అరే ఆ విషయంలో ఏపీ సూపర్ డెసిషన్..మరి ఇప్పుడు టిడిపి ఏమంటుంది..?


లక్ష ర్యాపిడ్ కిట్లు..అందులోనూ పది నిమిషాల్లో రిజల్స్ట్ వచ్చే కిట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌత్ కొరియా నుంచి తెప్పించుకుంది..దేశంలోనే ఇలా ఓ రాష్ట్రం కిట్లు ఇంపోర్ట్ చేసుకోవడం తొలిసారి..కరోనాపై పోరాటంలో ఏపీ సమర్ధవంతంగా పని చేస్తుందని..ఎన్‌డిటివి అంటే అది సాక్షికి నకలంటారు..టైమ్స్ నౌ చెప్పినా పట్టించుకోరు..అసలు ఇందులో భజనల సంగతి పక్కనబెడితే..కావాలనే ఏపీలో భయబ్రాంతులకు గురిచేసే జనం ఎక్కువ ఉన్న  సమయంలో ఇలా రికార్డు స్థాయిలో స్పందించడం పాపం కొంతమందికి ఖచ్చితంగా మింగుడుపడదు..

టెస్టింగ్ చేయడం లేదు టెస్టింగ్ చేయడం లేదు అంటూ వాపోయేవారు.. ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో చూసి వాపోవాలి..అలానే అసలు టెస్టులు ఎందుకు తక్కువ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఇంగితం లేకుండా మాట్లాడితే ఎలా..టెస్ట్ చేయాలంటే..టెస్టింగ్ కిట్ కావాలి..అలానే సదరు టెస్ట్ చేసే సిబ్బందికి రక్షణపరికరాలు కావాలి...అవి లేకపోవడంతోనే పరిమిత స్థాయిలో చేస్తున్నారు..పైగా ఎవరికి పడితే వాళ్లకి చేయరు..దానికి కూడా డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలతో పాటు..కేంద్రం జారీ చేసిన నిబందనలను ఫాలో అవ్వాలి..బాబు చెప్పాడనో...ఎవరో వర్లాడనో..చేయరు..ముందు ఫారిన్  రిటర్న్స్ కి ..తర్వాత ఢిల్లీ రిటర్న్స్ కి..తర్వాత పాజిటివ్‌ కేసులను కాంటాక్ట్ అయినవారికి..ఆ తర్వాత కరోనా లక్షణాలున్న వారికి..ఈ ప్రయారిటీలో చేస్తారు...అంతేకానీ...ఎవడో ఎక్కడో దగ్గగానే పోయి చేయడానికి ప్రయారిటీ వెంటనే ఉఁడదు...ఈ ప్రయారిటీ ఆర్డర్లో చేసుకుంటూ...అందుబాటులోకి కిట్లు రాగానే మిగిలినవారికి కూడా విరివిగా చేస్తారు...అలానే క్వారంటైన్...ఐసోలేషన్ కి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయ్..ఇప్పుడు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఖచ్చితంగా హాస్పటల్ ట్రీట్ మెంటే..అలానే లక్షణాలు మైల్డ్ గా మాత్రమే కన్పిస్తే..ఇప్పటిదాకా హోమ్ క్వారంటైన్...ఇకపై ఐసోలేషన్...

ఈ వాస్తవాలు తెలీకుండా...ఏపీలో ఏదో జరుగుతుంది...ఏదో అయిపోతుంది...అదుగో మేం చెప్పాం...మేం అప్పుడే చెప్పామంటూ గప్పాలు కొట్టడం కాదు..ఇప్పుడు లక్ష కిట్లతో టెస్టులు జరగబోతుంటే..వైపె ...వెంకయ్యనాయుడు గారే
శభాష్ ఏపీ..ముదావహం అంటూ ట్వీట్ చేయాల్సి వచ్చింది..పైగా ముఖ్యమంత్రే స్వయంగా ముందు టెస్ట్ చేయించుకుని..ఇఁదులో గాభరా పడాల్సింది లేదనే సంకేతాలు జనాలకు ఇచ్చారు..ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రైనా ఇలా ఓ మార్గదర్శిగా నిలిచాడా..కరోనా టెస్టులకోసం క్షేత్రస్థాయికి వెళ్తున్న వారిపై దాడులు చేసేవారికి ఇదో సంకేతం...టెస్టులకు నిరాకరించవద్దనే సూచన..ఐనా...ఇది విమర్శించేనోళ్లకి అర్ధం కాదు..వాళ్ల బతుకులంతే అని సరిపెట్టుకోవాలి..ఇక రేపట్నుంచి అదిగో...మా ఒత్తిడితోనే కిట్లు కొన్నారు..ఎహ్ మేమే సౌత్ కొరియావాళ్లకి సిఫార్సు చేసాం...అంటూ సన్నాయి మేళం ప్రారంభమవుతుందేమో మరి

Comments

  1. ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎన్ని మంచి పనులు చేసినా కళ్ళు చెవులు మూసుకున్న అంధ కోతులకు కనిపించవు. వినిపించవు.

    ReplyDelete
  2. లక్ష రాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించటం మంచి విషయమే. కాదనటానికి లేదు. కాని ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. మొదటిది. ఈ రాపిడ్ టెష్ట్ అనేది లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే చేయాలి - ఇది ఉల్లంఘించినందుకు సాక్షాత్తూ జగన్ బాబు మీదనే కేద్రం ఆగ్రహం వెలిబుచ్చినదని వార్త. రెండవది. ఈ కిట్ల కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి - ఛత్తీస్‍ఘడ్ వారు ఒక్కోటి రూ.337 చొప్పున కొంటేమన వాళ్ళు రూ.1200 చెల్లించారట - కాదు 700 చిల్లరే అన్నారట లెండి ఇప్పుడు. కాని ఇదైనా చాలాచాలా ఎక్కువ కదా. మూడవది. జనం మీద పడి ఈ రాపిడ్ టెస్టింగ్ చేసి నెగెటివ్ అని భారీ ఎత్తున వదిలేస్తే ఆ తరువాత పరిణమాలకు ఎవరు బాధ్యత వహించాలి చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. రాపిడ్ టెస్ట్ అందరికీ చేయకూడదు, బయాస్డ్ సాంప్లింగ్ పద్దతి అవలంభించాలన్న విషయంతో పూర్తి సహమతి.

      కేంద్రం కోప్పడిందని గాలి వార్తలు రాసినోళ్లను ఇగ్నోర్ చేయడం బెస్ట్. రాష్ట్రాలు తమకు సబార్డినేట్లు కాదన్న ఇంగితం మోడీ గారికుంది కాబట్టే అందరినీ కలుపుకుపోతున్నారు. కోప్పడే లేదా తిట్టే హక్కు ఎవరికుందో తెలియని ప్రచా(సా)ర మాధ్యమాలు రాస్తే రాయనీయండి.

      విద్యుత్ కొనుగోలు రేట్లను తగ్గిద్దామని ముఖ్యమంత్రి గారు ప్రయత్నించినప్పుడు నానా యాగీ చేసిన పచ్చంగీలు ఇవ్వాళ మాస్కు ధరల గురించి గగ్గోలు పెట్టడం విడ్డూరం.

      కుదిరితే మీరే క్షేత్రస్థాయిలో ఉన్న వారిని సంప్రదించి సొంత అవగాహనకు రావాల్సిందని మనవి. ఓడిపోయామన్న అక్కసుతో విషం కక్కుతున్న చిల్లర రాతగాళ్లను పట్టించుకోబళ్లా.

      నా ఎరిక మేరకు పెద్ద నాయకులు & వందిమాగధులు తప్ప కట్టర్ టీడీపీ వీరాభిమానులు సైతం రాజకీయాలు పక్కనబెట్టి తమవంతు ఏదోకొంత మంచే చేస్తున్నారు. This is a positive sign of swiftly changing ground realities.

      Delete
    2. నా పని టిడిపిపై పడి ఏడవడమే అయితే..మరి తమరి పని ఏంటి..వారిపై పడి ఏడిచే వాళ్లకి కౌంటర్లిద్దామనే తాపత్రయమా..ఎందుకు ఈ ఆత్మవంచన...నేను వైఎస్సార్సీపీ అభిమానినే..అందులో సందేహం లేదు..కానీ తప్పు చేయకుండా బురద జల్లితే చూస్తూ ఊరుకోవాలా...నేనే పార్టీకి సపోర్ట్ ఇస్తానో చెప్పా..అలానే...నేను సపోర్ట్ చేయనంతమాత్రాన వాళ్లకి వచ్చే నష్టం లేదు..ఇంకా చెప్పాలంటే..జగన్ మోహన్ రెడ్డి తప్పు చేస్తే..దాన్ని ఒప్పుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే.. ఇదేం గొప్ప కాదు..ఒకళ్లు ఒప్పుకోనంత మాత్రాన తప్పు కాకుండా పోతుందా...జగన్ పారాసిటమాల్ వేస్తే తగ్గుతుంది అనడంలో తప్పు లేదు...కానీ ఎలక్షన్స్ ఆపకూడదు అనడం తప్పే...కరోనా సీజనల్ గా వస్తుంటుంది పోతుంటుంది అన్నది కూడా తప్పు కాదు..అది వాస్తవం...ఐతే అందుకోసం ఎన్నికలు ఆపాలా అనడం మాత్రం తప్పే..ఇలా విశ్లేషించాలి కానీ..ఊరికే...గుడ్డెద్దు చేలో పడ్డట్టు...ఎహ జగన్ వల్లే కరోనా వచ్చిందనే దయలేని రమాగాళ్లలా మాట్లాడటం మాకు చేతకాదు

      Delete
  3. మరి టెస్టులు ఎప్పుడు చేయాలి...ఆల్రెడీ జగన్ ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడనేది..ఓ సంకేతం కోసమే అని చెప్పారు..అక్కడికేదో ఆయనకి టెస్ట్ చేయడం ద్వారా...లక్షలాదిమందికి టెస్టులు చేసే భాగ్యం కోల్పోియిందన్నట్లు మాట్లాడొద్దు..అచ్చంగా అజో కరపత్రంలో ఏది రాస్తే..అదే చదడవం అర్ధం చేసుకోవడం మానేయాలి..టెస్టులు ఎవరికి చేయాలో తెలిసినవాళ్లు...మరి టెస్టులు తక్కువ చేశారని వీడియో కాన్ఫరెన్సుల్లో వాగడం ఎందుకు...కిట్ల కొనుగోలులో అవకతవకలని వాగే ముందు...సౌత్ కొరియా గవర్నమెంట్ సరఫరా చేయడం లేదు..చైనా గవర్నమెంట్ సరఫరా చేయడం లేదు..ఆ దేశాల్లోని కంపెనీలు సరఫరా చేస్తున్నాయ్...ఎవరికి ఏ కంపెనీ దొరికితే..ఆ కంపెనీతో టైఅప్ పెట్టుకుని దిగుమతి రాష్ట్రాలే చేసుకుంటున్నాయ్...అసలు టెస్ట్‌లకు ఇక్కడి ప్యాథ్ ల్యాబ్స్...సో...కాల్డ్ ప్రవేట్ ల్యాబ్స్ 4500 తగలబెడుతుంటే అడగనివారు..700లకో 1200లకో తెప్పించి..వాడుతుంటే..అదిగో చత్తీస్ గఢ్ 300కి తెప్పించుకుందట..ఇదిగో నారావారిపల్లలో ఎవడో 200కే చేస్తున్నాట్ట అంటూ కామెంట్ చేయడం తగదు...ఒక్కో కంపెనీ ఒక్కోలా అమ్ముతుంది..పారాసిటమాల్ సిప్లా రేటెంత్..డా.రెడ్డీస్ రేటెంత..జన ఔషధి లో రేటెంత..మీరు అక్కడే ఎందుకు కొన్నారు అని ఎలా ప్రశ్నిస్తున్నారు..అవసరానికి ముందు అందుబాటులో ఉన్న చోట తెచ్చుకుంటాం..అంతేకానీ ప్రపంచంలో ఎవడు తక్కువకి అమ్ముతున్నాడని తెలుసుకుని..మీన మేషాలు లెక్కపెట్టుకుని తీసుకురాడు..పైగా ఈ ఎక్కువ తక్కవ యవ్వారం రాసింది..ఏ పత్రికా కాదు..కేవలం అంధపాపినే....బురద జల్లితే సరి...వాడే కడుక్కుంటాడనే ధోరణి..జనం మీద పడి ర్యాపిడ్ టెస్ట్ చేసి నెగటివ్ అని వదిలేస్తున్నారని మీకెవరైనా చెప్పారా.. అసలు ర్యాపిడి టెస్ట్ లో పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి అనే జ్ఞానం లేకుండానే కిట్లు కొనుక్కొచ్చారనుకున్నారా.....కొద్దిగా అయినా వాడండి..సర్...అంతెందుకు..చంద్రబాబుగారిని చేయించుకోమనండి ...అరే జనం..అసలు టెస్టులంటే భయపడుతున్నారు...ఎక్కడ క్వారంటైన్‌కి పంపుతారో.. ఫేక్ న్యూస్ చదివి అక్కడెంత నరకంగా ఉంటుందో అని తబ్లీగీకి దియాబందీకి పోయినోళ్లు బైటికి రావడం లేదు..పైగా దాడులు చేస్తున్నారు..వాళ్లకి ఇదేదో ఘోరం కాదురా సామీ అనే సంకేతం ఇస్తే..అందులో బొక్కలు వెదకడమే అసలైన జబ్బు...బల్క్ గా కొంటే ఈ 700..500కి వర్కౌట్ అవుతుందేమో కానీ..అసలు ఓ షుగర్ బ్లడ్ టెస్ట్‌కి కూడా 200 తీసుకుంటున్న రోజులు...అలాంటప్పుడు రేటెక్కువ అని వగస్తున్నారంటే ఖచ్చితంగా ఇది హోమ్ క్వారంటైన్లలో ఫ్రశ్ట్రేషనే అనాలి...

    ReplyDelete
  4. ఈ లింక్ లో వీడియో మొత్తం చూడండి...కనీసం ఓ 12 వ నిమిషం వరకైనా చూడండి..వినండి
    https://www.youtube.com/watch?v=eTgMKf49wOM

    ReplyDelete
  5. Rapid test KI PCPR KI teda ledaa? 4500 PCPR test ki.
    Bodi rapid test KI kaadu.
    350 rupees test ni 4500 test to polchi kotlu save chesaamani gappaalu kottakandi.

    ReplyDelete
  6. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు మీకు అనునిత్యం ఆ తెదేపా మీద నెపం వేసి అరుస్తూ ఉండటమే పని. కంసుడికి ఎల్లెడలా కృష్ణుడే కనిపించాడట - అలా ఉంది. మీతో వాదనెందుకూ, మీరే రైట్ అనేస్తే సరిపోయే దానికి. మీరన్నది నిజమైనా తెదేపాను తిట్టవచ్చును అబధ్ధమైనా ఏదోరకంగా తెదేపానే తిట్టవచ్చును మీరు. నిత్యం చూస్తున్నదే కదా. ఇంత చిన్న లాజిక్ వదిలి మీతో వాదనెందుకు లెండి.

    ReplyDelete
    Replies
    1. మీరు ఈ ముక్క కామెంట్ పెట్టకముందు ఆలోచించాల్సింది...సదరు అంధజోతిపై కామెంట్ చేయడం..టిడిపిపై పడి ఏడవడం రెండూ ఒకటే అని ఎలా సూత్రీకరించారు..అంటే మీకు తెలీకుండానే..కరపత్రికల అసలు ఓపెన్ సీక్రెట్ బయటపడేశారు కదా..

      Delete
    2. మురసోలి, కలైనారు, జేజే, సామ్నా, సాక్షి, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణా వగైరాలు పార్టీ కరపత్రాలు. బాహాటంగానే తమ పార్టీ విధేయత చాటాయి.

      ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు నిష్పక్షపాతం & తటస్థం లాంటి ముసుగు ఇప్పేసి పచ్చ జండా తొడుక్కుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

      కంసుడికి కృష్ణుడే కన్పించాడు అనే నానుడి జగన్ పేరు చెప్తేనే ఒంటికాలు మీద లేచే వారికి వర్తించదా లేదా మీరే పరిశీలన చేసుకుంటే బాగుంటుంది.

      Delete
  7. జై గారు బాగా చెప్పారు. హిరణ్య కశిపుడు 24 గంటలు హరి నామ స్మరణం చేసినట్లు పచ్చ చిడతలకు ఎప్పుడూ జగ న్నామ జపమే.

    ReplyDelete

Post a Comment