ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీదు స్కూళ్లు..కాలం పొడిగించాల్సిందే


చడీ చప్పుడు లేకుండా వచ్చి విజృంభించిన కరోనా దెబ్బకి భారతదేశంలోని ఓ తరం విద్యాసంవత్సరమే
నష్టపోతారా అన్నంత ప్రభావం కన్పిస్తోంది..మార్చి, ఏప్రిల్ నెలల్లోనే మన దేశంలోని ఎక్కువగా విద్యాసంస్థలు ఎడ్యుకేషన్ ఇయర్ పూర్తి చేయడం..కొత్తగా ఎంట్రన్స్‌లు నిర్వహించడం జరుగుతుంటుంది..ఈ దశలో దేశంలో అన్నీ మూసేయడం విద్యార్ధులను తీవ్రంగా దెబ్బతీసింది..స్కూళ్లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా చెప్పలేని స్థితి ఇప్పుడు విద్యారంగం మన దేశంలో ఉపాధి కల్పించడమే కాదు..భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది కూడా..అలాంటిది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ దాదాపు ముగింపు దశలో కరోనా ప్రభావంతో అన్నీ ఆపేయాల్సిన పరిస్థితి..ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా  పదో తరగతి వరకూ ప్రమోషన్ విధానమో..మరోటో అమలు చేయొచ్చు..కానీ టెన్త్, ఇంటర్, డిగ్రీ, పిజీ..నీట్..ఐసెట్ వంటి ఎన్నో  ఎంట్రన్స్‌ల భవిష్యత్తు అగమ్యగోచరం..మన దేశంలో ఇంకా ఆన్‌లైన్ విధానం అమలులోకి రాలేదు కాబట్టి..వీటి నిర్వహణపైనే కొత్త విద్యాసంవత్సరంలోకి..పై చదువులకు విద్యార్ధులు వెళ్లగలుగుతారు..ప్రభుత్వం ఈ ఒక్క రంగంపైనే 2020-21 సంవత్సరానికి
రూ.99,300కోట్లు కేటాయించింది..స్కిల్ డెవలప్‌మెంట్ కోసం 3000కోట్లు కేటాయించింది..

దేశం మొత్తం మీద  2 కోట్ల 62లక్షలమంది విద్యారంగంలో వివిధ హోదాల్లో ఉపాధి పొందుతున్నట్లు అంచనా..ప్రభుత్వరంగంలోని ఉపాధ్యాయులంటే జీతాలందుతాయ్..కానీ  ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రవేట్ రంగంలోని టీచర్ల పరిస్థితి అధ్వాన్నం. ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి కోసం నడుపుతున్న ట్రైనింగ్ సెంటర్లలో కోటిమంది ఏటా బైటికి వస్తున్నారు..లాక్‌డౌన్ కారణంగా నైపుణ్యం కలిగిన మానవవనరులలో పది నుంచి
15శాతం వరకూ తగ్గిపోతాయని కేపిఎంజి సంస్థ అంచనా వేసింది..  కార్యకలాపాలు ప్రారంభమైనా సుస్థిరత లోపించడంతో ఎంఎస్ఎంఈలలో భారీగా మూసివేతలు చోటు చేసుకుంటాయనే ప్రమాదాన్ని హెచ్చరించింది..వీటితో పాటే స్కిల్ సెంటర్ల మూసివేత కూడా దేశంలో నిరుద్యోగం పెంచుతుందని చెప్పింది..ఈ ప్రభావాలన్నిటిపైనా అధ్యయనం చేసిన కేపిఎంజి రెండు రకాల పరిస్థితులు ఉండొ్చ్చని ఊహించింది..తక్కువలో
తక్కువ ప్రభావమైతే..అకడమిక్ ఇయర్ పూర్తి చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది..అలానే ప్రస్తుత విద్యాసంవత్సరం గడువు కూడా మార్చవచ్చనే అవకాశాన్ని ఊహించింది. అలానే విద్యాసంస్థలు అప్రెంటీస్‌ని నియామకాలు నిలిపివేయవచ్చు..ఇక రెండో రకం పరిస్థితి అయితే ఆన్‌లైన్ లెర్నింగ్‌కి ప్రాధాన్యత పెరుగుతుందని..బడ్జెట్‌లో మార్పులు చేర్పులు జరుగుతాయని..అంచనా వేసింది..అలానే చాలా స్కూళ్లలో మద్యాహ్న భోజన పథకం లేకపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పెరుగుతుందని స్పష్టం చేసింది..ప్రవేట్ స్కూళ్లలో పేమెంట్లు తగ్గినా లేట్ అయినా..నగదు లభ్యత సమస్య తలెత్తుతుందని కేపిఎంజి అంచనా వేసింది..
 విద్యారంగంలోని ఈ సమస్యలకు సోషల్ ప్రొటెక్షన్ పద్దతులతో పాటు ఫ్రీ మెడికల్ లీవ్, పెయిడ్ లీవ్స్ మంజూరు చేయాలని సూచించింది ..బ్యాంకులు.ఎన్‌బిఎఫ్‌సి నుంచి రుణాలు పొందిన విద్యాసంస్థల రుణాల వాయిదాని అనుమతించాలని కోరింది..నష్టపోయిన సమయాన్ని పూడ్చుకునేందుకు ట్రైనర్ల సమయాన్ని పొడిగించడం..అలానే ఈ కంటెంట్ డెవలప్ చేసేందుకు వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి సన్నద్దత సమకూరుతుందని కెపిఎంజి సిఫార్సు చేసింది..

Comments