జియో ఫేస్‌బుక్‌ డీల్‌తో మాకేంటి..మహా అయితే డేటా దొంగతనం..జీవితాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి తప్ప..!



రిలయన్స్ జియో.. కేవలం నాలుగేళ్ల కంపెనీ.  ఫేస్‌బుక్ జియోలో 9.99శాతం వాటా కొనుగోలు కోసం 43వేలకోట్లకిపైగా ఇన్వెస్ట్ చేసింది.. 2019 లెక్కల ప్రకారం జియో మొత్తం ఆస్తుల విలువ
1,87,720కోట్లు..కానీ ఇప్పుడు మొత్తం వేల్యూ ఏకంగా నాలుగు లక్షలకోట్లను దాటేసింది.. అంటే జియో ఏ రేంజ్‌లో తన వేల్యూని పెంచుకుంటూ పోయిందో ఊహించుకోండి...డొమెస్టిక్ టెక్ రంగంలోనే అతి పెద్ద ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫేస్‌బుక్ పెట్టుబడిని చెప్తున్నారు....మైనారిటీ వాటా కోసం ఒక టెక్ కంపెనీ ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం కూడా ప్రపంచంలో ఇదే తొలిసారి కావచ్చు డీల్ పూర్తైన తర్వాత జియో సంస్థ ఏకంగా దేశంలోనే టాప్ ఫైవ్ బిగ్గెస్ట్ మార్కెట్ కేపిటలైజేషన్ కంపెనీగా మారుతుంది..అది కూడా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాకుండానే...

వాస్తవానికి ఈ డీల్‌పై కొన్ని రోజులనుంచి ప్రచారం జరుగుతూనే ఉంది..ఐతే కరోనాతో ఇంటర్నేషనల్ బోర్డర్స్ మూతపడటంతో...అధికారికంగా ఒప్పందంపై ప్రకటన రాలేదు..కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా తమ ఒప్పందంపై ప్రకటించి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపరిచారు..ఐతే ఈ మధ్యనే చైనాసహా ఏ పొరుగు దేశపు ఏ పెట్టుబడులపైనైనా..కేంద్రం ఎఫ్‌డిఐ పాలసీని మార్చిన నేపధ్యంలో తాజా డీల్ ప్రాధాన్యత సంతరించుకుంది.. ఓ వేళ ఎఫ్‌డిఐ పాలసీల్లో ఇంకా కఠినమైన మార్పులు రాకముందే ఫేస్‌బుక్ ‌తో డీల్ ముగించాలనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఆలోచనగా అంచనా వేయవచ్చు...ఓ వేళ ఇతర దేశాలేవీ కూడా తమ పర్మిషన్ లేనిదే ఇక్కడి పెట్టుబడి పెట్టడానికి లేదంటే ఎలా...ఎస్ అందుకే ఈ డీల్ హుటాహుటిన పట్టాలెక్కించేసారు..


ఇక ఈ  డీల్‌తో ఎవరికేంటనే అంశం ఆలోచిస్తే....రిలయన్స్ అధినేత చెప్తున్నదాని ప్రకారం దేశంలోని భారతీయులకు
డిజిటల్ వ్యవస్థ మరింతగా అందుబాటులోకి రానుంది..రిలయన్స్ రిటైల్ విభాగంతో ఫేస్‌బుక్‌కి చెందిన వాట్సాప్ కలిసి ఈ కామర్స్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించబోతోంది... న్యూకామర్స్ క్రియేట్ చేయబోతున్నాయ్.. జియో ప్లాట్‌ఫామ్స్ రిలయన్స్ రిటైల్, వాట్సాప్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి ధీటైన ఓ భారీ ఈ కామర్స్ వ్యవస్థ రూపుదిద్దుకోనుంది.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ వాటికంటూ దుకాణాలు లేవ్..కానీ రిలయన్స్ రిటైల్‌కి అన్ని విభాగాల్లో కలిపి 2018నాటికే 3837 స్టోర్లు.. 750 నగరాల్లో ఉన్నాయ్
ఫేస్‌బుక్ డీల్ ద్వారా ఇప్పుడు జియోమార్ట్‌ యాప్‌తో వాట్సాప్‌ లింక్ చేయబోతున్నారు..అలా రిలయన్స్ రిటైల్ వ్యాపారం భవిష్యత్తులో భారీగా వృద్ధి చెందబోతోంది..దీంతో పాటే జియోమార్ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న చిరువ్యాపారులు..కిరాణా షాపులను ఒకటే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురాబోతున్నారు..

ఇందులో భాగంగా ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జియో మార్ట్.. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది. దీంతో స్థానిక విక్రేతలు, చిన్న కిరాణా . అంటే ఆన్‌లైన్ రిటైలర్లుగా ఈ మూడు కోట్లమంది వ్యవహరిస్తారు. కస్టమర్లు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పొందొచ్చు. వాట్సాప్‌ను ఇప్పటికే కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. జియో‌మార్ట్‌తో జట్టు కట్టడం వలన ఫేస్‌బుక్ కే చెందిన వాట్సాప్ యూజర్ల బేస్ మరింత పెరుగుతుంది..... భారత్‌లో వాట్సాప్‌కి 40కోట్లమంది యూజర్లున్నట్లు అంచనా...వాట్సాప్‌‌కి ఇప్పటికే ఇండియాలో డిజిటల్ పేమెంట్ సర్వీస్‌కి పర్మిషన్ దక్కించుకుంది..ఇప్పుడు జియోమార్ట్‌తో అనుసంధానంతో భారత్‌లో వాట్సాప్ వ్యాపారం భారీగా పెరగనుంది..మరోవైపు ఇన్నాళ్లూ ఆఫ్‌లైన్, ఫిజికల్ ఆర్డర్లకే పరిమితమైన కిరాణా స్టోర్లు, లోకల్ వెండర్లు ఇక ఆన్‌లైన్ బాట పట్టనున్నారు. అంతేకాకుండా జియో మార్ట్ కూడా దూసుకెళ్లనుంది.


ఇదే ఇప్పుడు ప్రత్యేకించి కరోనా కాలంలో ముకేష్ అంబానీ మాస్టర్ స్ట్రోక్..ఎందుకంటే లాక్‌డౌన్ విధించిన ఈ సమయంలో ఎక్కడా వ్యాపారాలు జరగని పరిస్థితి..మామూలుగా ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు ప్రభుత్వాల స్థాయిలో జరగడం కష్టంగా ఉండేది..కానీ కరోనా సృష్టించిన సంక్షోభంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని డెలివరీ ఇచ్చే సంస్థలను ప్రభుత్వాలే ఇప్పుడు సంప్రదిస్తున్నాయ్. సురక్షితంగా డెలివరీ చేయాలే కానీ..ఆన్‌లైన్ డెలివరీకి కరోనా ప్రభావం ముగిసిన తర్వాత కూడా మంచి భవిష్యత్తు ఉంది...అందుకే ఇప్పటికిప్పుడు ఇతర అంశాల జోలికి పోకుండా రిలయన్స్ కేవలం జియోమార్ట్‌పైనే దృష్టిపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయ్...వాస్తవానికి ముకేశ్ అంబానీ కొంతకాలంగా ఫేస్‌బుక్‌తో కలిసి ఓ మల్టీపర్పస్ యూజ్‌ఫుల్ యాప్ తయారీ చేయడంలో ఉన్నారని ..ఆ వన్‌స్టాప్ యాప్‌తో ఫిన్‌టెక్ రంగంలో ప్రకంపనలు రావడం ఖాయమని ప్రచారం సాగుతోంది.. చైనాకి చెందిన వియ్‌చాట్‌లా ఉండబోయే ఆ యాప్‌తో సోషల్ మీడియా, డిజిటల్ పేమెంట్స్, గేమింగ్, హోటల్ బుకింగ్స్, అన్నీ చేయవచ్చని అన్నారు..దానికోసం మోర్గాన్ స్టాన్లీని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌గా నియమించుకున్నారు. ఆ ప్రయత్నం ఎంతవరకూ వచ్చిందో తెలీదు కానీ ఈ లోపే ఫేస్‌బుక్ జియోలో అఫిషియల్‌గా పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు..

 మరోవైపు డిజిటల్ సర్వీసులను భారత్‌లో విస్తరించే వ్యూహంలో ఉన్నట్లు ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించడం కూడా వ్యూహాత్మకంగానే చూడాలి..నెట్ న్యూట్రాలిటీ రంగంలో భారత్‌లో ఆ సంస్థకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది..ఎయిర్‌టెల్‌తో కలిసి 2016లో ఫ్రీ బేసిక్స్ అంటూ ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించగా..ట్రాయ్
వాటిని తిప్పికొట్టింది.. తర్వాత ఈ విషయాన్ని పరిశీలిస్తామంటూ ట్రాయ్ అప్పట్లోనే ప్రకటించింది..తాజాగా జియోతో  జట్టు కట్టడం ద్వారా నెట్ న్యూట్రాలిటీ కోసమంటూ బ్యాక్ డోర్ తట్టారనే విమర్శలూ వస్తున్నాయ్...ఐతే తాము మాత్రం భారత్‌లో క్రిటికల్ ప్రాజెక్టుల కోసమే వస్తున్నామని మార్క్ జుకర్ బర్క్ ప్రకటించారు..ఈ కామర్స్ వ్యాపారానికి చాలా అవకాశాలున్నాయని ..భారత్ తమకి ప్రత్యేకమైన చోటు అంటూ చెప్పుకొచ్చాడు..ఫేస్‌బుక్, వాట్సాప్‌కి భారీ బేస్ ఇక్కడుందని చెప్పిన జుకర్ బర్గ్ ఇండియా డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో తాము సాయపడతామన్నాడు... పైకి ఏం చెప్తున్నా కూడా రెండూ వ్యాపారసంస్థలే..అందులోనూ ఫేస్‌బుక్‌పై వచ్చినన్ని డేటా లీకేజ్..ఆరోపణలు ఏ సామాజిక మాధ్యమంపైనా రాలేదు. అందులోనూ భారత జనాభానే రెండు సంస్థల వ్యాపారానికి పెద్ద మార్కెట్..ఫేస్‌బుక్‌కి భారత్‌లో 24కోట్లమంది యూజర్లున్నారు..జియోకి 38కోట్ల80లక్షలమంది కస్టమర్లున్నారు..రెండు సంస్థల మధ్య డేటా మార్పిడితో వ్యాపారం ఎక్కడికో వెళ్లిపోతుందనే అంచనాలు ఉన్నా...డేటా సేఫ్టీపైనా సందేహాలు రాకతప్పదు.. ఎందుకంటే ఈ రెండుకంపెనీల యూజర్ల డేటా  ఎలా మార్పిడి చేసుకోబోతుందీ ప్రకటించలేదు..ఇలాంటి నేపధ్యంలో మోదీ నేతృత్వంలోని కేంద్రం  జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నారు చేసుకోవాలి కూడా..

Comments