ఒకరు కర్మయోగి...మరొకరి ఖర్మ కాలింది


ఎవడూ బైటికి రాకండ్రా అంటే...వినరు..సరే ఎవరి అవసరాలకు వాళ్లు వస్తారనుకుంటే.. చేతిలో బండి ఉంది కదాని
కిలోమీటర్లకి కిలోమీటర్లు చక్కర్లు కొట్టే దుర్మార్గులను..రాక్షసులను ఎన్‌కౌంటర్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్..కానీ ఇలా చెప్పే పొజిషన్లో ఉన్న నేతలే ఇలా చేస్తే...చెప్పేదెవరు..స్టోరీలో ముందు ఇలాంటి ఖర్మకాలిన లీడర్ గురించి చూద్దాం...

కవాసీ లక్ష్మణ్ అని చత్తీస్‌గఢ్ ఎక్సైజ్ మినిస్టర్ ఏకంగా 250 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ పోయాట్ట..ఎక్కడకి సామీ అంటే నాకు ఇంట్లో బోర్ కొట్టింది .రాయ్ పూర్ నుంచి రాయ్‌గఢ్ వరకూ డ్రైవ్ చేసి ఓ సన్నాసిని కలవడానికి...నాకు మనశ్సాంతి కోసం వచ్చా..అయిపోగానే పోతా అన్నాడట..కానీ అసలు
వచ్చింది ఇక్కడో లాడ్జ్‌ని పోలీసులు క్లోజ్ చేస్తే..దాన్ని ఓపెన్ చేసి అందులో  టైమ్ పాస్ చేయడానికని బిజెపి కత్తులు నూరింది.. అయ్యగారి వీడియో బైటికి రాగానే లేదు లేదు నేను వచ్చింది సడన్ విజిట్ చేసి అధికారుల అప్రమత్తత పరీక్షించడానికి అన్నాడు...

మరో లీడర్ కథే వేరు...రోడ్డుపైన ఛండాలురు..రేపిస్టులు..ఇంకా...చాలా ఇస్టులు కన్పిస్తే కాల్చేయమని ఆర్డర్లు వేయడంలో సిద్దహస్తుడిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సిఎం..ఈయన తండ్రిగారు ఆనంద్ సింగ్ బిష్త్ చనిపోయారు..ఆ విషయం యోగీగారు కరోనాపై కాన్ఫరెన్స్ నిర్వహిస్తోన్న సమయంలోనే తెలిసింది..తన మీటింగ్ కంటిన్యూ చేసారే తప్ప లేవలేదు..పైగా లాక్‌డౌన్ రూల్స్ తాను బ్రేక్ చేయను..తండ్రి అంత్యక్రియలకు వెళ్లను అని చెప్పారు
.రాసినంత..చెప్పినంత ఈజీ కాదు ఇలా ప్రవర్తించడం..ఎంత పెయిన్ ఉంటుంది మనసులో..తల్లిదండ్రులను గౌరవించవచ్చు..లేకపోవచ్చు..ప్రేమించవచ్చు లేకపోవచ్చు..వారి వారి అటాచ్‌మెంట్‌ని బట్టి బాహ్య స్పందనలు ఉండొచ్చు..కానీ మనం ప్రపంచంలోకి రావడానికే కారణం కదా..వాళ్లు అలాంటివాళ్లు  లోకం విడిచిపోతే..ఆ బాధ జీవితాంతం మనతోనే ప్రతి దశలో గుర్తొస్తూనే ఉంటుంది..

23కోట్ల ఉత్తరప్రదేశ్ వాసులకు జవాబుదారీగా..మార్గదర్శిగా ఉండాల్సిన నేను లాక్ డౌన్ రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించను అని చెప్పడం ద్వారా ఓ ఆదర్శంగా నిలిచారనే చెప్పాలి..ఐతే ఇదెక్కడా పెద్దగా సర్క్యులేట్ అవలేదు..అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్పూర్తి అందితే చాలు..

Comments

  1. గ్రాండ్ గా పెళ్లిసందడి చేసుకున్న ఇంకొకరిగురించి మరిచిపోయినట్లున్నారు!

    ReplyDelete

Post a Comment