పరమ నీచానికి నిలువెత్తి నిదర్శనమీ రాజకీయం.కరోనా కాలంలో ఇలానారా స్టోరీలు వేసేది ?


రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం..ఎదుటివారిపై బురద చల్లడం కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది..ఐతే కరోనా మాత్రం కామన్ కాదు..అసలు ఈ పీడ విరగడ అయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుందో..ఎంతమంది మిగులుతారో..(నాతో..మీతో అందరితో సహా) తెలీని పరిస్థితి...ఇలాంటి సమయంలో పాలిటిక్స్ చేస్తే ప్రయోజనం ఏంటి..పైగా ఎన్నికలు ఇంకో నాలుగేళ్లకి కానీ లేవ్..ఇలాంటి స్థితిలో ఓ పే..ద్ద అనుభవం ఉన్న నాయకుడు..ఓ గో...ప్ప ఛానల్ కలిసి నడిపిస్తున్న వ్యవహారం చూస్తే..రోత పుట్టకమానదు..రోత కాదు థూ..అని జీవితంలో తొలిసారిగా ఊయాలనిపిస్తుంది..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు మెడికల్ షాప్‌కి వెళ్లి వస్తుంటే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారని..దెబ్బలు తాళలేక ఆ యువకుడు చనిపోయాడని టీవిల్లో స్క్రోలింగ్ చూసాం..ఎవరా..ఎందుకిలా జరిగిందనుకునేలోపే...ఆ గంట గడిచిన తర్వాత...సదరు సోంబేరి ఛానల్‌లో...పెద్ద పెద్ద అక్షరాలతో వస్తోంది. 
స్లిం యువకుడిపై దాడిని ఖండించిన చంద్రబాబు...సంయమనం పాటించాలని పోలీసులను కోరిన చంద్రబాబు...ఔషధాల కోసం వెళ్లిన యువకుడిపై దాడి గర్హనీయం...ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలి..
 ఏం జరగాలని కోరుకుంటే ఇలాంటి స్క్రోలింగ్స్ వేస్తారు..? అంటే పోలీసులు ముస్లిం కాబట్టి కొట్టారనా...? ఎందుకోసం వెళ్లాడో కూడా ఏపీ ప్రధానమంత్రికి వెంటనే తెలిసిపోయింది హైదరాబాద్‌లో కూర్చుని..అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఛానల్ అధినేత కొంప కూడా ఇక్కడే ...వాళ్లూ వాళ్లూ మాట్లాడేసుకుని..ఇలాంటి సంకేతాలు పంపడం ఏంటి..అంటే హైదరాబాద్‌లో అద్దాలమేడలో కూర్చుని రాళ్లు విసిరితే ఏపీలో ఏదో జరిగిపోతుందనా..? 

లాక్‌డౌన్ సమయంలో బైటికి రావడం తప్పు..పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడానికి కూడా పరిమితులు ఉంటాయ్..చచ్చేట్లు కొట్టమని ఎవరూ చెప్పరు..అలా చేయకూడదు..పోలీసుల ఓవరాక్షన్‌పై ఏమైనా ఎగిరిపడండి తప్పులేదు..అంతేకానీ ఫలానా వర్గం వాడిపై దాడి అంటూ రెచ్చగొట్టడం ఏంటి..? ఇంత దుర్మార్గమా...? అంటే అక్కడ రెచ్చిపోయి ఏదైనా గొడవలు జరిగితే..దానికి ప్రభుత్వాన్ని బాధ్యులు చేసి చంకలు గుద్దుకుందామనా...? ఎక్స్ గ్రేషియా అంటూ మొసలి కన్నీరు కార్చేబదులు ఎందుకిలా జరిగింది..పోలీసులకే ఫోన్ చేసి ఉంటే మెడిసిన్స్ కూడా ఇంటికే పంపుతారు కదా..అనో..బ్యాలెన్స్‌డ్ గా మాట్లాడనప్పుడు ఎన్ని పుట్టినరోజులు వస్తేనేం పోతేనేం..ఇదేనా రాజకీయం..పైగా ఈ మద్య ప్రతోడూ...వాళ్లపై పడి ఏడుస్తున్నారు..వీళ్లపై పడి ఏడుస్తున్నారనే సన్నాయి నొక్కులు నొక్కేబదులు..మీ బాబులకు సుద్దులు చెప్పుకోవచ్చు కదా..

Comments

  1. నిన్న మహారాష్ట్ర లో ఇద్దరు సాధువులను కొట్టి చంపారు. ఆ వార్త మాత్రం MSM లో ఎక్కడా రాదు. పోలీసులు చేష్టలుడిగి పోయి కళ్ళముందే జరుగుతున్నా ఘోరాన్ని ఆపలేదు.

    మన దగ్గర 40 ఏళ్ల అనుభవం చేసే నికృష్ట రాజకీయం మాత్రం పచ్చ దరిద్రాలు పారాయణం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతాయి. థూ మీ వెధవ బతుకులు. మీకు నికృష్ట ఉపాధులలో అతి నీచమైన పై జన్మలు తప్పవు.

    ReplyDelete
  2. "ఓ గో...ప్ప ఛానల్"

    "సదరు సోంబేరి ఛానల్‌లో"

    ఏ సోంబేరి ఛానెల్ గురువు గారూ? విశ్వ విఖ్యాత నట విజనరీ గారింటికి దగ్గర్లో ఉన్నవి *రెండు* అనుకుల చానెళ్లు కనుక అడగాల్సి వస్తుంది!

    ReplyDelete
  3. కొడాలి నాని మొన్న వేసాడుగా..యూట్యూబ్ కి పోటీగా తయారైందని...ఐదు వేళ్లూ చూపించి మరీ చెప్పాడు

    ReplyDelete
  4. Abbo Tellari leste rajyaanga badha padavullo undi assembly saakshi gaa AA KULAM antoo peru etti titte meeku Rajakeeya avasarala kosam janalaa madhya chichu petti gaelichina meeku ee roju ilaa adige arhta undaa?

    ReplyDelete

Post a Comment