వుహాన్‌కి గుజరాత్‌ వైరస్‌కి లింకేంటి..అహ్మదాబాద్‌లో విస్ఫోటనానికి రీజన్..!



గుజరాత్‌లో వైరస్ మరణాల ఉధృతికి..చైనాలోని వుహాన్‌కి సంబంధం ఉందా..? దేశంలోనే అత్యధికంగా  ఇక్కడే మరణాల రేటు ఉండటానికి కారణమేంటి...నెల క్రితం వరకూ డబల్ డిజిట్‌లో వైరస్ కేసులున్న గుజరాత్ ఇప్పుడెందుకు డెత్‌టోల్‌లో హాట్‌ స్పాట్‌గా మారింది. 
వుహాన్ వైరస్ గుజరాత్‌లో ఎలా బైటపడింది ?
హఠాత్తుగా డెత్‌టోల్ పెరగడానికి వుహాన్ లింకే కారణమా..కావచ్చు..


 ఓ నెల క్రితం సేఫ్‌గా కన్పించిన గుజరాత్‌లో ఇప్పుడు మరణమృదంగం మోగడానికి కారణం..చైనా వుహాన్ సిటీలో ఏ వైరస్ స్ట్రెయినైతే..వ్యాపించిందో..అచ్చంగా అదే వైరస్ అహ్మదాబాద్ సహా అనేక ప్రాంతాల్లో విస్తరించిందిట..అందుకే ఇక్కడ హఠాత్తుగా మరణాల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయిందంటున్నారు..దేశవ్యాప్తంగా మరణాల రేటు ఒకలాగా..గుజరాత్‌లోనే భారీగా ఉండటానికి కారణం ఇదేనంటున్నారు..


నోవెల్ కరోనా వైరస్ తన కోరలు చాచడం ప్రారంభమైంది వుహాన్ సిటీలోనే..ఐతే ఇతర దేశాలకు పాకుతున్నప్పుడే దానిపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు ప్రారంభం అయ్యాయ్.. ఏదేశంలో వైరస్ కేసులు పెరిగినా..అక్కడి జన్యుక్రమాన్ని విశ్లేషించడం దానికి తగ్గట్లుగా కోడ్ రాసుకుని..డ్రగ్స్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది..ఇది జరుగుతున్నప్పుడే ముఖ్యంగా నోవెల్ కరోనా వైరస్ రెండు స్ట్రెయిన్ల రూపంలో బాధితులకు సోకుతున్నట్లు గుర్తించారు..వాటిలో ఎల్ షేప్‌ కరోనా వైరస్ చైనా, ఇటలీ, అమెరికాకి పాకినట్లు సైంటిస్టులు గుర్తించారు..ఇవే ఎక్కువ ప్రమాదకరమని విశ్లేషించారు..ఇంకోటి ఎస్ టైప్ స్ట్రెయిన్ వ్యాపించిన దేశాల్లో మరణాలు రేటు కాస్త తక్కువ ఉన్నట్లు గుర్తించారు..గత నెలలో దీనికి సంబంధించే సీటెల్ గ్రౌండ్‌జీరో నుంచి ఓ భారతీయ డాక్టర్ సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది..సీన్ ఇప్పుడు కట్ చేస్తే...భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్న దశలో గుజరాత్‌లో బైటపడిన వైరస్ స్ట్రెయిన్ ఎల్ షేప్‌దిగా గుర్తించారు..జినోమ్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఈ విషయం బైటపడిందనేది .గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ సిజి జోషి అనే పెద్దాయన మాట


భారత్‌లో ఇప్పటిదాకా ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎస్ టైప్ వైరస్ ప్రబలిందనే వాదన ఉంది..ఐతే గుజరాత్‌లో ఎల్ టైప్ వైరస్ స్ట్రెయిన్ కనబడటంతో..ఇది ప్రమాదకరంగా భావిస్తున్నారు..కరోనా వైరస్ ఇతర జబ్బులతో బాధపడేవారికి ప్రాణాంతకమే కానీ..దానంతట అదే ప్రాణాలు తీసేంత శక్తి లేదు..కానీ ఎల్ టైప్ విరులెంట్ స్ట్రెయిన్ మాత్రం కొరకరాని కొయ్యగా మారి పేషెంట్లకు ఓ పట్టాన తగ్గదని కూడా ఇతర దేశాల్లోని పరిశోధనలు స్పష్టం చేశాయ్..ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం..ఒక్క గుజరాత్ మాత్రమే కాదు...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూడా ఈ విరులెంట్ స్ట్రెయినే వ్యాపిస్తున్నట్లు చెప్తున్నారు.. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య హఠాత్తుగా పెరిగింది..అందుకే కరోనాని ఇప్పుడు మరింత జాగ్రత్తగా డీల్ చేయాలని అసలే మాత్రం లైట్ తీసుకోవద్దంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Comments