ఆ వెయ్యి కాదు..ఈ రెండు మరణాలే మాకు పండగ..మీడియా హడావుడి..


శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే...ఎంత కరువు ఉంటేనో..ఆ పని చేయలేరు..తీవ్రమైన దారిద్ర్యం..ఇంకే పనీ చేయలేని నిస్సహాయత ఉన్నప్పుడు ఇలా అడుక్కుతినడం ..అదీ దొరకకపోతే..ఏవైనా శవయాత్రలు జరుగుతుంటే..వాటిపై జల్లే చిల్లర..పేలాలు..శెనగలు ఏరుకుని తింటుంటారు..అభాగ్యులు..చనిపోయిన తర్వాత కూడా సదరు వ్యక్తి వీళ్లకి తిండిపెట్టినట్లవుతుది..అక్కడ్నుంచే ఈ సామెత కూడా వచ్చిందనుకోవాలి...శవాలపై పేలాలు విసరడం ఇప్పుడు ఎన్ని చోట్ల జరుగుతుందో తెలీదు కానీ...సామెత మాత్రం అవతలి పార్టీలపై విమర్శలు చేయడానికి పొలిటికల్ లీడర్లు ఎడా పెడా వాడేస్తుంటారు..

ఇప్పుడు కరోనా కాలంలో అందరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..అంత్యక్రియలకు కూడా మనుషులు దొరకని పరిస్థితి..ఇలాంటి సందర్భంలో మరణాలు..కేసుల సంఖ్యలతో తప్ప పెద్దగా సెన్సెేషన్ లేని మీడియాకి..అప్పుడప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైట్స్ తప్ప పెద్దగా పని దొరకడం లేదు..నిన్నటి నుంచే రాహుల్ గాంధీ కూడా కేంద్రాన్ని గెలకడం ప్రారంభించాడు.. ఇకపై ఇదే ధోరణి కొనసాగవచ్చు కూడా..ఎందుకంటే కేంద్రం పెద్దగా మాటలు తప్ప...డబ్బు సాయం చేసింది లేదు ఈ క్షణం వరకూ..

ఇలాంటి సందర్భంలోనే ఇర్ఫాన్ ఖాన్ నిన్న చనిపోవడంతో మీడియాకి కదలిక వచ్చింది..ఆయనపై కథనాలు..స్టోరీలతో హడావుడి మొదలైంది. ఇదిగో ఇప్పుడు రిషీ కపూర్ కూడా కన్నుమూయడంతో ఇక ఎక్కడలేని సందడి నెలకొంది..విమర్శ అనుకోండి..ఇంకోటనుకోండి..ఈ రెండు మరణాలతో హిందీ మీడియా సంగతేమో కానీ..తెలుగు మీడియా మాత్రం వీలైనంత రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది చూడండి..దీన్ని శవాలపై పేలాలు ఏరడం కాక ఇంకేమంటారు..ఎందుకంటే ఈ నెల రోజుల్లో రెండు మరణాలు..ఎవరికీ పట్టకుండా..ఓ మూలనపడేసారు..ఎందుకంటే  ఈ తరానికి వాళ్లు పెద్ద ఆనరు అనే ఉద్దేశంతోనే...ఒకళ్లు నటుడు దర్శకుడు నాటకరంగ ప్రముఖుడు అయిన విస్సు...మార్చి నెల మూడోవారంలో అనుకుంటా చనిపోయాడాయన..ఇంకొకరు సి.ఎస్ రావ్ ఊరుమ్మడి బతుకులు , కమలమ్మ కమతం, ప్రాణం ఖరీదు..కుక్క కాటుకి చెప్పుదెబ్బ లాంటి 20 సినిమాలకు రైటర్...వీరిద్దరూ మరీ కనీసం ఓ అరనిమిషం వార్త కూడా వేయలేనంత చిన్నవాళ్లు కాదు..కనీసం ఓ ఐదు నిమిషాల వార్తకి అర్హులే...వాళ్లని వదిలేసి...ఇప్పుడిలా రెచ్చిపోతున్న మీడియాని చూస్తే..పైన సామెత గుర్తుకురాకమానదు మరి...

Comments