ఛంద్రబాబుగారితో మోదీ గారు ఏం మాట్లాడారంటే..!


ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడితే ప్రపంచమంతా జయించిన ఆనందమా...ఎహ..మీరు పట్టించుకోకపోతే పోండి నా రేంజ్ ఇదీ అని చెప్పుకునే తాపత్రయం..చెప్పుకోవాల్సిన దురవస్థ..చూశారా నా పలుకుబడి అని చెప్పుకునే దౌర్భాగ్యం..ఇన్ని సందర్భాలు కలిసిన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుగారిది..

నా అంతట నేనే ప్రధాని గారికి చేశా..ఆయనే నాకు చేసారు..ఎంత మంచివాడాయన..అందరితీ మాట్లాడటం చాలా గొప్ప విషయం అంటూ పొగిడేస్తున్న చంద్రబాబుగారి మాటలకు ఎక్కడా మీడియా చోటు కల్పించకపోవడం పాపం టిడిపి కేడర్‌కి నిరాశ కలిగించే విషయం...కానీ అసలు బాబుగారు నిజంగానే దేశంలో సీనియర్..అలాంటి వ్యక్తికి ఇలా నేను మాట్లాడాను..ఆయనా విన్నాడనే తరహాలో ఎందుకు చెప్పుకోవాలి...? ఎందుకంటే మోడీ ఎటూ బైటికి బాబుతో మాట్లాడానని చెప్పడనా...?

కరోనా విషయంలో ఏపీ చక్కగా పని చేస్తుందని ఎన్‌డిటివి అంటే దానికి అది సాక్షితో కలగలిపిన చానల్ అంటూ ఏడ్చేవాళ్లకి ఓ విజ్ఞప్తి అది ఎన్‌డిటివి సర్వే కాదు..అందులో నీతిఅయోగ్ కి సంబంధించిన పెద్దలు చెప్పారు..వాళ్లేమైనా చానల్ ఉద్యోగులా...సరే కరోనాని కట్టడి చేయడమనేది ఎవరికీ సాధ్యపడే విషయం కాదు..దానికేదో జగన్ ఒక్కడే కారణమన్నట్లు పెట్రేగడం ఊరేగడం మాత్రం ఒక్క ఏపీలోని ప్రతిపక్షాలకే సాధ్యం..ఓ వైపు మహారాష్ట్రలో 2వేల కేసులు దాటిపోయినా...ప్రతిపక్షాలు ఇక్కడిలా రాజకీయాలు చేద్దామనుకోవడం లేదు. ఇలాంటి ఇన్సిడెంట్లే రోతబతుకులను బైటపెట్టేది..

పైగా కరోనా కేసులున్న చోట్ల జోన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుగారు ప్రధానికి సూచించాని చెప్పుకోవడం ఏమైనా ఇఁగితం ఉఁడేదేనా..ఆల్రెడీ పది రోజుల క్రితమే ఈ జోన్ల సంగతి..అఁతటా జరుగుతున్నదే..రెడ్ జోన్..గ్రీన్ జోన్..ఆరంజ్ జోన్..కంటైన్మెంట్ జోన్లు..ఇప్పుడు కొత్తగా బాబుగారు నేనే చెప్పాననడం ఏంటి..కేసీఆర్ కనుక ఆల్లెడీ నిలిపేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను నేనే చెప్పా మోదీకి ఇంటర్నేషనల్ సర్వీసులు రద్దు చేయమని అన్నట్లుగా లేదూ...ఇలాంటోళ్లతో పోల్చుకుంటే నవీన్ పట్నాయక్...పినరాయ్ విజయన్ ఎంత గ్రేట్..వాళ్లకున్న పరిమిత వనరులతోనే కరోనాపై ఎలాంటి భేషైన యుద్ధం చేస్తున్నారో ఏమైనా గమనించారా..వాళ్లేం వీళ్లలా గొప్పలకు పోవడం లేదే...నాయనలారా ఆపండ్రా బాబూ ఈ  సుత్తె సొంత భజన


Comments

  1. ప్రధాని మోడీ ముందు రాష్ట్ర ప్రభుత్వాధినేతలతో & అట్లాగే సోనియా గాంధీ, స్టాలిన్ తదితర ప్రాముఖ్య నాయకులు & చర్చించారు. ఆ తరువాత 5+ లోకసభ సభ్యులు కలిగిన పెద్ద పార్టీల నేతలతో సంప్రదించారు. మెలిమెల్లగా ఇతర చిన్నాచితకా దళాలతోనూ ఎప్పుడో అప్పుడు వీలు చూసుకొని పలకరిస్తారు. సీతారాం ఏచూరి, అసదుద్దీన్ ఒవైసి, డా. ఫరూఖ్ అబ్దుల్లా లాంటి వారికి కూడా అవకాశం వస్తుందని తెలుసు కాబట్టి వారు హాహాకారాలు పెట్టడం లేదు.

    ReplyDelete

Post a Comment