ఈ దొంగ తెచ్చిన తంటా జడ్జిని కూడా లాక్ చేసేసింది


పంజాబ్ లూథియాలో జరిగిందీ ఇన్సిడెంట్...ఫన్నీగా అన్పించినా...వైరస్ ఎంతగా అల్లుకుపోయిందో తెలుపుతున్న సంఘటన సౌరవ్ సెహగల్ అనే వాహనాల దొంగ ఒకడిని పోలీసులు జడ్జి ముందు హాజరు పరచగా...తెగ దగ్గడం ప్రారంభించాడట అతగాడు..దీంతో ఎందుకైనా మంచిదని జడ్జిగారు అతగాడిని హాస్పటల్ గా పంపించగానే...కరోనా సోకినట్లు తేలింది..

దానికి ముందు ఏం జరిగిందంటే ఏప్రిల్ 5న ఈ దొంగని అరెస్ట్ చేసి కోర్టులోప్రొడ్యూస్ చేశారు..ఇతగాడిని పట్టుకోవడానికి స్థానికులు ఇద్దరు సాయపడ్డారు..వీళ్లంతా కూడా దొంగని పట్టించామనే సంబరంలో ఉండగానే...రెండో రోజే ఈ సెహగల్‌కి బాగా జ్వరం వచ్చిందట..దాంతో  కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతోనే ఈ విషయం తెలిసింది..ఇంకేముంది స్టేషన్ హౌస్‌లోని ఏడుగురు..జడ్జి..దొంగని పట్టించిన మరో ఇద్దరు
అంతా క్వారంటైన్‌లోకి పోయారు.

దీంతో పాటే..నవజోత్ సింగ్ అనే ఇతగాడి స్నేహితుడు..మరో మిత్రదొంగ కోసం ఝాబేవాల్ గ్రామంలో గాలింపు మొదలెట్టారు..పట్టుకున్నారు కూడా...కానీ ఆస్పత్రికి తీసుకురాగా..అక్కడ్నుంచి జంప్ అయ్యాట్ట..అది కూడా సినీ ఫక్కీలో...హ్యాండ్ కప్స్ విప్పగానే ఎస్ఐని తోసేసి జంపయ్యాట్ట..



















Comments