కరోనా సమయంలో సౌత్ కొరియా స్ఫూర్తి



చైనా పక్కనే ఉన్న చిన్న దేశం..సౌత్ కొరియా..జనాభా ఐదుకోట్లు..అంటే మన దేశంలో ఓ చిన్న రాష్ట్రమంత అనుకోండి..ఐతేనేం ఇప్పుడు ప్రపంచదేశాలకు ఓ స్పూర్తినిస్తోంది..ఆపద సమయంలో భారత్ ఎలాగైతే మందులు పంపి ఇతర దేశాలకు సాయం చేస్తోందో.. దక్షిణ కొరియా కూడా టెస్టింగ్ కిట్స్ పంపిస్తూ
పేరు తెచ్చుకుంటోంది..ఇంతకీ ఈ ఫీట్ ఎలా సౌత్ కొరియా ఎలా సాధించగలిగిందంటే..అక్కడ ఉన్న కంపెనీల ముందు చూపు..అదే ఇప్పుడు మిగిలిన దేశాలకు వెలుగులా మారింది..

 జెన్‌క్యూరిక్స్..ఇక్కడే ఇప్పుడు ప్రపంచదేశాలకు కరోనా నిర్ధారణ కిట్లు తయారవుతున్నాయ్..ఒక్కో కిట్‍తో
వందమందికి టెస్ట్ చేయవచ్చు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు..మార్గదర్శకాలకు అనుగుణంగా పిసిఆర్ కిట్లను జెన్‌క్యూరిక్స్ సంస్థ తయారు చేస్తుంది..అలా అని ఇదేదో పెద్ద ఫార్మా కంపెనీ కాదు..అసలు జెన్‌క్యూరిక్స్ టెస్టింగ్ కిట్స్ తయారు చేయడం ఎప్పుడు ప్రారంభించిందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా  ఉండలేరు..జనవరిలో..వుహాన్‌లో ఎప్పుడైతే కరోనాతో మొదటి మరణం సంభవించిందో వెంటనే ఇక్కడి ల్యాబ్‌లో టెస్టింగ్ కిట్స్‌పై పరిశోధన ప్రారంభమైంది..దీనికి వారికి గతానుభవం నుంచి నేర్చుకున్న పాఠాలే  ఉపయోగపడ్డాయ్..2015లోనే ఇలానే మెర్స్ వైరస్ సోకినప్పుడు...వ్యాధి నిర్ధారణకి ఉన్న ప్రాధాన్యత తెలిసి వచ్చింది..అందుకే కోవిడ్ 19 టెస్టులకు అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.. దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా జెన్‌క్యూరెక్స్‌తోపాటు ఇతర కంపెనీలకు కిట్స్ తయారీలో కలిసి వచ్చింది. సౌత్ కొరియన్లకు సొంతంగా  టెస్టులు నిర్వహించేందుకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వారిని మార్గదర్శులుగా నిలబెట్టింది..

 ఇక టెస్టింగ్ కిట్స్ తయారైన తర్వాత సౌత్ కొరియా వైరస్ వ్యాప్తిని అరికట్టిన తీరు..స్పందించిన తీరు టెక్ట్స్ బుక్స్‌లో పాఠ్యాంశంగా చేయదగిన రేంజ్‌కి చేరాయ్..కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలోనే 5లక్షల30వేలమందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు..వారిలో పదివేలఐదువందలమందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా..222మంది చనిపోయారు..మరణాల రేటు ఇక్కడ 2శాతానికి కాస్త పైన..ఇదొక్కటే కాదు
ఫిబ్రవరి 18న సౌత్ కొరియాలో ఫస్ట్ కరోనా కేసు నమోదైంది..వారం రోజులు తిరగకుండానే వేలకి చేరింది..ఫిబ్రవరి 29న అయితే 909 కేసులు నమోదు అయ్యాయ్ ఐతే ఇంకో వారం గడిచింది..కానీ కేసులు సంఖ్య మాత్రం బారీగా పడిపోయాయ్..దీనికి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సమయంలో ఆ దేశం ఎదుర్కొన్న అనుభవమే మళ్లీ ఉపయోగపడింది...2015లో ఓ వ్యాపారవేత్త విదేశాలకు వెళ్లి మెర్స్‌ వైరస్‌తో దేశంలోకి అడుగుపెట్టాడు. 186 మందికి అతడు ఈ వైరస్‌ను అంటించగా.. వారిలో 36 మంది చనిపోయారు. దీంతో సౌత్ కొరియా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి దాదాపు 17 వేల మందిని గుర్తించి వారందరిని క్వారంటైన్‌లో ఉంచింది. ఇలా మెర్స్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమేసింది.  ఇప్పుడూ అంతే రోజూ  20 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.. కరోనా బాధితులను వెంటనే గుర్తించి వారిని క్వారంటైన్లకు తరలించింది. ..

ఈ మధ్యనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కూడా ప్రపంచానికి సౌత్ కొరియా మరో పాఠం నేర్పింది.. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంది..అలానే ఓటర్లకు రబ్బర్ గ్లవ్స, ఫేస్ మాస్క్ తప్పని సరి చేస్తూ...ఖచ్చితమైన థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించింది..అన్నింటికంటే గొప్ప విషయం క్వారంటైన్లలో ఉన్నవారిని కూడా పోలింగ్‌లో పాల్గొనేలా చేయడం..పోలింగ్ స్టేషన్లకు వచ్చిన కొద్ది సమయంలో ఓటేసి వెళ్లిపోయేలా చేయడంలో సౌత్ కొరియా గవర్నమెంట్ సక్సెస్ అయింది.

 ఇవన్నీ ఒక ఎత్తు అయితే పట్టణాలు గ్రామాల్లో పేదవారి ఇళ్లలో శానిటైజేషన్ ఉచితంగా చేయడం మరో హైలైట్.. ముందుగానే శానిటైజేషన్ సిబ్బంది తాము వస్తున్నట్లు సమాచారం ఇస్తారు.ఎందుకంటే ఇరుకు ఇళ్లలో సోషల్ డిస్టెన్స్  పాటించడం కుదిరే పని కాదు..కొన్ని అపార్ట్‌మెంట్లలో అయితే చాలా మంది ఒకే కిచెన్‌ని వాడుకుంటారు..అయినా సరే..వైరస్ విజృంభిస్తుందన్న భయం లేదు..ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం తీసుకునే చర్యలపై వారికి నమ్మకం.. అలానే ఫేస్ మాస్క్‌లు లేనివారికి ఆరోగ్యకేంద్రాలలో ఉచితంగా పంపిణీ జరుగుతుంటుంది.. ఇక్కడ లాక్‌డౌన్ గురించిన చర్చే జరగదు..సియోల్ లాంటి నగరాల్లో సోషల్ డిస్టెన్స్ గురించి బాగా ప్రచారం చేసింది ప్రభుత్వం..ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పే మాటలను ఆచరిస్తున్నారు..ఇళ్లలోంచి బైటికి రాలేదు..ఐతే ఇప్పుడిప్పుడే జనం ఇళ్లనుంచి బైటికి పెద్ద సంఖ్యలో వస్తుండటం  కాస్త కలవరపరిచే అంశంగా చెప్తున్నారు.. ఇప్పుడిప్పుడే సియోల్‌ లాంటి చోట్ల నైట్ క్లబ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయ్.....ఇలాంటి సీన్లే సౌత్‌కొరియాని కరోనా సీజన్‌లో హీరోగా మార్చాయ్.

Comments

  1. మన దగ్గర ఉన్నట్లు న్నికృష్ట ప్రతిపక్షం, పైశాచిక మీడియా కోరియా లో లేకపోవచ్చు. కొరియా వారి పద్ధతులు ఆదర్శం కావాలి.

    ReplyDelete

Post a Comment