ఏంటీ చైనా తాటతీయడానికే ఇండియాకి డబ్ల్యూహెచ్ఓ ఛైర్మన్ గిరీ ఇస్తున్నారా..కాస్త మైండ్ వాడండ్రా సామీ


రెండు రోజుల నుంచి ఓ స్థాయిలో జరుగుతుంది..రేపట్నుంచి  మోడీ భజనకారులకు , భక్త బృందాలకు ఇక ఫుల్ పనే పని..చైనాకి చెక్ పెట్టేందుకు భారత్ రంగంలోకి దిగబోతోంది..ఇక చైనా వైరస్‌ని చీల్చి చెండాడబోతుంది..విపరీత్మైనా పారదర్శకతకి అద్దానికే మెరుగులు దిద్ది కొత్త రూపం చూపించగల ట్రాన్స్ పెరెన్సీ కనబరచినందుకు మోదీ హయాంలో భారత్ కీర్తి...ఎక్కడ..కో...వెళ్లబోతుందంటూ చిడతలతో సహా బ్యాచ్ సిద్ధమైపోతుంది...

ఏంటయ్యా అంటే వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఛైర్మన్ పదవిని భారత్ దక్కించుకోబోతోందనేది దాని సారాంశం..అది కూడానట..పెపెంచం అంతా చైనానే వైరస్ విషయంలో దోషిని చేస్తుంది..ఇప్పుడిక ఇండియా చేతిలో కొరడా పెట్టి వుహాన్ దిశగా దర్యాప్తు బృందాలను నడిపేసి...అక్కడనున్న చెడు శాస్త్రవేత్తలను..వైరస్ వ్యాపించేలా చేసిన వెధవాయలను చీల్చి చెండాడి పచ్చడి పచ్చడి చేసేసి అసలు నిజాలను బైటికి తీసుకురాబోతోంది ఇండియా అంటూ రాతకోతలు ప్రారంభమయ్యాయ్..

అసలిందులో నిజం ఎంత? ఏదీ నిజం కాదు..ఒక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఛైర్మన్ పదవికి భారత్ ప్రతినిధి ఎన్నిక కాబోవడం తప్ప...జపాన్ తన పదవీ కాలం ముగియడంతో..రొటేషన్ పద్దతిలో ఇండియా ఎక్జిక్యూటివ్ బోర్డ్ ఛైర్మన్ అవబోతుంది..ఇది ఏడాది క్రితమే డిసైడైంది..జస్ట్..అంతే...ఇందులో కోవిడ్ 19 పాత్ర..అందులో చైనా రోల్ పై మీటింగూ లేదు..రోకలీ  లేదు..ఎవరో ఎక్కడో ఓ లింక్ చూస్తారు..అచ్చంగా దాని కింద మన కామెంట్లను కూడా టైటిల్ కలిసి వచ్చేట్లు ఫార్వార్డ్ చేస్తారు..అది చూసీ చూడంగానే నచ్చేశావే..అంటూ భజన ప్రారంభమైపోతుంది..అంతే..

వాస్తవానికి ఏడాదికాలానికి భారత్ డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లోకి రావడం..ఛైర్మన్ గిరీ తీసుకోవడం ఈ సమయంలో కీలకం అంతేకానీ..దానికి చైనా పని పట్టేందుకు పదవి ఇచ్చారని రాసుకుంటే..బూడిద కూడా రాలదు..ఐతే డబ్ల్యూహెచ్ఓ డిజి..టెడ్రోస్ చేసే పనులకు ఈ ఛైర్మన్ హెడ్ నాట్ మాత్రం తప్పనిసరి. కేంద్రం చెప్పే మాటలకు .రాష్ట్రపతి ఆమోదముద్రల్లాగా..అంతే
ఐతే యూట్యూబ్ స్టోరీలకు మాత్రం ఇది బాగా పనికి వస్తుంది చైనా తాట తీయబోతున్న ఇండియా...వుహాన్ వైరస్ గుట్టు విప్పనున్న భారత్..ఇలా ఎవడిష్టం వచ్చిన టైటిల్స్ వాళ్లు బెట్టుకోవచ్చు...

Comments

  1. ఇంతకీ ఆ వార్త ప్రసారం చేసింది ఎవరు. యూట్యూబ్ ఛానెలా లేక పేరొందిన ఛానెలా?

    ReplyDelete
  2. లేదు యూ ట్యూబ్ ఛానల్స్ కొన్ని హడావుడి చేస్తున్నాయ్..అంతే ఇంకా వాటితో పోటీ పడే చానళ్లు గుర్తించలేదా విషయం

    ReplyDelete

Post a Comment