచించింది..అలానే ఆర్ధికంగా ఈ రంగాలను ఆదుకునేందుకు రుణవితరణలో ప్రథమ ప్రాధాన్యత ఈ రంగాలకే కల్పించాలని కూడా కోరింది..వీటితో పాటే ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకోకుండా పోస్ట్ పోన్ చేసుకునే విధానాన్ని ఏవియేషన్ రంగంలో ప్రమోటే చేయాలని కెపిఎంజి సంస్థ అభిప్రాయపడింది..అప్పుడే కనీసం ఆరు నెలల తర్వాతైనా ఈ రంగంలో ఉత్సాహం నెలకొంటుందని ఆశిస్తోంది..ఓ వేళ అంతర్జాతీయ టూరిజం వీలు కానప్పుడు దేశీయంగా టూరిజం రంగాన్ని ప్రోత్సహించాలని  సూచించింది..

Comments