ఎక్కడైనా కరోనా ముందు లాక్‌డౌన్ కావాల్సిందేనా..జపాన్ కూడా..



కరోనా కట్టడిపై తన స్టైల్లో ముందుకు కదిలిన జపాన్ కూడా ఇప్పుడు లాక్ డౌన్ బాటపట్టాల్సి వస్తోంది...ఐతే అందులోనూ తన స్పెషాల్టీ ప్రూవ్ చేసుకుంటోంది..నిబంధనలు పాటించమని సూచించడమే తప్ప...ఎవరినీ అరెస్ట్ చేయడం లేదు..ఎందుకంటే జపాన్‌లోని చట్టాలే అందుకు కారణం

జపాన్ ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఎందుకు ఉన్నాయంటే..రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా మానవ హక్కులకు భంగం కలిగిందనే వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం..ప్రజలకు కొన్ని హక్కులు సంక్రమింపజేసింది..అందులో భాగంగానే ఇప్పుడు లాక్‌డౌన్ పెట్టినా..నిబంధనలను పాటించాలనే సూచనలే తప్ప..పాటించకపోతే అరెస్ట్ చేసే అధికారం జపాన్ ప్రభుత్వానికి లేదు..ఐతే ప్రభుత్వ ఆదేశాలను
ఇక్కడి సమాజం అమలు చేయడమనేది ఓ సంప్రదాయంగా వస్తుందని..కాబట్టే లాక్‌డౌన్ అమలులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కొంతమంది పరిశీలకుల అభిప్రాయం.

 జపాన్‌ ఇప్పటివరకు 3,650కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని టోక్యోలో దాదాపు 1000 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్..అందుకే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ తెరపైకి వచ్చింది..గత మార్చిలోనే ఇందుకు సంబందించిన చట్టం కూడా రూపొందించారు..దీని ద్వారా ఏదైనా వ్యాధి విస్తృతంగా వ్యాపించినప్పుడు, ఆర్ధికరంగం కుదేలైనప్పుడు..దేశంలో ఎమర్జెన్సీని రెండేళ్ల వరకూ కూడా
విధించే అవకాశం కలిగింది..

Comments

  1. ఎమర్జెన్సీ విధించడం వల్ల జపాన్ ప్రభుత్వానికి ప్రయివేటు భూముల్లో కూడా అవసరార్థం హాస్పిటల్ నిర్మించే అధికారం లభిస్తుంది. దానికి భూ యజమానుల అంగీకారం అవసరం లేదని విన్నాను.
    అలాగే ఆఫీసులు కూడా అఫీషియల్ గా తమ ఉద్యోగుల్ని వీలైనంతవరకు ఇంటినుంచి పనిచేయమని ఆదేశిస్తాయి.

    ReplyDelete
  2. ఆదేశించాయ్..కానీ అక్కడ వాళ్లు ఎక్కువ ఆఫీసులకే వెల్లి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు..అందుకే లాక్ డౌన్ ప్రకటించేసింది

    ReplyDelete
    Replies
    1. లాక్ డౌన్ ప్రకటించింది ఆఫీసులకి వెళ్ళేవాళ్ళ వల్లకాదు. నైటు క్లబ్బులకి తిరిగి అంటించుకున్న వారి సంఖ్య ఈమధ్య పెరిగింది. పైపెచ్చు ఎక్కడినుంచి అంటుకుందో అంచనా వేయలేనివారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకుంది.

      Delete

Post a Comment