కరోనాతో నష్టపోయాం ఓ రెండు లక్షల కోట్లివ్వండి..ఆ ఐదు రాష్ట్రాల విన్నపం

మాకో 50వేలకోట్లని మహరాష్ట్ర
మాకు 80వేల కోట్లు కావాల్సిందేనంటూ కేరళ
మాకు పాతిక కావాలంటూ మమతబెనర్జీ...మాకు 30వేల కోట్లు మూడేళ్లలో .మాకు 40వేలకోట్లివ్వండని రాజస్థాన్....మాకు 9 వేలకోట్ల చాలు అని తమిళనాడు కేంద్రానికి విజ్ఞప్తులు పంపాయ్..
కరోనా సీజన్ కావచ్చు..ఏదైనా కావచ్చు..కష్టకాలంలో తమని ఆదుకోవాలంటూ కేంద్రం ముందు భారీ డిమాండ్లే పెట్టేశాయ్..ఇప్పటిదాకా కేంద్ర ఆర్ధికశాఖే లక్షాడైబ్బైవేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి ఊరుకుంటే ఐదు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు మాత్రం ఏకంగా తమకి రెండులక్షలపాతికవేలకోట్ల మేర ఆర్ధిక సాయం చేయాలంటూ డిమాండ్లు పెట్టాయ్..ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మే 3 తర్వాత తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తామని..ఐతే ఆర్ధికంగా మాత్రం కేంద్రమే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశాయ్.


ఈ రాష్ట్రాలు కోరుతున్న సాయం..జిఎస్టీలో రాష్ట్రాలకు పంచాల్సిన పన్నులవాటాకి అదనం..వేస్ అండ్ మీన్స్‌ పరిమితి కూడా పెంచాలంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మరో డిమాండ్..ఇదే కేంద్రప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది..ఇంతవరకూ రెండో దశ ప్యాకేజీని ప్రకటించని కేంద్రం..రాష్ట్రాల డిమాండ్లతో మరింత చిక్కుల్లో పడింది..

  పంజాబ్, మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాలు కేంద్రం కనుక ఆర్ధికంగా ఆదుకోకపోతే..ఏప్రిల్ నెల జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించాయ్.. మోదీ సర్కారు గత వారమే కేంద్రపథకాల్లోనుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా నిధులను, జిఎస్టీలో వాటాతో పాటు..పెండింగ్ నష్టపరిహారం, డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కొంత మొత్తాలను ఇప్పటికే విడుదల చేసింది..ఐతే అవి ఏ మూలకీ సరిపోవని కొన్ని రాష్ట్రాల వాదన..దీంతో  కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కేంద్రాన్ని బెదిరించే ధోరణికి సిద్ధపడ్డాయ్..జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్..కేంద్రం కనుక ఆర్థికంగా సాయం ప్రకటించకపోతే..ఏకంగా కోర్టుకే వెళ్తామంటూ ప్రకటించారు..

 కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి లాక్‌డౌన్‌లో వాటిల్లిన నష్టాలను పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటూ స్పష్టం చేసింది..ఆ రాష్ట్ర సిఎస్ టామ్ జోస్ ఈ మేరకు హోమ్ మినిస్ట్రీ కార్యాలయానికి ఓ లేఖ రాశారు....ఎంఎస్ఎంఈ, హోటల్, టూరిజం, ఫిషరీస్, ఐటీ, స్వయంఉపాధి ఇలా ప్రతి రంగం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుందని ..వీటన్నింటికి పరిహారంగా కేంద్రం కేరళకి రూ.80వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు కేరళ సిఎం విజయన్..ఇవన్నీ చేయకుండా వీడియో కాన్ఫరెన్స్‌లతో ప్రయోజనం లేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రానున్న ఐదు నెలల్లో దశలవారీగా రాష్ట్రానికి 50వేలకోట్లు సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు..చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ మాత్రం రానున్న మూడేళ్లలో తమ ప్రభుత్వానికి 30వేలకోట్ల రూపాయల నష్టపరిహారం కావాలని సరిపెట్టారు..రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మాత్రం తమ రాష్ట్రానికి 40వేలకోట్ల రూపాయల రిలీఫ్ ఫండ్ కోరడంతోపాటు..లక్షకోట్ల నేషనల్ కోవిడ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయాలంటూ సూచించారు..

 పశ్చిమబెంగాల్ ప్రభుత్వానిదీ అదే దారి..తమ రాష్ట్రానికి పాతికవేలకోట్ల మంజూరు చేయాలని సిఎం మమతా బెనర్జీ కోరారు.. నేషనల్ కోవిడ్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా..అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోని ప్రతి కార్మికుడి బ్యాంక్ అక్కౌంట్‌కి నేరుగా పదివేల రూపాయలు జమ చేయాలని కోరారు.అలానే ఉపాధి హామీ పనులను వంద రోజులనుంచి 150రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేసారు..
 పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తమ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీలోని వాటాపై ప్రశ్నించారు..తమకి దాదాపు రూ.4387కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేసారు..వ్యవసాయ కూలీలు, రైతులకు డైరక్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోరారు..పిఎం కేర్స్ ఫండ్‌కి ఇచ్చే విరాళాలను వివిధ రంగాల్లోని సంస్థలు చేసే కంట్రిబ్యూషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ-సిఎస్ఆర్ యాక్టివిటీస్‌ కింద పరిగణించాలంటూ విజ్ఞప్తి చేశారు..

 లాక్‌డౌన్ కాలంలో  రాష్ట్రాలు అప్పు తెచ్చుకునే 3శాతం పరిమితిని కూడా 5శాతానికి పెంచాలంటూ ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్రం ముందు డిమాండ్ పెట్టాయ్. రాష్ట్రాల అభివృద్ధి కోసం తీసుకున్న అప్పుల చెల్లింపులపైనా మూడు నెలలపాటు వాయిదా..కేంద్రసాయంతో వివిధ పథకాల కింద రుణాల మంజూరు కూడా పలు రాష్ట్రాలను కోరుతున్నాయ్. మొత్తం మీద తమ ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల ద్వారా సమయం చూసి పార్టీలు కేంద్రాన్ని ఇరుకునబెట్టాయని..ఆర్ధికసాయం చేయాల్సిన అవసరాన్ని అందరికీ తెలిసేలా చేశాయంటున్నారు..ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాల డిమాండ్లపై కేంద్రం కూడా ఏమీ అనలేని పరిస్థితి..కరోనా విజృంభణతో దేశమంతటా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది..రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోయిన పరిస్థితిలో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది..అలాగని..కేంద్రం దగ్గర కూడా ఆదాయానికి దారి కన్పించడం లేదంటారు..అందుకే ఇప్పుడు ప్రతిపక్షప్రభుత్వాల డిమాండ్లు మోదీ సర్కారుని పెద్ద ఇరకాటంలోకి నెట్టేసాయ్

Comments