రోడ్లపై చమురు పారబోస్తారా...అమ్మేవాడే కొనేవాడికి డబ్బులివ్వాలా..?



రేటు పడిపోతే టమోటా రైతులు రోడ్డున పడేసిపోయినట్లు..ఇప్పుడు అమెరికాలో కూడా క్రూడాయిల్‌ని కొనేవాళ్లే లేకుండా పోతారా..అవును అనేలానే సిచ్యుయేషన్ ఉంది..ఎందుకంటే ఇక్కడ చమురు రేటు ఏకంగా నెగటివ్ రేటుకి పడిపోవడమే ఇందుకు నిదర్శనం..అంటే అమ్మేవాళ్లే కొనుగోలు చేసేవారికి ఎదురు డబ్బులివ్వాల్సిన సిచ్యుయేషన్ ఎదురైంది..
ప్రపంచ చరిత్రలోనే ఇదో విచిత్రమైన పరిణామం..కరోనా దెబ్బతో చమురు ధరలు ఎలాంటి దారుణంగా పడిపోయాయనేదానికి ఇదే నిదర్శనం..మన దగ్గర అప్పుడప్పుడూ టమోటాలకు గిట్టుబాటు రేటు రాక రోడ్లపైనే రైతులు పారబోసినట్లుగా..కొనేవాళ్లే లేకపోవడంతో అమెరికన్ క్రూడాయిల్ అసలు రేటుకంటే పాతాళానికి పడిపోయింది.  18 డాలర్ల నుంచి కొనేవాళ్లే లేకపోవడంతో..మైనస్ 40డాలర్లకు పడిపోయింది..అంటే అమెరికన్ క్రూడాయిల్‌ని అమ్మేవాళ్లే  కొనుగోలు దారులకు ఎదురు డబ్బులిల్వాల్సిన పరిస్థితి అన్నమాట. నైమెక్స్‌గా  పిలిచే అమెరికా క్రూడాయిల్ గత వారాంతానికే 20శాతం నష్టపోయింది....సోమవారం ఓపెనింగ్‌లోనే మరో 20శాతం నష్టపోయింది..ప్రస్తుతానికి కోలుకున్నా..ధరలు ఎంతకాలం నిలబడతాయో చెప్పలేని పరిస్థితి

అమెరికన్ క్రూడాయిల్ ఇంత దారుణంగా పతనం కావడానికి కారణం..ప్రస్తుతం  క్రూడాయిల్‌కి ఎక్కడా డిమాండ్ లేదు..అలానే దాచిపెట్టుకుని భవిష్యత్తులో వినియోగించుకుందామన్నా..ప్లేసూ లేదు.విచిత్రంగా అన్పిస్తున్నా ఇదే నిజం..అందుకే అమెరికా క్రూడ్ స్టోరేజ్‌కి హబ్‌ అయిన ఒక్లహామాలో నిల్వలు 70శాతానికి చేరాయ్..మరోవైపు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్‌లో ట్రేడర్లు కనీసం వెయ్యి బారెళ్ల చమురు డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది..దీంతో ఇక స్టోరేజీ లేకపోతే..ఎక్కడ చమురుని నిల్వచేయాలి..అచ్చంగా రోడ్డుమీదే పారబోయాలి...అలాంటి స్థితి ఏర్పడుతుందనే ఏకంగా నెగటివ్ రేటుకి కూడా నైమెక్స్ పడిపోయింది..1983 నుంచి నైమెక్స్ ట్రేడవుతుండగా..ఈ స్థాయికి దిగజారడం ఇదే ఫస్ట్ టైమ్...పోనీ ఆయిల్ ని గ్యాసోలిన్‌గానో..డీజల్‌గానో..ఇతర ఉత్పత్తులుగా మార్చాలన్నా ఎక్కడా వాడే పరిస్థితి కన్పించడం లేదు..

సాధారణ పరిస్థితుల్లో రోజుకి 100 మిలయన్‌ బ్యారళ్లమేర నమోదయ్యే వినియోగం 70 మిలియన్‌ బ్యారెల్స్‌కి తగ్గిపోయింది. ఈ దశలో రేటు పడిపోకుండా ఉండేందుకు  రష్యాసహా ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 10 మిలియన్‌ బ్యారళ్లమేర కోత పెడుతున్నాయ్..ఐతే అమెరికాలో ఏప్రిల్ 17 నాటికే  చమురు నిల్వలు 16.1 మిలియన్‌ బ్యారళ్లకు చేరాయ్.  అదే సమయంలో క్రూడ్ స్థాయికి మించి సరఫరా అవుతోంది. దీంతో అదనపు చమురు నిల్వ చేస్తున్నారు..చమురు సంస్థలు మిగులు సరఫరాను నిల్వ చేయడానికి ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నారు... కానీ ఇలా ట్యాంకర్లు..ఆయిల్ స్టోరేజీ సెంటర్లు అన్నీ ఫుల్ అయిపోతూ పోతే..ఇంకెక్కడ నిల్వ చేస్తారు..అదే ఇప్పుడు జరిగింది.
మరోవైపు ఈ ధరల పతనం ఆయిల్ కంపెనీల దివాలాకి దారి తీస్తోంది.. క్రూడాయిల్ కనుక 20 డాలర్ల రేటులోనే ఉంటే కనీసం 80శాతం కంపెనీలు వ్యాపారాలు మూసుకోవాల్సిందేనంటున్నారు..దాంతో కనీసం అమెరికాలోనే రెండున్నరలక్షలమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారని పయనీర్ నేచురల్ రిసోర్సెస్ సంస్థ అంచనా వేస్తోంది. కనీసం బ్యారెల్ చమురు రేటు 30డాలర్లు ఉన్నప్పుడే లాభాల సంగతి పక్కనబెడితే..మనుగడ సాగించవచ్చని వాపోతున్నారు ఇప్పటికే అమెరికాలోని దిగ్గజ కంపెనీ హాలీబర్టన్ అనే ఆయిల్ కంపెనీలకు మాన్ పవర్, పరికరాలను అందజేసే కన్సెల్టెన్సీ మొదటి క్వార్టర్లో వందకోట్ల డాలర్ల నష్టాలను ప్రకటించింది.. గత ఏడాది ఈ సీజన్‌లో హాలీ బర్టన్ 152 మిలియన్ డాలర్లమేర లాభాలను ప్రకటిస్తుంది..అందుకే ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీలు చాలా తమ ఉత్పత్తి తగ్గించుకనే పనిలో పడ్డాయ్..అలాగైనా డిమాండ్ పెరుగుతుందనే దింపుడు కళ్లెం ఆశ వాటిది..

Comments