సో..సంపాదించడం నేరం..దానం చేయకపోవడం మరీ ఘాతుకం


కరోనా కాలమనే కాదు..ఏ విపత్తు వచ్చినా కూడా కొంతమంది వదాన్యులు తమకి తోచినంత ఆర్ధికసాయం చేస్తుంటారు..కొంతమంది తమకి తోచినట్లు సాయం చేస్తారు..ఒక్కోసారి మాట సాయం కూడా ఎంతో విలువైనదే..ఐతే ఈ మధ్య పెతోడూ ఫలానా వాడు అసలు ఏం చేయలేదట..అంత సంపాదించి..ఇఁతే దానం చేయడమేంటి అంటూ దూషణలు..చీత్కారపర్వాలలో ఆరితేరిపోతున్నారు...ఈ సోకాల్డ్ మేధావులు...మర్యాదరామన్నల్లో ఊరికి నిజంగా ఉపకారులు ఎంతమంది ఉంటారో తెలీదు..తాము వెళ్తున్న రోడ్డులో ఎన్నిసార్లు ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చి ఉంటారో కూడా తెలీదు..కానీ లోకానికి నీతులు చెప్పడానికి మాత్రం బయలుదేరుతారు..

ఆపదకాలంలో ఆదుకోవడం అంటే..అదే మనసుకు సంబంధించింది..ఈ రోజు మనకి అవసరం అనిపించింది రేపు భారం అవ్వొచ్చు..అఁదుకే కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికో..ఎడమచేతికి కూడా తెలీకుండా కుడిచేతితో ఇవ్వాలనో అంటుంటారు..కరోనా బాధితులను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్‌కి పాతికక ోట్లు ఇవ్వాలనిపించింది..ఇచ్చాడు..మరి ధోనికి లక్ష రూపాయలే ఇవ్వాలనిపించింది ఇచ్చాడు.. ఈ రెండు సందర్భాల్లోనూ మనమే న్యాయనిర్ణేతలమా..ఒకడు గొప్ప..మరొకడు వేస్ట్ అని తీర్పులు ఇవ్వాలా...ఏమో రేపు అక్షయ్ ఫ్యూచర్‌ల ో ఎలాంటి పదవి దక్కుతుందో..(ఐతే ఈ ఒక్కమాటతో ఆయన దానాన్ని , మంచిగుణాన్ని తక్కువ చేయడం లేదు)


అలానే చిరంజీవి కోటి రూపాయలు ఇచ్చాడు మహేష్ బాబు ఏమీ ఇవ్వలేదు...ఫలానా సుబ్బారావ్ భలే చేశాడు...ఎంకట్రావ్ మాత్రం ఏం చేయలేదు..జస్ట్ ట్వీట్ మాత్రమే చేసాడు..అనే రాతలు ఎందుకు...ఓ వేళ నిజంగా అపరదానకర్ణుడిలాగా భజన లు చేయించుకుని..ఆ తర్వాత ఓ పదివేలో..లక్షో దానం ప్రకటిస్తే..అప్పుడు వాళ్లపై విరుచుకుపడండి..అప్పుడైనా మనకేంటి హక్కు..ఎవడు ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తాడో మనకేం తెలుసు..అక్కడికి భారీగా సంపాదిస్తే...మహా నేరం..దాన్ని దానం చేయకపోతే...పంచమహా పాతకం అన్నట్లుగా వ్యవరించడం ఖచ్చితంగా భావదారిద్ర్యమే..

Comments