రియల్ ఎస్టేట్‌కి రానున్న ఆరునెలలూ గడ్డు కాలమే



భారత్ ఆర్ధికరంగంలో కీలకమైనది రియల్ ఎస్టేట్ సెక్టార్..ఒక్క ఈ రంగంపై పడే ప్రభావమే మరో 250 అనుబంధ రంగాలపై కూడా పడుతుందంటే ఇదెంత ముఖ్యమైన రంగమో అర్ధమవుతుంది..2025నాటికి దేశ జిడిపిలో నిర్మాణరంగం వాటా 13శాతానికి చేరుకుంటుందని అంచనా..

 2019 ఇండియన్ రియల్ఎస్టేట్ రంగానికి మిశ్రమ అనుభవాన్ని కలగజేసిందని కేపిఎంజి తన నివేదికలో పొందుపరిచింది  5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను 2019లో రాబట్టిన రియల్ఎస్టేట్ సెక్టార్ ఇప్పుడు కరోనా ధాటికి కుప్పకూలేలా ఉంది.ఎన్‌బిఎఫ్‌సిల సంక్షోభం, బయ్యర్ల సెంటిమెంట్ దెబ్బతినడం, డెవలపర్లు డిఫాల్టర్లుగా మారడం వంటి సమస్యలతో కొన్నేళ్లుగా రెసిడెన్షియల్ సెక్టార్ సంక్షోభంలో పడగా..వాటిని ఆదుకునేందుకే కేంద్రం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కూడా ప్రవేశపెట్టింది..ఐతే ఇంతలోనే కరోనా వైరస్ విజృంభించడం చోటు చేసుకుంది..
వాయిస్() లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సిమెంట్, స్టీల్ సహా ఇతర బిల్డింగ్ మెటీరియల్ ధరల్లో మార్పులు తప్పవ్..అలానే ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ రంగంలోని లేబర్ అంతా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు..సప్లై చైన్ తెగిపోవడంతో..రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు బాగా మందగించాయ్ .దీంతో ఈ రంగంలో దాదాపు 30శాతం ఉద్యోగాలు  మాయమవుతాయని కేపిఎంజి అంచనా..ఎఫ్‌డిఐ పెట్టుబడులు కూడా ఆగిపోయాయ్..అమెరికా, ఐరోపా దేశాల్లో ఎకానమీ స్లో డౌన్ అవుతున్న నేపధ్యంలో దేశీయంగా కూడా హౌసింగ్ సెక్టార్‌లో కొత్త కొనుగోళ్లు కనీసం ఆరునెలల వరకూ వాయిదా పడతాయనే అంచనాలు నెలకొ్న్నాయ్..ఇదే ప్రభావం హాస్పిటాలిటీ రంగంపైనా పడి భారీగా ఆర్థిక సంక్షోభంతోపాటు..లక్షలాది ఉద్యోగాలు మాయమవుతాయని కెపిఎంజి లెక్కగట్టింది..ఐతే లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ రంగంలో మాత్రం బౌన్స్ బ్యాక్ అంచనా వేయవచ్చంది..దీనికి చైనా నుంచి కంపెనీలు తమ మ్యాన్యుఫేక్చరింగ్ బేస్ మార్చుకునే అవకాశమే ఇందుకు కారణంగా కేపిఎంజి సూచించింది.

 ఈ ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు..షార్ట్ టర్మ్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఒక ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే, దీర్ఘకాలికంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ఆలస్య పరిమితిని ఆరునెలల వరకూ ఇవ్వాల్సిందిగా కేపిఎంజి ప్రభుత్వానికి సూచించింది. అలానే ఒక ఏడాది పాటు హాస్పిటాలిటీ, టూరిజం సెక్టార్లలోని ఉద్యోగులకు బేసిక్ శాలరీపై గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని కోరింది. ఇంట్రస్ట్ రీపేమెంట్లను మూడు నెలల నుంచి పన్నెండు నెలల వరకూ
డెవలపర్లకి వర్తించేలా వెసులుబాటు కల్పించాలని సూచించింది.

Comments