రక్తదానం చేయడం కూడా నేరమేనా..వెతుకు వెతుకు ఎక్కడ దొరుకుతారో వెతుకు అందజోతీ..


ఈ న్యూస్ పూర్తిగా చదవండి...రక్తదాన శిబిరం ప్రారంభించారట..పైగా నిబంధనలను తోసిరాజన్నారట..పైగా చివరి లైన్ చూడండి..వైద్యసిబ్బంది  సాధారణ మాస్క్‌లు ధరిస్తే..వీళ్లంతా ఎన్ 95 మాస్క్‌లు ధరించారట..ఇందులో తప్పేముందీ..ఎవరికి తోచిన మాస్క్‌లు వాళ్లు వేస్కుంటారు..ఇంకా నయం విజయసాయిరెడ్డి డాక్టర్ల మాస్క్ లు లాగేసుకుని తన మొహానికి వేస్కున్నాడని రాయలేదు..అసలే  బ్లడ్ డొనేట్ చేసేవాళ్లు లేక ఎక్కడిక్కడ బ్లడ్ బాటిల్స్ కొరత ఉన్నాయంటూ వాపోతుంటే..ఇలా రాయడం ఏ పాతాళానికి అడ్రస్...? 

అదేదో ఎన్‌జిఓ స్టార్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అది..దానికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఓపెన్ చేయరు..ఓ వేళ సదరు పత్రిక అభ్యంతరం..విజయసాయిరెడ్డి తదితరులు పాస్‌లు లేకుండా అనో..అనుమతి లేకుండానే రక్తదానం చేశారనో  అంటే  అంతవరకూ కాస్త ఫర్వాలేదు..కానీా అసలు రక్తదానశిబిరాలకు అనుమతి లేదన్నట్లు రాయడం అందులోనే మళ్లీ ప్రభుత్వమే సడలింపు ఇచ్చిందనడం ...ఏం చెప్పాలనుకుంటున్నారసలు....

ఓ వేళ వైఎస్సార్సీపీ లీడర్లు నిబంధనలు ఫాలో అవడం లేదని చెప్పాలనుకుంటే..సోషల్ డిస్టెన్నింగ్ గురించి రాస్తే సరిపోద్ది..అలానే వీలైతే కేసులు పెట్టమని అదికారులకు సూచించవచ్చు..ఇంకా దూల తీరకపోతే కోర్టులో కేసులు కూడా వేయొచ్చు అది వదిలేసి..చేసింది ఏదో ఘోరమైన పని అన్నట్లు రాస్తే ఎలా..పైగా దానిపై నెటిజన్లు విమర్శిస్తున్నారట...ఏమని విమర్శిస్తున్నారయ్యా రాతగాడా...> బ్లడ్ డొనేట్ చేయవద్దనా...?

Comments

  1. అందరికీ సుఖ విరేచనం అవుతుంది. కానీ అంధ కోతులకు ప్రతిరోజూ ముఖ విరేచనాలు అవుతాయి.

    ఎదుటివారిలో ఏ కొంచెం మంచి కూడా చూడలేని నికృష్ట జన్మలు అవి.

    ReplyDelete
  2. మీ రేమీ అనుకోనంటే ఒకమాట. ఆ ఫోటో నిజమైనదే ఐన పక్షంలో అనగా ఇదే సందర్భం లోనిది ఐన పక్షంలో, ఒకటి రెండి ప్రశ్నలు. మొదటిది, అందులో ఉన్నవారు అంత దగ్గరదగ్గరగా ఉండటం ప్రస్తుతం తప్పు కదా? రెండవది, పండుకొని ఉన్న వ్యక్తి ముఖాన ఉన్న మాస్కు ఉండవలసిన తీరుగా నోటినీ ముక్కునూ కప్పి ఉంచుతున్నదా? ఈ ఫోటోను చూస్తే, ఈ ప్రశ్నలకు జవాబులపరంగా చెప్పవలసి వస్తే రెండు రకాలుగానూ తప్పిదమే జరిగినట్లు భావించవలసి ఉంది కదా. అందుచేత కేవలం ఈ వార్తను వ్రాసినందుకు పత్రికను అంధజోతి అనేయటంలో ఔచిత్యం లేదనే చెప్పవలసి ఉంది. ఫోటోలో కన్పిస్తున్న నిబంధనల ఉల్లంఘనను చూడలేక పోవటమే అంధత్వం అని చెప్పవలసి ఉంది. దయచేసి సంయమనంతో టపాలు వ్రాయండి. పార్టీబాకాలుగా (ఏపార్టీ బాకాలుగా ఐనా సరే) మాట్లాడటం సరైనది కాదు. మన్నించాలి.

    ReplyDelete
  3. వారు దగ్గర దగ్గరగా లేరు...కనీసం రెండు అడుగులు దూరంగా ఉన్నారు...దూరంగా ఉండమనడంలోని ఔచిత్యం..దగ్గినా..తుమ్మినా ఆ తుంపరలు గాల్లోకి వస్తాయని..సో మాస్క్ ఉంది కాబట్టి..ఆ ప్రమాదం లేదు..మాస్క్ ఆయన తీసేసి అలా లేరు..మాస్క్ ముఖం మీద నుంచి సర్దుకుంటున్న సందర్భంలో తీసిన ఫోటో...మీకు వీడియో కావలసియున్న..పంపెదను...నిబంధనల ఉల్లంఘన జరిగింది అనే హెడ్డింగ్ పెట్టుకోకుండా...రక్తదానం చేసారు..ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు అనే హెడ్డింగ్ పైనే మా ఆక్షేపణ..వ్యాసం అంతా కూడా అలానే ఉన్నది...కాబట్టి..నేనేదో పార్టీ బాకా ఊదాననే బాధ అక్కరలేదును..ఎందుకంటే...నేను అందులో రాసినందంతా...సదరు అజో...గురించే..ఇక అంధజోతి అనెందుకు రాస్తున్నానంటే.....ఉక్రోషంతో...ఎవడినీ ఏమీ చేయలేని సన్నాసులు మనపైన బడినప్పుడు టైటిల్ అది కాదు అని చెప్పి తప్పించుకోవడానికి..అదీ కథ...దీనికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు..భావించవచ్చు

    ReplyDelete
  4. ఇవ్వాళ పొద్దటికెల్లి తాడేపల్లి రెడ్ జోన్ ప్రకటించలేదని ఏడుపొక్కటి. దక్షిణ కొరియాలో ఎన్నికలు దిగ్విజయంగా ముగిసాయన్న వార్త మాత్రం ఎక్కడా రాదు.

    సోనియా గాంధీ, యెడియూరప్ప లాంటి నాయకులు సంకుచిత రాజకీయాలు పక్కబెట్టి హుందాగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణితి పచ్చ కామెర్ల యెల్లో ఫీవర్ చిల్లర గాళ్ళకు ఎప్పుడొస్తుందో ఏమిటో?

    ReplyDelete

Post a Comment