మే నెలే మనకి ముఖ్యం..ఇక ఆ తర్వాత దేవుడే దిక్కు

కరోనాపై పోరాటంలో భారత్ విజయం సాధించిందా..వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సక్సెస్ అయిందా..ఈ రెండు ప్రశ్నలకు మే నెలే సమాధానం ఇవ్వబోతోంది...ఒక్క నెల క్రితం ఇప్పుడు చూసుకుంటే..కరోనా కేసులు సంఖ్య భారీగానే పెరిగింది..భారీగానే ఏంటి ప్రమాదకరస్థాయిలోనే ఉన్నాయ్..ఐతే వైరస్ కేసుల రెట్టింపు అయ్యే గడువు మాత్రం బాగా పొడిగించగలిగాం..అది లాక్‌డౌన్‌తోనే సాధ్యపడిందన్నది ఎవరూ కాదనలేరు..ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైంది..ఐనా కూడా ముందు ప్రాణాలు..తర్వాతే ప్రపంచం అనే కాన్సెప్ట్‌తో భారత్ ముందుకే వెళ్తుంది..

 వైరస్ కేసులు పెరుగుతున్నా..కేంద్రం మాత్రం డబ్లింగ్ రేటుని చూపిస్తూ ఏవేవో లెక్కలు చెప్పొచ్చు కానీ మే నెలలోనే అసలైన సవాలు ఉంది.. రెడ్ జోన్లు..గ్రీన్ జోన్లు అంటూ వైరస్ తీవ్రతని బట్టి విభజన చేయడం వాటిలో వెసులుబాటు కల్పిస్తామంటూ వాస్తవానికి ఏప్రిల్ 14కి ముందే హడావుడి జరిగింది..కానీ అవేమంత వర్కౌట్ చేసినట్లు కన్పించలేదు..ఇప్పుడు కూడా కంటైన్మెంట్ జోన్ల సంఖ్య తగ్గుతున్నట్లు ప్రకటించింది..దానికి తోడు రెడ్‌జోన్లలో కంటైన్మెంట్ స్ట్రాటజీని కూడా సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.. 9 రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో హెవీగా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్రం...కరోనాపై పోరాటంలో విజయం సాధించడానికి ఇక్కడ మానిటర్, కంటైన్, టెస్ట్, ట్రీట్‌మెంట్ అని నాలుగంచెల్లో పోరుకి సిద్ధమైంది..ఈ మేరకు నీతిఅయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ ఓ ట్వీట్ కూడా చేశారు..

వీటికి తోడు మే నెలలో తీసుకునే చర్యలే మన భవిష్యత్తుకి ర్యూట్ మ్యాప్ సిద్ధం చేస్తాయ్..ఎందుకంటే జూన్ నెల వచ్చిందంటే వర్షాకాలం ప్రారంభం అవుతుంది..ఎండలతో కరోనా చచ్చేదే లేనిదే తేలకపోయినా..వర్షాకాలమంటూ ప్రారంభమైందంటే..వైరస్ వ్యాప్తి పెరగడం మాత్రం ఖాయం..దానికి తోడు సీజనల్‌గా వచ్చే స్వైన్‌ఫ్లూ, డెంగీ కేసులు కనుక తోడయ్యాయంటే అప్పుడు పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా మారవచ్చు..ఇప్పటిదాకా ప్రజలంతా ఏ చిన్నా చితకా జబ్బులకు హాస్పటల్స్ వరకూ వెళ్లకుండానే కాలం నెట్టుకొస్తున్నారు..కానీ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉండే వర్షాకాలంలో మాత్రం ప్రవేట్ ఆస్పత్రుల జోలికి పోకుండా ఉండలేరు..


  మార్చి 25 నుంచి ఏప్రిల్ 14..ముందు ప్రకటించిన లాక్‌డౌన్..అక్కడ్నుంచి ఏ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు లేకుండానే మే 3 వరకూ కూడా కొనసాగించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది..మరిప్పుడేంటి..మే 3 తర్వాత కూడా దేశానికి తాళం వేసే ఉంచాలా...వైరస్ నియంత్రణ పేరుతో ఇలా ఎన్నాళ్లు లాక్‌డౌన్‌ని పొడిగించుకుంటూ పోవాలి..ఇదే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది..కరోనా ఒకరి నుంచి ఒకరికి పాకే క్రమాన్ని అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ ఓ టూల్..అందులో సందేహం లేదు..కానీ ఇలానే ఎన్నాళ్లో ఇళ్లకే పరిమితం అయితే..మానసికరోగులుగా మారే ప్రమాదం కన్పిస్తోంది..అన్నీ ఉన్నవాళ్లకి లాక్‌డౌన్ ఓ ఆటవిడుపు..కానీ లక్షలాది వలసకూలీలకు...పరిశ్రమలు కార్యాలయాలు మూయడంతో ఉపాధి, ఉద్యోగాలు లేనివాళ్లకి మాత్రం నిత్యం నరకప్రాయమే..అది అనుభవించినవారికే తెలుస్తుంది..ప్రభుత్వం ఉప్పూ పప్పూ అందరి ఇళ్లకూ సరఫరా చేయవచ్చు..కానీ వాస్తవ పరిస్థితిలో నిజంగా చేరుతున్నాయా అనేది సందేహమే..ఈ లెక్కలను పక్కనబెడితే..లాక్‌డౌన్ టార్గెట్ కరోనా సైకిల్‌ని బ్రేక్ చేయడం..ఈ లక్ష్యంలో మనం ఎక్కడున్నామనే విషయాన్ని చూస్తే...దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రెట్టింపయ్యే వ్యవధి కూడా బాగా పెరిగింది..పదకొండు రోజులకు కానీ దేశం మొత్తం మీద వైరస్ కేసులు రెట్టింపు కావడం లేదని కేంద్రం లెక్కలు చెప్తోంది..

 అదే సమయంలో అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లోని కేసులను ప్రామాణికంగానో..మరోవిధంగానో పోల్చి చూసినప్పుడు భారత్ మెరుగ్గా ఉందంటారు. అమెరికా సహా పాశ్చాత్య దేశాలతో పోల్చినప్పుడు భారత్‌లో మరణాలు, కేసులు తక్కువే.. వెయ్యి మరణాలను బెంచ్ మార్క్‌గా చూసినప్పుడు భారత్‌లో 31,332 కేసులు నమోదు అయ్యాయ్..ఇదే సమయంలో ఇటలీలో 15,113 కేసులు నమోదయ్యే సమయానికే వెయ్యిమంది చనిపోయారు..యూకేలో 17,089మందికి వైరస్ సోకిన సమయానికే వెయ్యిమంది కరోనాతో మరణించారు. ఫ్రాన్స్‌లో 22,304మందికి కరోనా సోకిన సమయానికే వెయ్యిమంది ఆస్పత్రులలో మరణించారు..స్పెయిన్‌లో 21వేల 571మందికి కరోనా సోకగా...వారిలో వెయ్యిమంది చనిపోయారు..అలా మన దగ్గర కేసులు ఎక్కువవుతున్నా..మరణాలు రేటు తక్కువగా ఉన్నట్లు కేంద్రం చెప్తోంది...

 అమెరికా, యనైటెడ్ కింగ్‌డమ్ , ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల డబ్లింగ్ రేటుతో పోల్చుకున్నప్పుడు భారత్ చాలా సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తిని అరికట్టిందని కేంద్రం చెప్తోన్న డేటా సారాంశం..ఐతే ఇక్కడే ప్రాథమికంగా ఓ విషయం ఆందోళనకు గురి చేస్తోంది..మనం వైరస్ సైకిల్‌ని ఆలస్యం చేయగలిగామే తప్ప..అసలు పూర్తిగా బ్రేక్ చేయలేదు

.అందుకే మే నెలలోనే మనమెంత వరకూ కరోనా వైరస్ కేసులను ఈ 33 వేలో..34 వేల సంఖ్యని పెరగకుండా చూడగలమన్నదే అసలు ప్రశ్న..వాస్తవానికి వైరస్‌ని నిరోధించడానికి మనమేం మందులు వాడటం లేదు..సోషల్ డిస్టెన్స్‌నే ఆయుధంగా వాడుతున్నాం..అందుకే 130 కోట్లమందిని ఇళ్లకి పరిమితం చేసినా..ఎక్కడో అక్కడ వైరస్ వ్యాపిస్తూనే ఉంది..మరి సిచ్యుయేషన్ ఇలా ఉన్నప్పుడు లాక్‌డౌన్ తీసేస్తే...ఊహించడం కష్టమే..మరి లాక్‌ తీయకుండా ఇలానే ఉంటే..ఆర్థికంగా మరింత పతనం కావడం ఖాయం..అందుకే మే నెలలోనే మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుందనడంలో సందేహం లేదు..

Comments

  1. లాక్‌డౌన్ పద్మవ్యూహం లాంటిది అనిపిస్తోంది.
    లోపలికి వెళ్ళారు కాని, బయటకు ఎలా రావాలో తెలియడం లేదు.
    ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది పరిస్థితి.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు సమస్య saving lives Vs saving livelihoods గా మారింది. ఒక పత్రికలో ఈ వాక్యం వచ్చింది.

      Delete

Post a Comment